తొలిసారి పట్టుబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ సిరీస్ బైకులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవలె థండర్‌బర్డ్ 500ఎక్స్ అనే కొత్త వెర్షన్ బైకు డీలర్ల వద్ద పట్టుబడ్డింది. దీంతో పాటు థండర్‌బర్డ్ 350ఎక్స్ బైకును గుర్తించడం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్

దిగ్గజ ఆటోమొబైల్ మీడియా కథనంతో డీలర్ల చెంతకు చేరిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్ మరియు 350ఎక్స్ బైకులు గురించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త వెర్షన్‌లో ఉన్న ఈ రెండు బైకుల విడుదల జనవరి 2018లోనే ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Recommended Video - Watch Now!
Switchblade Flying Car From Samson Motorworks - DriveSpark
రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ రెగ్యులర్ థండర్‌బర్డ్ బైకుతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంటుంది. నూతన హ్యాండిల్ బార్, కొత్త సీటు, అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు మరియు బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్‌లో ఉన్న ఇంజన్, సస్పెన్షన్ మరియు ఎగ్జాస్ట్ వంటివి ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్

రాయల్ ఎన్ఫీల్డ్ పలు విభిన్న కలర్ ఆప్షన్స్ పరిచయం చేసింది.థండర్‌బర్డ్ 350ఎక్స్ బైకులో రెడ్ మరియు వైట్, అదే విధంగా 500ఎక్స్ బైకు యెల్లో కలర్‌లో ఉంది. క్లాసిక్ డిజైన్ శైలిని విస్మరించకుండానే, ఆధునికతకు అద్దం పట్టేలా రాయల్ ఎన్ఫీల్డ్ వీటిని తీర్చిదిద్దింది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్

థండర్‌బర్డ్ 350ఎక్స్ బైకులో బ్లాక్ అవుట్ హెడ్ ల్యాంప్ హౌసింగ్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు అదే విధంగా డ్యూయల్ డిజిటల్ అనలాగ్ ఇస్ట్రుమెంట్ క్లస్టర్ బ్లాక్ మ్యాట్ మరియు క్రోమ్ ఫినిషింగ్‌లో ఉంది. పిలియన్ సీట్ బ్యాక్ రెస్ట్ తొలగించి గ్రాబ్ రెయిల్ అందివ్వడం జరిగింది.

Trending On DriveSpark Telugu:

బజాజ్‌ బుర్రకు తట్టని ఐడియా !!

ఇకపై మీకు నచ్చిన స్టైల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు

7.35 లక్షలకే మీ బొలెరోను మెర్సిడెస్ బెంజ్‌గా మార్చుకోండి!!

ఎంత చెప్పిన మాట వినలేదు అందుకే రోడ్ రోలరుతో రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సనర్లను తొక్కిస్తున్నాం!!

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్

సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‍‌బర్డ్ 350ఎక్స్ బైకులో రెగ్యులర్ వెర్షన్ నుండి సేకరించిన అదే 350సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే ఇది 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్

ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయిస్తున్న రెగ్యులర్ థండర్‌బర్డ్350 బైకుతో పోల్చుకుంటే ఈ థండర్‌బర్డ్ 350ఎక్స్ ధర రూ. 10,000ల నుండి రూ. 20,000 ల వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. వచ్చే నెలలో పూర్తి స్థాయిలో లాంచ్ చేసి కాస్త ఆలస్యంగా డెలివరీలు మొదలుపెట్టే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యంగ్ మరియు సిటీ కస్టమర్లను టార్గెట్ చేస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ నూతన థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ బైకులను అభివృద్ది చేసినట్లు తెలుస్తోంది. అవుట్‌డేటెడ్ వెర్షన్ అనే మరకను తుడిచేస్తూ ఒక కొత్త రూపంలో ఫ్రెష్ లుక్‌లో వీటిని తీర్చిదిద్దింది. థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ బైకుల విడుదల వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

Via Rushlane

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Royal Enfield Thunderbird 350X Spotted For The First Time
Story first published: Thursday, December 28, 2017, 13:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark