విపరీతంగా పెరిగిన సుజుకి టూ వీలర్ సేల్స్

Written By:

సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జూలై 2017 నెలలో భారీ విక్రయాలతో 62 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

సుజుకి టూ వీలర్స్ జూలై 2017 లో 40, 038 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కేవలం 24,703 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అమ్మకాల పరంగా 62 శాతం వృద్ది నమోదైంది. దేశీయంగా జరిగిన అమ్మకాలే ఈ తరహా వృద్దికి ప్రధాన కారణం అని తెలిసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సుజుకి టూ వీలర్ సేల్స్

జపాన్ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ ఇండియన్ విభాగం దేశీయ విక్రయాల్లో 78 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. అంతే కాకుండా ఏప్రిల్-జూలై 2017 మధ్యలో కాలంలో జరిగిన విక్రయాలతో ఏకంగా 40.6 శాతం వార్షిక వృద్దిని నమోదు చేసుకుంది.

Recommended Video
2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
సుజుకి టూ వీలర్ సేల్స్

2017-18 ఆర్థిక సంవత్సరం 5 లక్షల యూనిట్ల టూ వీలర్ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది. సుజుకి తమ లక్ష్యాన్ని అందుకునేందుకు రానున్న కాలంలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో పాటు దేశీయంగా డీలర్ల సామ్రాజ్యాన్ని విసృతపరిచే ఆలోచనలో ఉంది.

సుజుకి టూ వీలర్ సేల్స్

దేశీయ అమ్మకాలే కాకుండా ఎగుమతుల మీద కూడా సుజుకి దృష్టిసారిస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ఎగుమతులను కొనసాగించాలని చూస్తోంది. ఇండియన్ మార్కెట్లో అధిక టూ వీలర్లను విక్రయించడానికి జిఎస్‌టి కూడా ఒక విధంగా కలిసొచ్చిందని చెప్పవచ్చు.

సుజుకి టూ వీలర్ సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జూలై 1, 2017 నుండి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వచ్చింది. జిఎస్‌టి అమలవ్వగానే, సుజుకి టూ వీలర్స్ ఇండియా జిఎస్‌టికి అనుగుణంగా తమ ఉత్పత్తుల మీద కొత్త ధరలను సవరించింది. దీంతో జూలై మొత్తం జిఎస్‌టి అనంతరం వచ్చిన ధరలతో సుజుకి టూ వీలర్ల సేల్స్ విపరీతంగా ఊపందుకున్నాయి. రానున్న కాలంలో కూడా ఇవే ఫలితాలు సాధ్యమయ్యే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Suzuki Two-Wheelers Posts 62 Percent Growth In July 2017
Story first published: Wednesday, August 2, 2017, 12:59 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark