రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పై మరో ప్రయోగం: ఫలించిందా... వికటించిందా...?

Written By:

స్పెయిన్‌కు చెందిన జీసస్ డి జువాన్ రాయల్ ఎన్పీల్డ్ క్లాసిక్ 500 ను మోడిఫై చేసి గ్రీన్ ప్లై అనే పేరును పెట్టాడు. గతంలో మోడిఫికేషన్స్‌కు గురైన మో పోవా మరియు డర్డీ డక్ బైకుల ఆధారంగా ఈ గ్రీన్ ఫ్లై (Fly) బైకును అభివృద్ది చేశాడు.

ఈ గ్రీన్ ఫ్లై(Green Fly) కస్టమ్ మోటార్ సైకిల్‌ను క్లాసిక్ 500 మోటార్ సైకిల్ ఆధారంగా కాంటినెన్షియల్ జిటి ఫ్రేమ్ ఆధారంగా నిర్మించడం జరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్ స్పెయిన్ విభాగ అధికారికంగా దీనిని మోడిఫై చేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ స్పెయిన్ కమర్షియల్ డైరెక్టర్ జోక్విన్ కునాట్ మాట్లాడుతూ, జీసస్ డి జువాన్ రియల్ ఛాలెంజ్‌‍గా తీసుకుని ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ గ్రీన్ ఫ్లై (Green Fly) ను నిర్మించడాని చెప్పుకొచ్చాడు.

రివైవర్ ఆఫ్ మెషీన్ అనే మ్యాగజైన్ నిర్వహించిన ఓల్డీస్ బట్ గోల్డీస్ అనే వేదిక మీద అతి తక్కువ కాల వ్యవధిలోని ఈ కస్టమైజేషన్ బైకు నిర్మిస్తాని మాటిచ్చాడు. మాట ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ స్పెయిన్ విభాగం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మోడిఫికేషన్స్ నిర్వహించాడు.

ఆఫ్ రోడింగ్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని క్లాసిక్ 500 లో అద్బుతమైన లుక్‌నిచ్చే బ్యాటరీ బాక్స్ మరియు ఎయిర్ ఫిల్టర్ విభాగాన్ని తొలగించినట్లు దీని రూపకర్త వెల్లడించాడు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 మరియు కాంటినెన్షియల్ జిటి కలయికలో రూపంతో పోసుకున్న గ్రీన్ ఫ్లై బైకులో వెనుక వైపున డ్యూయల్ సస్పెన్షన్ సిస్టమ్ స్థానంలో మోనో (సింగల్) షాక్ అబ్జార్వర్ మరియు ముందు వైపున అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ వచ్చాయి.

ఈ బైకులో పెయింటింగ్ కూడా ఓ నాలుగు మార్కులు వేయవచ్చు. లేత ఆకుపచ్చ రంగు మరియు మెటాలిక్ రంగుల కలయికతో ఉన్న రంగును ఇంధన ట్యాంకులో పొడవాటి గీతలు పడే విధంగా మృదువుగా పెయింటింగ్ చేయడం జరిగింది.

దీనికి పేరు ఎలా వచ్చిందో తెలుసా ? గ్రీన్ మరియు మెటాలిక్ బాడీ పెయింటింగ్, నల్లటి రంగులో ఉన్న సింగల్ సీటు, ఎవా పిరెరా మోటార్ వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని రాయల్ ఎన్ఫీల్డ్ మ్యాడ్రిడ్ డైరెక్టర్ దీనికి గ్రీన్ ఫ్లై (Green Fly) అనే పేరును ఖరారు చేసారు.

ఇందులో ముందు వైపున 140ఎమ్ఎమ్ సెక్షన్ మరియు వెనుక వైపున 150ఎమ్ఎమ్ సెక్షన్ గల టైర్లు ఉన్నాయి. రెండు చక్రాలకు ఇంజన్ మీదున్న పెయింట్‌నే పూయడం జరిగింది. టైర్లకు మరియు చక్రాలకు కాస్త వ్యత్యాసం చూపడానికి బ్లాక్ పెయింట్ చేయడం జరిగింది.

జీసస్ ఈ మోడిఫైడ్ క్లాసిక్ 500 బైకులో ముందు మరియు వెనుక వైపు చక్రానికి పెటల్ డిస్క్ బ్రేకులను అందించాడు. హెడ్ లైట్ విషయానికి వస్తే, గుండ్రటి ఆకారంలో ఉండే రెట్రో హెడ్ ల్యాంప్ స్థానంలో విశాలమైన ప్లాస్టిక్ పదార్థానికి మధ్యలో స్టేజ్ లేదా థియేటర్ లైట్‌ అందించాడు.

సాంకేతికంగా ఇందులో అదే 499సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 27.20బిహెచ్‌పి పవర్ మరియు 41.30ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

 

English summary
Royal Enfield Classic 500 ‘Green Fly’ Custom Bike Unveiled
Story first published: Saturday, February 11, 2017, 15:47 [IST]
Please Wait while comments are loading...

Latest Photos