సుజుకి జిక్సర్ కొంటున్నారా...? అయితే కొద్ది రోజులు ఆగండి!

Written By:

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం సుజుకి తమ జిక్సర్ ఎస్ఎఫ్ మోటార్ సైకిల్‌ను యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఫీచర్‌ అతి త్వరలో విడుదల చేయడానికి సిద్దమైంది.నికి సంభందించిన బ్రోచర్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

లీక్ అయిన బ్రోచర్ ప్రకారం, సుజుకి ఎస్ఎఫ్ ఏబిఎస్ కేలం ఫ్యూయల్ ఇంజెక్టడ్ వేరియంట్లో మాత్రమే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఏబిఎస్ ఫీచర్‌లో సుజుకి జిక్సర్

ఫ్యూయల్ ఇంజెక్టడ్ వేరియంట్ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు కొన్ని కాస్మొటిక్ అప్‌డేట్స్‌కు కూడా గురవుతోంది. ఇక మీదట దీనిని ట్రై-కలర్ పెయింట్ స్కీమ్‌లో ఎంచుకోవచ్చు. జిక్సర్ ఎస్‌పి స్పెషల్ ఎడిషన్ కావడంతో ఎస్‌పి లోగో మరియు న్యూ గ్రాఫిక్స్‌ను ఫ్యూయల్ ట్యాంక్ మీద అందివ్వడం జరిగింది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
ఏబిఎస్ ఫీచర్‌లో సుజుకి జిక్సర్

ఏబిఎస్ వేరియంట్ జిక్సర్ ఎస్ఎఫ్ ఎఫ్ఐ మోటార్ సైకిల్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. సాంకేతికంగా ఇందులోని 154.9సీసీ గల సింగల్ సిండర్ ఫ్యూయల్ ఇంజక్టడ్ ఇంజన్ 14.5బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

ఏబిఎస్ ఫీచర్‌లో సుజుకి జిక్సర్

ప్రస్తుతం ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేకులు గల జిక్సర్ ఎస్ఎఫ్ ఎఫ్ఐ వేరియంట్ ధర రూ. 93,032 లు ఎక్స్-షోరూమ్‌(ఢిల్లీ)గా ఉంది. ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 15,000 నుండి 20,000 ల వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది.

ఏబిఎస్ ఫీచర్‌లో సుజుకి జిక్సర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టూ వీలర్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) వెహికల్ సేఫ్టీలో ఇది కీలకపాత పోషిస్తుంది. 2018 ఏప్రిల్ తరువాత 125సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న అన్ని టూ వీలర్లలో ఏబిఎస్ ఫీచర్ తప్పనిసరిగా అందించాలని కేంద్రం ప్రకటించింది. కాబట్టి వచ్చే ఏడాది చివరి నాటికి దాదాపు అన్ని బైకుల్లో ఏబిఎస్ వచ్చే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Suzuki Gixxer SF ABS Brochure Leaked
Story first published: Thursday, August 3, 2017, 16:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark