అవెంజర్‌కు పోటీగా సుజుకి జిజడ్ క్రూయిజర్ మోటార్ సైకిల్

Written By:

సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం స్కూటర్లు, తక్కువ సామర్థ్యం ఉన్న కమ్యూటర్ బైకు మరియు స్పోర్ట్స్ బైకులను విక్రయిస్తోంది. అయితే, ఈ జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం సుజుకి మరో సెగ్మెంట్లో సరికొత్త మోటార్ సైకిల్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

సుజుకి జిజడ్150 క్రూయిజర్ మోటార్ సైకిల్

తాజాగా అందుతున్న సమాచారం మేరకు, జిజడ్150 అనే క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సుజుకి ప్రస్తుతం ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్ సైకిళ్లను వియత్నాం మరియు కొలంబియా వంటి దేశాల్లో విక్రయిస్తోంది.

సుజుకి జిజడ్150 క్రూయిజర్ మోటార్ సైకిల్

సుజుకి జిజడ్150 క్రూయిజర్ మోటార్ సైకిల్‌లో 149సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజన్. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 11.5బిహెచ్‌పి పవర్ మరియు 11.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది చేస్తుంది.

సుజుకి జిజడ్150 క్రూయిజర్ మోటార్ సైకిల్

కొలంబియా మార్కెట్లో జిజడ్150 ధర 41,990,00 పెసో లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో దీని ధర రూ. 89,000 లుగా ఉంది. పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే జిక్సర్ ఎస్ఎఫ్ ఎఫ్ఐ బైక్‌కు క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది. జిక్సర్ ఎస్ఎఫ్ ఎఫ్ఐ ధర రూ. 93,984 లుగా ఉంది.

సుజుకి జిజడ్150 క్రూయిజర్ మోటార్ సైకిల్

సుజుకి ఉద్యోగులు తెలిపిన వివరాల మేరకు జిజడ్150 క్రూయిజర్ మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్లోకి వస్తున్నట్లు తెలిసిందని కొందరు సుజుకి డీలర్లు పేర్కొన్నారు. అంతే కాకుండా సుజుకి లుబ్రికేషన్ పార్ట్‌నర్ మోటుల్ ఇప్పటికే జిజడ్150 బైకును పరీక్షించింది.

సుజుకి జిజడ్150 క్రూయిజర్ మోటార్ సైకిల్

సుజుకి జిజడ్150 క్రూయిజర్ బైకు సెప్టెంబర్ 2017 నాటికి పూర్తి స్థాయిలో దేశీయ మార్కెట్లోకి విడుదల కానుంది. క్రూయిజర్ అప్పీల్ కలిగించే విధంగా ఈ బైకులో ఇరు వైపులా శాడిల్ బ్యాగులు, ఎత్తైన పొడవాటి హ్యాండిల్ బార్ మరియు లాంగ్ వీల్ బేస్ కలదు.

సుజుకి జిజడ్150 క్రూయిజర్ మోటార్ సైకిల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి జిజడ్ 150 బైకు ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్ సైకిల్. ఇది విడుదలయ్యే నాటికి, విపణిలో ఉన్న బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150 నోరు మూయించడం గ్యారంటీ. అయితే సరైన ధరతో అందుబాటులోకి తీసుకువస్తే, అవెంజర్ సేల్స్ జిజడ్150 తినేస్తుందని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Suzuki To Launch GZ150 Cruiser Motorcycle In India
Story first published: Saturday, July 15, 2017, 10:42 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark