నవంబర్ 7 న వస్తున్న సుజుకి ఇంట్రూడర్ 150

Written By:

ఇండియన్ టూ వీలర్ ప్రేమికులకు మరో కొత్త బైకును పరిచయం చేయడానికి సుజుకి మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. నవంబర్ 07, 2017 న మార్కెట్లోకి సరికొత్త ఇంట్రూడర్ 150 బైకును లాంచ్ చేయనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సుజుకి ఇంట్రూడర్ 150

బజాజ్ అవెంజర్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌కు పోటీగా సుజుకి తమ హై కెపాసిటి ఇంట్రూడర్ బైక్ స్టైల్లో 150సీసీ ఇంజన్ కెపాసిటి ఇంట్రూడర్ 150 మోడల్‍‌ను అభివృద్ది చేసింది. పేరుకి క్రూయిజర్ సెగ్మెంట్లో వస్తున్నప్పటికీ ఇదివరకెన్నడూ లేని డిజైన్‌లో రానుండటం ఆసక్తికరంగా ఉంది.

Recommended Video
[Telugu] Benelli 300 TNT ABS Now Avaliable In India - DriveSpark
సుజుకి ఇంట్రూడర్ 150

సుజుకి ఇంట్రూడర్ 150 భారత్ విపణిలోకి వస్తున్న తొలి తక్కువ కెపాసిటి గల ఇంట్రూడర్. సుజుకి ఇంట్రూడర్ ఎమ్1800ఆర్ ప్రేరణతో స్మాల్ వెర్షన్ ఇంట్రూడర్ డిజైన్ మరియు కాన్సెప్ట్ డెవలప్ చేయబడింది.

సుజుకి ఇంట్రూడర్ 150

దక్షిణ అమెరికా మార్కెట్లో సుజుకి ఇప్పటికే జిజడ్150 అనే తక్కువ కెపాసిటి గల క్రూయిజర్ బైకులను విక్రయిస్తోంది. దీనిని కూడా ఇండియన్ మార్కెట్లోకి విడుదల అవకాశం ఉంది. అయితే, దానికంటే ముందు ఇంట్రూడర్ విడుదలకు సన్నాహాలు ప్రారంభించింది.

సుజుకి ఇంట్రూడర్ 150

సుజుకి ఇంట్రూడర్ 150 బ్రోచర్ ఫోటోలు కొన్ని ఆన్‌లైన్‌లో లీకవ్వగా, తాజాగా రోడ్ల మీద పరీక్షిస్తూ మీడియాకు పట్టుబడిన ఇంట్రూడర్ 150 ఫోటోలు కూడా ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి.

సుజుకి ఇంట్రూడర్ 150

విభిన్నమైన హెడ్ ల్యాంప్ డిజైన్, కండలు తిరిగిన ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, మస్కలర్ బాడీ డీకాల్స్, ప్రీమియమ్ ఫీల్ కలిగించే ఇంట్రూడర్ పేరు, క్రూయిజర్ స్టైల్ రైడింగ్ పొజిషన్, బకెట్ టైప్ రైడర్ సీట్ వంటివి ఇంట్రూడర్ 150లో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

సుజుకి ఇంట్రూడర్ 150

సాంకేతికంగా సుజుకి ఇంట్రూడర్ 150లో జిక్సర్‌లో ఉపయోగించిన అదే 154.9సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ రానుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 14బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి ఇంట్రూడర్ 150

సుజుకి ఇంట్రూడర్ 150లో రెండు చక్రాలు డిస్క్ బ్రేకులతో రానున్నాయి. బ్రోచర్ వివరాల ప్రకారం, ఇంట్రూడర్ 150 బైకు జిక్సర్ ఎస్ఎఫ్ తరహాలో సింగల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌తో రానుంది.

సుజుకి ఇంట్రూడర్ 150

డిజైన్ పరంగా చూస్తే అత్యంత ఖరీదైన బైకుగా కనిపించినప్పటికీ ఇదే ఇంజన్ కెపాసిటితో గల బజాజ్ అవెంజర్ 150 క్రూయిజర్ బైకుతో పోటీపడనుంది. అయితే దీని అద్వితీయమైన రూపం మరియు ఫీచర్లు అవెంజర్ 220 క్రూయిజ్ నోరు కూడా మూయించనుంది.

సుజుకి ఇంట్రూడర్ 150

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ క్రూయిజర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో ప్రవేశిస్తున్న సుజుకి నిజంగానే ఒక కొత్త ట్రెండ్ సృష్టించనుంది. విడుదలను ఆలస్యం చేయకుండా వెంటనే విపణిలో దూసుకెళ్లేందుకు ఈ నవంబర్ 7 న విడుదలవ్వనుంది. ధర విషయానికి వస్తే, రూ. 90,000 నుండి 95,000 ల మధ్య ధరతో వచ్చే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: All You Need To Know About The New Suzuki Intruder 150
Story first published: Thursday, November 2, 2017, 10:55 [IST]
Please Wait while comments are loading...

Latest Photos