బజాజ్ అవెంజర్‌కు పోటీగా సుజుకి ఇంట్రూడర్ 150

Written By:

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం సుజుకి ఇండియన్ మార్కెట్లో ఉన్న బజాజ్ అవెంజర్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌కు పోటీగా ఇంట్రూడర్ 150 బైకును విడుదలకు సిద్దం చేస్తోంది.

సుజుకి ఇంట్రూడర్ 150

సరికొత్త సుజుకి ఇంట్రూడర్ 150 క్రూయిజర్ మోటార్ సైకిల్ ఫోటోలు ఆన్‌లైన్ వేదికగా లీక్ అయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, సుజుకి ఈ క్రూయిజర్ బైకును నవంబర్ 5 నుండి నవంబర్ 7, 2017లోపు విడుదలయ్యే అవకాశం ఉంది.

Recommended Video - Watch Now!
[Telugu] Yamaha Launches Dark Night Variants - DriveSpark
సుజుకి ఇంట్రూడర్ 150

సుజుకి ఇంట్రూడర్ శ్రేణిలో ఉన్న పెద్ద వెర్షన్‌ను అదే డిజైన్ శైలిలో 150సీసీ సెగ్మెంట్లో నిర్మించింది. అదే తరహా ఫ్యూయల్ ట్యాంక్ మరియు సిగ్నేచర్ హెడ్ ల్యాంప్స్ యథావిధిగా ఉండటాన్ని తాజాగా లీకైన ఫోటోలు ద్వారా గమనించవచ్చు.

సుజుకి ఇంట్రూడర్ 150

సరికొత్త సుజుకి ఇంట్రూడర్ 150 క్రూయిజర్ మోటార్ సైకిల్‌లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, స్పోర్టి లుక్ సొంతం చేసుకున్న కండలు తిరిగిన డిజైన్ శైలిలో గల ఫ్యూయల్ ట్యాంక్, ఎల్ఇడి లైట్లు మరియు జిక్సర్ తరహా డ్యూయల్ పోర్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

సుజుకి ఇంట్రూడర్ 150

సుజుకి ఇంట్రూడర్ 150 మోటార్ సైకిల్‌లో 155సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. సుజుకి జిక్సర్‌లో ఉన్న అదే ఇంజన్‌ ఇంట్రూడర్ 150లో రానుంది. ఇది గరిష్టంగా 14.5బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి ఇంట్రూడర్ 150

బ్రేకింగ్ కార్యకలాపాల కోసం ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేకులు ఉన్నాయి. జిక్సర్ ఎస్ఎఫ్ తరహాలో ఆప్షనల్‌ సింగల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో రానుంది. సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

సుజుకి ఇంట్రూడర్ 150

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి ఇంట్రూడర్ 150 సుజుకి మోటార్ సైకిల్ ఇండియా విభాగానికి అతి ముఖ్యమైన మోడల్‌గా నిలవనుంది. ప్రస్తుతం ఇండియన్ క్రూయిజర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో పోటీలేకుండా అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్న బజాజ్ అవెంజర్ శ్రేణి బైకులకు ఇది గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Suzuki Intruder 150 Leaked Ahead Of India Launch; To Rival Bajaj Avenger 150
Story first published: Monday, October 30, 2017, 20:51 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark