సరికొత్త రూపంలో ఆపాచే ఆర్‌టిఆర్160: రహస్యంగా పరీక్షిస్తున్న టీవీఎస్

Written By:

దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో 160సీసీ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో రోజు రోజుకీ పాపులర్ అవుతోంది. ఈ సెగ్మెంట్లో ఉన్న ట్రెండ్‌ను సొమ్ము చేసుకోవడానికి టూ వీలర్ల తయారీ సంస్థలు విభిన్న ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి.

ఇందులో భాగంగా, ఇది వరకే ఆపాచే ఆర్‌టిఆర్ 160 మోటార్ సైకిల్‌ను సరికొత్త రూపంలో మళ్లీ విడుదల చేసేందుకు, సరికొత్త రూపంలో ఉన్న నెక్ట్స్ జనరేషన్ అపాచే ఆర్‌టిఆర్160 బైకును రహస్యంగా పరీక్షిస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
నెక్ట్స్ జనరేషన్ టీవీఎస్ అపాచే ఆర్‍టిఆర్ 160

ఫ్రంట్ డిజైన్ పరంగా టీవీఎస్ లైనప్‌లో ఉన్న శక్తివంతమైన వేరియంట్ అపాచే ఆర్‌టిఆర్200 డిజైన్ లక్షణాలతో రానుంది. సరికొత్త అపాచే ఆర్‌టిఆర్ 160 మోనో షాక్ అబ్జార్వర్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లతో రానుంది.

నెక్ట్స్ జనరేషన్ టీవీఎస్ అపాచే ఆర్‍టిఆర్ 160

అపాచే ఆర్‌టిఆర్ 200 తరహా రెండు డిస్క్ బ్రేకులతో కాకుండా, న్యూ జనరేషన్ అపాచే ఆర్‌టిఆర్160 లో ముందు వైపున డిస్క్ బ్రేకు మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేకు రానుంది. అదే విధంగా మునుపటి వేరియంట్‌తో పోల్చితే విభిన్నంగా ఉండేందుకు సిల్వర్ ఫినిషింగ్‌లో ఉన్న ప్యానల్స్ ఉన్నాయి.

నెక్ట్స్ జనరేషన్ టీవీఎస్ అపాచే ఆర్‍టిఆర్ 160

ప్రస్తుతం పోటీగా ఉన్న మోటార్ సైకిళ్లను ఎదుర్కునేందుకు అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేయగల సరికొత్త 160సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. తాజా సమాచారం మేరకు, 2018 ప్రారంభం నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Next-Generation TVS Apache RTR 160 Spotted Testing
Story first published: Tuesday, July 11, 2017, 18:34 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark