దేశీయంగా ఇండియన్ మోటార్ సైకిల్ బైకుల తయారీ

Written By:

పొలారిస్ దేశీయంగా విక్రయకేంద్రాలను పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. ధరకు తగ్గ విలువలతో ఇండియన్ మోటార్‌సైకిల్‌ను అందుబాటులో ఉంచాలంటే, వీటిని దేశీయంగా నిర్మించడం చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని పొలారిస్ ఇండియన్ మోటార్‌సైకిల్ సంస్థకు చెందిన బైకుల ప్రొడక్షన్ దేశీయంగా ప్రారంభించడానికి సిద్దం అవుతోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
దేశీయంగా ఇండియన్ మోటార్ సైకిల్ బైకుల తయారీ

అమెరికాకు చెందిన మొదటి మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఇండియన్ మోటార్‌సైకిల్ విపణిలో శరవేగంగా విస్తరిస్తోంది. 2011 లో పొలారీస్ ఇండస్ట్రీస్ ఇండియన్ మోటార్ సైకిల్‌ బ్రాండ్‌ను కొనుగోలు చేసి 2014 నుండి అధికారిక కార్యకలాపాలు ప్రారంభించింది.

దేశీయంగా ఇండియన్ మోటార్ సైకిల్ బైకుల తయారీ

విక్రయ కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలలో ఇండియన్ మోటార్ సైకిల్ రేంజ్‌లో ఉన్న దాదాపు అన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. ఇప్పటి వరకు సంస్థ అన్ని మోటార్ సైకిళ్లను దిగుమతి చేసుకునే అందించేంది.

దేశీయంగా ఇండియన్ మోటార్ సైకిల్ బైకుల తయారీ

ఇటిఆటో కథనం మేరకు, పొలారీస్ డీలర్ల సంఖ్యను పెంచుకునేందుకు మరియు ఇండియన్ మోటార్ సైకిళ్లను దేశీయంగా ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇండియన్ మోటార్ సైకిల్ శ్రేణిలో ఛీఫ్ రేంజ్, స్ప్రింగ్ ఫీల్డ్, రోడ్ మాస్టర్ మరియు స్కౌట్ ఉన్నాయి.

దేశీయంగా ఇండియన్ మోటార్ సైకిల్ బైకుల తయారీ

ఐషర్ పొలారిస్ కు రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ తయారీ ప్లాంటు కలదు. దీని తయారీ సామర్థ్యం ఏడాదికి 60,000 యూనిట్లుగా ఉంది. అయితే ఇండియన్ మోటార్‌సైకిళ్ల తయారీ ప్లాంటు కోసం స్థల పరిశీలనలో ఉన్నట్లు పొలారిస్ ప్రతినిధులు తెలిపారు.

 
English summary
Indian Motorcycle May Finally Be Assembled In India
Story first published: Friday, February 24, 2017, 10:47 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark