డిసెంబర్ 2016 లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ - 10 టూవీలర్లు

చివరి ఏడాది, చివరి మాసంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 టూ వీలర్ల అమ్మకాల జాబితాలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 స్థానం దక్కించుకుంది. అయితే హోండా సిబి షైన్ ఈ జాబితాలో స్థానం కోల్పోయింది.

By Anil

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం టూ వీలర్ల అమ్మకాల మీద తీవ్ర ప్రభావం చూపింది. డిసెంబర్ 2016 అమ్మకాలు గురించి గణాంకాలు తెలిపిన వివరాలు మేరకు దేశవ్యాప్తంగా మొత్తం 9,10,235 యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. అయితే అమ్మకాల్లో 22.04 వృద్దిని దేశీయ టూ వీలర్ల మార్కెట్ కోల్పోయింది.

డిసెంబర్ 2016 లో అమ్ముడు టాప్ 10 జాబితాలో ఉన్న టూ వీలర్ల గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి....

10. హీరో ప్యాసన్

10. హీరో ప్యాసన్

హీరో ప్యాసన్ అమ్మకాల్లో భారీ నష్టాన్ని చవిచూసింది. హీరో గడిచిన డిసెంబర్ 2016 లో 24,672 యూనిట్లు విక్రయాలు జరపగా, అంతకుమునుపు డిసెంబర్ 2015 లో 55,765 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతంతో పోల్చితే 56 శాతం వృద్దిని కోల్పోయి టాప్ 10 జాబితాలో 5 నుండి 10 వ స్థానానికి పడిపోయింది.

డిసెంబర్ 2016 లో టాప్ 10 టూ వీలర్లు

హీరో మోటోకార్ప్ ప్యాసన్ శ్రేణిలో, ప్యాసన్ ఎక్స్‌ప్రో, ప్యాసన్ ప్రో ఐ3ఎస్ మరియు ప్యాసన్ ప్రొ టిఆర్ వంటి మోడళ్లు అమ్మకాల్లో ఉన్నాయి. సాంకేతికంగా వీటిలో 110సీసీ సామర్థ్యం గల ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 8.58బిహెచ్‌పి పవర్ మరియు 9.36ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

09. హీరో గ్లామర్

09. హీరో గ్లామర్

నోట్ల రద్దు ప్రభావానికి తీవ్ర నష్టాన్ని చవిచూసిన వాటిలో హీరో మరో మోడల్ గ్లామర్. 2015 డిసెంబర్‌లో 48,748 యూనిట్ల అమ్ముడుపోగా, 2016 డిసెంబర్‌లో 46 శాతం వృద్దిని కోల్పోయి కేవలం 26,556 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది.

డిసెంబర్ 2016 లో టాప్ 10 టూ వీలర్లు

హీరో మోటోకార్ప్ గ్లామర్ ను ఎఫ్ఐ (ఫ్యూయల్ ఇంజక్షన్) మరియు కార్బోరేటర్ మోడళ్లలో అమ్మకాల్లో ఉంది. హీరో ఈ గ్లామర్ కమ్యూటర్ బైకులో 8.97బిహెచ్‌పి పవర్ మరియు 10.35ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 124.7సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది.

 8. బజాజ్ పల్సర్

8. బజాజ్ పల్సర్

దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో అత్యంత ప్రసిద్దిగాంచిన మోటార్ సైకిళ్లలో బజాజ్ పల్సర్ ఒకటి. గడిచిన డిసెంబర్ 2016 లో 32,252 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుని 5 శాతం వృద్దిని కోల్పోయింది.

డిసెంబర్ 2016 లో టాప్ 10 టూ వీలర్లు

పల్సర్ శ్రేణిలో 135 నుండి 200సీసీ మధ్య విభిన్న ఇంజన్ వేరియంట్లలో అమ్మకాల్లో ఉంది. ఈ మధ్యనే బజాజ్ తమ పల్సర్ శ్రేణిలోని వేరియంట్లలో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేసింది.

7. బజాజ్ ప్లాటినా

7. బజాజ్ ప్లాటినా

నోట్ల ప్రభావం కారణంగా చాలా మోడళ్లు అమ్మకాలు కోల్పోతే, మరికొన్ని మోడళ్లు అత్యుత్తమ ఫలితాలను సాధించింది. గడిచిన డిసెంబర్ 2016 లో 33,845 యూనిట్ల విక్రయాలు జరిపి 108 శాతం వృద్దిని సాధించింది.

డిసెంబర్ 2016 లో టాప్ 10 టూ వీలర్లు

సాంకేతికంగా బజాజ్ ఆటో ఈ ప్లాటినా బైకుల 102సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది. సుమారుగా 8.08బిహెచ్‌పి పవర్ మరియు 8.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల ఇది లీటర్‌కు 90 కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

6. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

6. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల దిగ్గజానికి బెస్ట్ సెల్లింగ్ బైకు క్లాసిక్ 350 ఇప్పుడు టాప్ 10 జాబితాలో స్థానం దక్కించుకుంది, గడిచిన డిసెంబర్ 2016 లో దేశవ్యాప్తంగా 38,080 అమ్మకాలు జరిపి, విక్రయాల్లో 61 శాతం వృద్దిని సాధించింది.

డిసెంబర్ 2016 లో టాప్ 10 టూ వీలర్లు

2009 లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన క్లాసిక్ 350 మోడల్ మొదటి సారిగా డిసెంబర్ అమ్మకాలతో టాప్ 10 జాబితాలోకి ఎంటర్ అయ్యింది. 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 346సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

5. టీవీఎస్ జూపిటర్

5. టీవీఎస్ జూపిటర్

జూపిటర్ కూడా అమ్మకాల్లో నిరాశను కనబరిచింది. డిసెంబర్ 2015 లో 47,217 యూనిట్ల అమ్ముడపోగా. డిసెంబర్ 2016 లో 39,582 యూనిట్ల విక్రయాలు జరిపి 16 శాతం వృద్దిని కోల్పోయింది.

డిసెంబర్ 2016 లో టాప్ 10 టూ వీలర్లు

టీవీఎస్ సమర్పించిన వాటిలో స్టైలిస్ స్కూటర్ జూపిటర్‌లో 109.7సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 7.88బిహెచ్‌‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

4. టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్

4. టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్

సానుకూలమైన ఫలితాలను సాధించిన వాటిలో మరో ఉత్పత్తి టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్. నోట్ల రద్దు ప్రభావం ఈ ఎక్స్ఎల్ సూపర్ అమ్మకాల మీద ఏ మాత్రం లేదు. డిసెంబర్ 2015 లో 56,521 యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా, డిసెంబర్ 2016 లో 64,161 యూనిట్లు అమ్ముడుపోయి 14 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

డిసెంబర్ 2016 లో టాప్ 10 టూ వీలర్లు

టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్‌లో 69.9 సీసీ మరియు 100సీసీ సామర్థ్యం గల రెండు ఇంజన్ ఆప్షన్‌లను అందించంది. ఇందులోని 69.9సీసీ ఇంజన్ గరిష్టంగా 3.5బిహచ్‌పి పవర్ మరియు 5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

3. హీరో హెచ్ఎఫ్ డీలక్స్

3. హీరో హెచ్ఎఫ్ డీలక్స్

హీరో మోటోకార్ప్ హెచ్ఎఫ్ డీలక్స్ అమ్మకాల ఎక్కువ నిరాశను మిగల్చకుండా, ఓ మోస్తారు వృద్దిని కోల్పోయింది. డిసెంబర్ 2015 లో 93,451 యూనిట్లు అమ్ముడవ్వగా, డిసెంబర్ 2016 లో 85,386 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

డిసెంబర్ 2016 లో టాప్ 10 టూ వీలర్లు

హీరో మోటోకార్ప్ బెస్ట్ టూ వీలర్లలో రెండవ స్థానంలో నిలిచిన హెచ్ఎఫ్ డీలక్స్ కమ్యూటర్ బైకులో 8.24బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 97.2సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ అందించింది.

 2. హీరో స్ల్పెండర్

2. హీరో స్ల్పెండర్

దేశీయ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లైనప్‌లో ఉత్తమ అమ్మకాలు జరిపే జాబితాలో స్ల్పెండర్ మొదటి స్థానంలో నిలిచింది. డిసెంబర్ 2015 లో 1,84,856 యూనిట్ల అమ్మకాలు జరపగా, డిసెంబర్ 2016 లో 1,35,104 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే 27 శాతం వృద్దిని కోల్పోయింది.

డిసెంబర్ 2016 లో టాప్ 10 టూ వీలర్లు

సాంకేతికంగా ఇందులో 97.2సీసీ సామర్థ్యం గల ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 8.24బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

1. హోండా ఆక్టివా

1. హోండా ఆక్టివా

జపాన్ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హోండా కు చెందిన ఆక్టివా ఎప్పటిలాగే టాప్ 10 టూ వీలర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. డిసెంబర్ 2015 లో 1,74,154 యూనిట్లను విక్రయించగా, డిసెంబర్ 2016 లో 20 శాతం వృద్దిని కోల్పోయి 1,38,480 యూనిట్ల అమ్మకాలు మత్రమే జరిగాయి.

డిసెంబర్ 2016 లో టాప్ 10 టూ వీలర్లు

హోండా ఇందులో 8బిహెచ్‌పి పవర్ మరియు 8.83ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 109.5సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అందించింది. మరియు ఇందులో 124.9సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది 8.60బిహెచ్‌పి పవర్ మరియు 10.12ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

డిసెంబర్ 2016 లో టాప్ 10 టూ వీలర్లు

కారు కొనమని సలహా ఇస్తే... కార్ల కంపెనీనే కొనేశాడు...!!

అవెంజర్ 400 ను విడుదల చేయనున్న బజాజ్: పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Top 10 Selling Two-Wheelers In December 2016 — A New Brand Enters The List
Story first published: Wednesday, January 25, 2017, 17:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X