సుజుకి నుండి వస్తున్న 150సీసీ బైక్ ఇదే... మరిన్ని ఫోటోలు మరియు కంప్లీట్ డిటైల్స్

Written By:

ఇండియన్ టూ వీలర్ పరిశ్రమలో గత వారం రోజులుగా ఉన్న హాట్ న్యూస్ సుజుకి ఇంట్రూడర్ 150. ఇప్పటి వరకు 150 సీసీ ఇంజన్ కెపాసిటితో ఇలాంటి బైకులు ఇండియన్ మార్కెట్లోకి వచ్చిందే లేదు. సుజుకి సరికొత్త ఇంట్రూడర్ 150 క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను మరో నాలుగు రోజుల్లో విడుదల చేయాడనికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంది.

ఈ నేపథ్యంలో సుజుకి ఇంట్రూడర్ 150 మోటార్ సైకిల్‌కు చెందిన తాజా ఫోటోలు విడుదలయ్యాయి. ఇంట్రూడర్ ఫోటోలు మరియు పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

సుజుకి ఇంట్రూడర్ 150

యువ కొనుగోలుదారులను మనస్సు దోచుకునే డిజైన్ లక్షణాలు ఇందులో ఉన్నాయి. ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న ఎల్ఇడి లైట్లు గల ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ద్వారా ఇంట్రూడర్ 150 స్టన్నింగ్ ఫ్రంట్ లుక్ సొంతం చేసుకుంది.

Recommended Video - Watch Now!
[Telugu] TVS Jupiter Classic Launched In India - DriveSpark
సుజుకి ఇంట్రూడర్ 150

హైడ్ ల్యాంప్ పొజిషన్ సాధాణ బైకులతో పోల్చుకుంటే కాస్త క్రిందకే ఉంది. హెడ్ ల్యాంప్ పైన గాలి నుండి కలిగి ఘర్షణను ఎందుకొర్కొనేందుకు మోడ్రన్ టచ్ ఫీల్ కలిగించే బ్లాక్ విండ్ స్క్రీన్ కలదు. విండ్ స్క్రీన్‌కు ఇరువైపులా ఇండికేటింగ్ ల్యాంప్స్ మరియు క్రోమ్ ఫినిషింగ్ గల రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి.

సుజుకి ఇంట్రూడర్ 150

ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎన్నో 150-200సీసీ రేంజ్ మధ్య ఉన్న బైకులతో పోల్చుకుంటే డిజైన్ పరంగా సుజుకి ఇంట్రూడర్ 150 చాలా విభిన్నం. ఫ్యూయల్ ట్యాంక్‌కు ఇరువైపులా ప్రీమియమ్ బాడీ డీకాల్స్ మరియు వాటి మీద ఇంట్రూడర్ పేరు కలదు.

సుజుకి ఇంట్రూడర్ 150

ప్రక్క వైపు నుంచి గమనిస్తే ఇంట్రూడర్ 150 చూడటానికి హై కెపాసిటి గల మోటార్ సైకిల్ అనిపిస్తుంది. ఇంజన్ కౌల్, డ్యూయల్ టోన్ సైడ్ ప్యానల్స్ వంటివి బైకు మొత్తానికి స్పెషల్ లుక్ తీసుకొచ్చాయి.

సుజుకి ఇంట్రూడర్ 150

అంతే కాకుండా ఇంట్రూడర్ 150 సుజుకి హయాబుసా మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ఇంట్రూడర్ 150లోని ఇంజన్ కౌల్, హయబుసా రియర్ డిజైన్‌ను పోలిన ఇంట్రూడర్ బ్యాక్ ప్రొఫైల్, చిన్నగా ఉన్న పిలియన్ సీట్, మరియు బకెట్ స్టైల్ రైడర్ సీటు ఉన్నాయి.

సుజుకి ఇంట్రూడర్ 150

సుజుకి జిక్సర్ తరహా డ్యూయల్ పోర్ట్ ఎగ్జాస్ట్ సిస్టం ఉంది. జిక్సర్‌తో పోల్చుకుంటే వ్యత్యాసం కనబడేందుకు మలచబడినట్లుగా ఉండే ఎగ్జాస్ట్ పైప్ డిజైన్ గమనించవచ్చు. హ్యాండిల్ పొడవు తక్కువగానే ఉన్నప్పటికీ రిలాక్స్‌గా రైడ్ చేసేందుకు సౌకర్యవంతమనైన రైడింగ్ పొజిషన్ అందివ్వడం జరిగింది.

సుజుకి ఇంట్రూడర్ 150

సుజుకి ఇంట్రూడర్150 రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు కలిగి ఉంది. అయితే ముందు చక్రానికి సింగల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది.

సుజుకి ఇంట్రూడర్ 150

చూడటానికి భారీ పరిమాణంలో దర్శనమిస్తున్నప్పటికీ ఇందులో 154.9సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధాననం గల ఇది 14.6బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి ఇంట్రూడర్ 150 బైక్ ఎగ్జాస్ట్ సౌండ్‌ రికార్డ్ చేసిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. జిక్సర్ నుండి సేకరించిన అదే ఇంజన్ ఇందులో అందించినప్పటికీ రెండింటిలో ఎగ్జాస్ట్ చాలా వ్యత్యాసం ఉంది.

సుజుకి ఇంట్రూడర్ 150

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి ఇండియన్ మార్కెట్లోని ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి ఇంట్రూడర్ 150 బైకును పరిచయం చేస్తోంది. డిజైన్ మరియు సాంకేతిక అంశాల పరంగా సుజుకి ఇంట్రూడర్ 150 బజాజ్ అవెంజర్ 150 మరియు 220 మోటార్ సైకిళ్లకు గట్టిపోటీనివ్వనుంది.

సుజుకి ఈ బైకును వచ్చే నవంబర్ 7, 2017 న లాంచ్ చేయనుంది. దీని ధర రూ. 90,000 నుండి 95,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Suzuki Intruder 150: Clear Images Reveals Design And Other Details
Story first published: Saturday, November 4, 2017, 17:44 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark