మగాళ్ల మతి పోగొట్టిన ముగ్గురు హైదరాబాదీ మహిళలు

Written By:

సాధారణంగా ఇండియన్ రోడ్ల మీద మహిళలు కార్లు డ్రైవ్ చేస్తుంటే మగవాళ్లు తదేకంగా చూస్తుంటారు. అదే మహిళలు సూపర్ బైకులు నడిపితే పురుషుల మైండ్ బ్లాక్ కావడం ఖాయం. ఇందుకు ఉదాహరణగా చెప్పుకునే సంఘటన మన హైదరాబాదులో చోటు చేసుకుంది.

చీర కట్టులో యమహా ఆర్15 మీద ట్రిపుల్ రైడింగ్

ముగ్గురు మహిళలు చీరకట్టులో యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి2.0 బైకు మీద హైదరాబాదులో ట్రిపుల్ రైడింగ్ చేశారు. ట్రిపుల్ రైడింగ్ ఇండియన్ రోడ్ల మీద చట్టరీత్యా నేరం. అంతే కాదు, ఈ ముగ్గురు కూడా హెల్మెట్లు ధరించలేదు.

చీర కట్టులో యమహా ఆర్15 మీద ట్రిపుల్ రైడింగ్

నిజానికి వీరు అత్యంత ప్రమాదకరమైన రైడింగ్ చేశారు. చీరను ధరించి బైకు మీద ప్రయాణించడం ఏ మాత్రం సౌకర్యం, సురక్షితమైనది కాదు. హెల్మెట్లు ధరించకుండా ప్రమాదకరంగా ముగ్గురు ఒకే బైకు మీద రైడింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం.

చీర కట్టులో యమహా ఆర్15 మీద ట్రిపుల్ రైడింగ్

మహిళా సాధికారత దృక్పథ కోణం నుండి చూస్తే ఇది ప్రశంసించదగిన సంఘటన అని చెప్పవచ్చు. భారత్ వంటి దేశాల్లో ఇలాంటి మహిళలు చాలా తక్కువ. ఇప్పటికీ డ్రైవింగ్ అంటే పురుషులు మత్రమే చేయాలనే భావన చాలా మందిలో ఉంది. కానీ, ఇందుకు భిన్నంగా ఈ మహిళలు ఎంతో ధైర్యంగా బైక్ రైడింగ్ చేశారు.

కానీ భద్రత కోణం నుండి చూస్తే ఇలాంటి వాటిని ఏ మాత్రం ప్రశంసించకూడదు. కార్లతో పోల్చుకుంటే బైకు రైడింగ్ ఎంతో ప్రమాదకరమైనది. శిరస్త్రాణం, సరైన వస్త్రధారణ మరియు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. వీటిలో ఏ ఒక్కదానిని విస్మరించినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

చీర కట్టులో యమహా ఆర్15 మీద ట్రిపుల్ రైడింగ్

ఆధునిక మోటార్ సైకిళ్లు క్షణాల్లోనే భారీ వేగాన్ని అందుకుంటున్నాయి. అయితే, మోటార్ సైకిళ్లకు తగిన రీతిలో మన ఇండియన్ రోడ్లు లేవు. బాధ్యతరాహిత్యంగా రైడింగ్ చేయడం ఎంతో ప్రమాదకరమైనది. ప్రధానంగా మన ఇండియన్ రోడ్ల మీద ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ.

చీర కట్టులో యమహా ఆర్15 మీద ట్రిపుల్ రైడింగ్

బైకుల మీద దూర ప్రాంత ప్రయాణాలు చేసేటపుడు, హెల్మెట్, గ్లూవ్స్, జాకెట్, మోకాలి మరియు మోచేయి గార్డ్స్, వంటి వాటిని ధరించడం ఎంతో ఉత్తమం. ప్రమాదంలో బైకు మీద నుండి క్రింద పడిపోయినా పెద్ద పెద్ద గాయాల నుండి సురక్షితంగా బయటపడేలా వీటిని తయారు చేస్తారు.

చీర కట్టులో యమహా ఆర్15 మీద ట్రిపుల్ రైడింగ్

చాలా సందర్భంలో పైన పేర్కొన్నవాటిని ధరించడం వీలుకాకపోవచ్చు. కాని ప్రతి సందర్భంలో హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసుకోండి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎలాంటి ప్రమాదంలోనైనా మిమ్మల్ని రక్షించడంలో హెల్మెట్లు కీలకపాత్ర పోషిస్తాయి.

చీర కట్టులో యమహా ఆర్15 మీద ట్రిపుల్ రైడింగ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ధైర్యంగా రైడింగ్ చేస్తున్న ఇలాంటి మహిళలను డ్రైవ్‌స్పార్క్ ఎప్పటికీ అభినందిస్తుంది. అయితే, భద్రత కూడా తప్పనిసరి. బైకు లేదా స్కూటర్ ఏది రైడ్ చేసినా... హెల్మెట్ తప్పనిసరని గుర్తించండి. ఒకరు లేదా ఇద్దరు ప్రయాణించినా హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి.

English summary
Read In Telugu: Three Women Wearing Sarees Ride A Yamaha R15 In Hyderabad; Video Goes Viral
Story first published: Saturday, December 2, 2017, 12:43 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark