ఎస్‌వి650ఎక్స్ ఆవిష్కరించిన సుజుకి

Written By:

జపాన్ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ సుజుకి ఎస్‍‌వి650ఎక్స్ మోటార్ సైకిల్‌ను రివీల్ చేసింది. అక్టోబర్ 2017 లో జరగనున్న టోక్యో మోటార్ షో వేదిక మీద ప్రదర్శనకు రానుంది.

2016 టోక్యో మోటార్ షో లో సుజుకి ఆవిష్కరించిన ఎస్‌వి650 ర్యాలీ కాన్సెప్ట్ ఆధారంతో కేఫెరేసర్ స్టైల్లో ఎస్‌వి650ఎక్స్ బైకును సుజుకి అభివృద్ది చేసింది.

సుజుకి ఎస్‌వి650ఎక్స్ రివీల్

1970 కాలం నాటి ర్యాలీ మోటార్ సైకిళ్లు మరియు బైకులకు గుర్తుగా సుజుకి ఈ ఎస్‌వి650ఎక్స్ కేఫెరేసర్ బైకును అభివృద్ది చేశారు. క్లాసిక్ రెట్రో డిజైన్, పాత కాలపు బైకుల బాడీ డీకాల్స్ మరియు టింటెడ్ విండ్‌స్క్రీన్ వంటివి ఇందులో ప్రత్యేకంగా నిలిచాయి.

Recommended Video - Watch Now!
Benelli TNT 300 ABS Now Avaliable In India | In Telugu - DriveSpark తెలుగు
సుజుకి ఎస్‌వి650ఎక్స్

సుజుకి ఎస్‌వి650ఎక్స్‌లో ఫాగ్ ల్యాంప్స్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, టక్ రోల్. ఎస్‌వి650ఎక్స్‌ లోని అన్ని ఫీచర్లు ఎస్‌ని650 బైకులో ఇది వరకే ఉన్నాయి. ప్రస్తుతం దీని పనితీరు మరియు కస్టమర్ల అభిప్రాయాలకు అగుణంగా ప్రొడక్షన్ ప్రారంభించనున్నట్లు తెలిసింది.

సుజుకి ఎస్‌వి650ఎక్స్

సాంకేతికంగా ఇది 645సీసీ సామర్థ్యం గల వి-ట్విన్, లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది. ఎస్‌వి650ఎక్స్ గురించి సుజుకి జిబి జనరల్ మేనేజర్ పౌల్ డి లూసింగ్‌నాన్ మాట్లాడు,"కేఫెరేసర్ల సెగ్మంట్లో ఇదొక విప్లవాత్మక ప్రొడక్ట్‌గా నిలవనుంది. అయితే, దీని ప్రొడక్షన్ ఎప్పుడనేది ఇప్పుడే స్పష్టం చేయలేమని పేర్కొన్నాడు."

సుజుకి ఎస్‌వి650ఎక్స్

సుజుకి ఎస్‌వి650ఎక్స్ కాన్సెప్ట్ బైకు పూర్తిగా ఎస్‌వి650 ర్యాలీ బైకు ఆధారంగా రూపొందించారు. రెట్రో డిజైన్ శైలిలో, ప్రస్తుతం ఉన్న అన్ని కేఫెరేసర్లతో పోల్చుకుంటే విభిన్నంగా ఉండేలా సుజుకి దీనిని తీర్చిదిద్దింది.

English summary
Read In Telugu: Suzuki SV650X Revealed Ahead Of Debut
Story first published: Monday, September 25, 2017, 13:53 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark