తండ్రి వివాహ వార్షికోత్సవానికి 45 లక్షల బైకుని గిఫ్ట్‌గా ఇచ్చిన కుమారుడు

Written By:

గుర్‌సిమ్రాన్ అనే వ్యక్తి తన తల్లిదండ్రుల 35 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన తండ్రి కవాల్ జీట్ సింగ్ వాలియా కు ఇండియన్ రోడ్‌మాస్టర్ మోటార్ సైకిల్‌ను మరియు తన తల్లికి మెర్సిడెస్ బెంజ్ కారును గిఫ్టుగా బహుకరించాడు.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తన తండ్రి కవాల్ జీత్ సింగ్ కోసం కొనుగోలు చేసిన ఇండియన్ రోడ్‌మాస్టర్ మోటార్ సైకిల్‌కు సిహెచ్ 01 బిఎల్ 0001 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం రూ. 6.70 లక్షల రుపాయలు వెచ్చించాడు. ఇక ఈ బైకు విలువ రూ. 45 లక్షలుగా ఉంది.

ఈ కుటుంబం ఇలా వార్తలకెక్కడం ఇది తొలిసారి కాదు, గతంలో కూడా భారీ ధరతో వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొనుగోలు చేసే విషయంలో పలుమార్లు వార్తల్లోకి వచ్చింది.

2011లో వీరి 30 వ వివాహ వార్షికోత్సవానికి రెండు వారాల పాటు 15 నగరాల్లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశాడు. మరియు కవాల్ జీత్ సింగ్ మరియు ఇతని భార్య తమ కుమారుడి నాలుగవ వెడ్డింగ్ యానివర్సిరీకి ట్రయంప్ మోటార్ సైకిల్ మరియు మెర్సిడెస్ బెంజ్ కారును బహుకరించారు.

కుమారుడికి 20 లక్షల విలువైన ట్రయంప్ మోటార్ సైకిల్ గిఫ్టిచ్చిన దానికంటే, దాని రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం సుమారుగా 8.02 లక్షలు కుమ్మరించడం పెద్ద న్యూస్ అయిపోయింది.

ఈ కుటుంబం అత్యంత ఖరీదైన వాహనాలనే కలిగి ఉంది. గుర్‌సిమ్రాన్ పార్ట్‌నర్‌గా ఉన్న కుటుంబ గ్యారేజీలో మూడు మెర్సిడెస్ బెంజ్ కార్లు, ట్రయంప్ మోటార్ సైకిల్ మరియు నూతనంగా వచ్చి చేరిన ఇండియన్ రోడ్‌మాస్టర్ సైకిల్ వంటివి ఉన్నాయి.

ఇండియన్ మోటార్ సైకిల్ విషయానికి వస్తే, అమెరికాకు చెందిన ఈ సంస్థ ఈ మధ్యనే విపణలోకి ఇండియన్ స్ప్రింగ్ ఫీల్డ్ అనే మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. మరెక్కడా దొరకని ఫోటోలను వీటి వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 

English summary
Son Gifts Dad Indian Roadmaster On His Wedding Anniversary — Wish We All Had A Son Like This
Please Wait while comments are loading...

Latest Photos