జపాన్‌కు మేడిన్ ఇండియా సుజుకి జిక్సర్ బైకులు

Written By:

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దేశీయంగా ఉత్పత్తి చేసిన జిక్సర్ శ్రేణి బైకులను జపాన్‌కు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకించింది. సుజుకి మోటార్ కార్పోరేషన్ ఇండియాలో ఉత్పత్తి అయిన మోటార్ సైకిళ్లను మొదటి సారిగా తమ మాతృ దేశం జపాన్‌కు ఎగుమతి చేస్తోంది. మొదటి ఉత్పత్తి కూడా జక్సర్ కావడం మరో విశేషం.

సుజుకి జిక్సర్

ఇండియా నుండి ఎగుమతి అయిన మొదటి బ్యాచ్ జిక్సర్ బైకులు జపనీస్ మార్కెట్లో అమ్మకాలకు సిద్దంగా ఉన్నట్లు సుజుకి తెలిపింది.

సుజుకి జిక్సర్

సుజుకి జిక్సర్ లో 155సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయబడింది. ఉత్తమ మైలేజ్ కోసం ఇందులో ఎస్ఇపి టెక్నాలజీని అందించింది.

సుజుకి జిక్సర్

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోషి ఉచిద మాట్లాడుతూ, దేశీయంగా తయారైన జిక్సర్ బైకులను జపాన్ మార్కెట్ కు ఎగుమతి చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.

సుజుకి జిక్సర్

సుజుకి జిక్సర్ లను ఇది వరకే లాటిన్ అమెరికా మరియు దాని పరిసర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఎగుమతి చేస్తున్నట్లు కూడా తెలిపారు.

సుజుకి జిక్సర్

అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రపంచ వినియోగదారులను ఆకర్షించే సాంకేతిక పరిజ్ఞానంతో సుజుకి ఇండియా విభాగంలో జిక్సర్ బైకులను అభివృద్ది చేస్తోంది. జపాన్ వినియోగదారులు వీటిని ఖచ్చితంగా ఎంచుకుంటారనే ఆశాబావాన్ని వ్యక్తం చేసింది సుజుకి ఇండియా.

క్రింది గ్యాలరీ ద్వారా ట్రయంప్ స్ట్రీప్ కప్ మోటార్ సైకిల్ ఫోటోలను వీక్షించవచ్చు.... 

 

English summary
Suzuki Gixxer To Be Exported From India To Japan

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark