2016 లో కోటి డెబ్బై లక్షల బైకులు కొనేశారు

సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఎమ్) తెలిపిన నివేదికల ప్రకారం ఈ టాప్ 10 ద్విచక్ర వాహన తయారీ సంస్థలు గడిచిన 2016 లో దేశవ్యాప్తంగా కోటి డెబ్బై లక్షల మోటార్ సైకిళ్లను విక్రయించాయి.

2016 ఏడాది తొలిసగం వరకు ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీ వృద్దిని సాధించాయి. ఎప్పుడూ లేని విధంగా దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమ రెండంకెల వృద్దనకు దగ్గరగా విక్రయాలు నమోదయ్యేవి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత రూ. 500 మరియు రూ. 1,000 రద్దు నిర్ణయంతో టూ వీలర్ల అమ్మకాల మీద తీవ్ర ప్రభావం ఏర్పడింది. అయినప్పటికీ 2015 తో పోల్చుకుంటే విక్రయాల పరంగా 9.1 శాతం వృద్దిని నమోదు చేసుకుంది దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమ.

2016 లో కోటి డెబ్బై లక్షల బైకులు కొనేశారు

సియామ్ తెలిపిన నివేదిక ప్రకారం ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థలుగా నిలిచిన టాప్ 10 తయారీ సంస్థల గురించి ఇవాళ్టి స్టోరీలో తెలసుకుందాం రండి.

10. హ్యార్లీ డేవిడ్సన్ ఇండియా

10. హ్యార్లీ డేవిడ్సన్ ఇండియా

అమెరికాకు చెందిన ప్రముఖ ఇకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్సన్ ఇండియా విభాగం దేశీయంగా 2016 లో 4,241 యూనిట్ల విక్రయాలు జరిపింది. అంతకు మునుపు 2015 లో 4,445 యూనిట్ల అమ్మకాలు జరిపింది. అయితే విక్రయాల్లో 4.6 శాతం వృద్దిని కోల్పోయింది. దీనికి ప్రధానం కారణం పెద్ద నోట్ల రద్దు అని తెలిసింది.

09. పియాజియో వెహికల్స్ లిమిటెడ్

09. పియాజియో వెహికల్స్ లిమిటెడ్

2016 ఏడాది పియాజియో సంస్థకు మంచి విక్రయాలు సాధించిపెట్టింది. గడిచిన 2016 లో 37,118 యూనిట్ల విక్రయాలు జరపగా అంతకు ముందు ఏడాది 2015 లో 27,830 యూనిట్ల అమ్మకాలు మాత్రమే జరిపింది. పియాజియో విక్రయాల్లో మంచి వృద్దిని సాధించడానికి కొత్తగా విడుదల చేసిన శక్తివంతమైన స్కూటర్ అప్రిలియా ఎస్ఆర్ 150 ప్రధాననం అని చెపపవచ్చు. విడుదల నాటి నుండి భారీ అమ్మకాలు నమోదు చేసుకుంది ఈ ఎస్ఆర్ 150.

08. మహీంద్రా టూ వీలర్స్

08. మహీంద్రా టూ వీలర్స్

మహీంద్రా టూ వీలర్స్‌కు 2016 ఏడాది పెద్ద గుదిబండగా మారిందని చెప్పాలి. 2015 ఏడాది మొత్తం మీద 1,51,005 యూనిట్ల ద్విచక్ర వాహనాల విక్రయాలు జరపగా, ఆ తరువాత 2016 లో భారీ నష్టంతో 69,106 యూనిట్ల అమ్మకాలు మాత్రమే జరిపింది. ఎన్నడూ లేని విధంగా 54.2 శాతం నష్టాన్ని చవిచూసింది. 2016 లో మహీంద్రా టూ వీలర్స్ తమ భవిష్యత్తు ఉత్పత్తులను అభివృద్ది చేసుకోవడానికి జావా మరియు బిఎస్ఎ అనే సంస్థలను కొనుగోలు చేసింది.

07. సుజుకి మోటార్ సైకిల్స్

07. సుజుకి మోటార్ సైకిల్స్

జపాన్‌కు చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ 2016 లో భారీ నష్టాల జోలికెళ్లకుండా 3.5 శాతం వృద్దిని కోల్పోయి 3.17 లక్షల యూనిట్ల విక్రయాలు జరిపింది. అంతకు మునుపు 2015 లో 3.28 లక్షల యూనిట్ల విక్రయాలు జరిపింది. ఇప్పటి వరకూ చూసిన సంస్థల టూ వీలర్ల అమ్మకాల వృద్ది తక్కువగానే ఉంది.

06. రాయల్ ఎన్ఫీల్డ్

06. రాయల్ ఎన్ఫీల్డ్

2016 ఏడాదికి గాను అత్యుత్తమ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థల జాబితాలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ గత ఏడాది అమ్మకాల ద్వారా భారీ లాభాలను మూడగట్టుకుంది. 2014 లో 4.44 లక్షల యూనిట్ల బైకులు అమ్ముడుపోగా 2016 ఏడాదిలో ఏకంగా 6.22 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిపి విక్రయాల్లో 40 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. రాయల్ ఎన్ఫీల్డ్ తమ లైనప్‌లోకి నూతనంగా ప్రవేశపెట్టిన క్లాసిక్ శ్రేణి మరియు హిమాలయన్ బైకులు అమ్మకాలు బాగా కలిసొచ్చాయి.

05. యమహా

05. యమహా

యమహా మోటార్ ఇండియా 2016 విక్రయాల్లో 32.3 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. 2015 క్యాలెండర్ సంవత్సరంలో 5.94 లక్షల బైకుల అమ్మకాలు జరపగా 2016 ఏడాదిలో ఏకంగా 7.86 లక్షల యూనిట్ల యమహా టూ వీలర్లు అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాలు వృద్ది కావడంలో ఎఫ్‌జడ్ శ్రేణి ఉత్పత్తులు మరియు రే స్కూటర్ల విక్రయాలు బాగా తోడయ్యాయి.

04. టీవీఎస్ మోటార్స్

04. టీవీఎస్ మోటార్స్

ప్రాంతీయ మరియు పట్టణ ప్రాంత వాసులను ఆకట్టుకునే రీతిలో టీవీఎస్ మోటార్స్ తమ ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. 2015 ఏడాదిలో 16.15 లక్షల యూనిట్ల విక్రయాలు జరపగా 2016 ఏడాదిలో 18.09 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుని విక్రయాల్లో 18.09 శాతం వృద్దిని సాధించింది. టీవీఎస్ మోటార్స్ గత ఏడాది తమ విక్టర్ 110 ను మళ్లీ పరిచయం చేసింది. మరియు అపాచే ఆర్‌టిఆర్200 4వి అమ్మకాలు కూడా ఈ విజయానికి బాగా తోడ్పడింది.

03. బజాజ్ ఆటో

03. బజాజ్ ఆటో

2016 ఏడాదిలో 20.5 లక్షల అమ్మకాలతో మూడవ స్థానంలో నిలిచింది. అంతకు మునుపు 2015 లో 18.07 యూనిట్ల విక్రయాలు జరిపింది. పూనే ఆధారిత భారత దేశపు మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బజాజ్ 2016 లో అమ్మకాల పరంగా 13.8 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. స్పోర్టివ్ శైలిలో ఉన్న మోటార్ సైకిళ్లను హేతుబద్దమైన ధరలలో అందివ్వడం ఈ తరహా అమ్మకాలకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. బజాజ్ లైనప్ లో అవెంజర్ మరియు వి సిరీస్ శ్రేణి ఉత్పత్తులు మంచి విక్రయాలు జరిపాయి.

02. హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా

02. హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా

ఎప్పటిలాగే జపాన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా విభాగం టాప్ 10 జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. గడిచిన 2016 47.27 లక్షల యూనిట్ల టూ వీలర్ల విక్రయాలు జరపగా అంతకు మునుపు 2015 లో 43.14 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తం మీద 2015 తో పోల్చుకుంటే 9.6 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

 01. హీరో మోటోకార్ప్

01. హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ ఎప్పటిలాగే మొదటి స్థానాన్ని ఆనందిస్తోంది. కమ్యూటర్ సెగ్మెంట్లో చాలా వరకు మోడల్స్ విఫలం కావడం, నోట్ల రద్దు ప్రభావం, మరియు పర్ఫామెన్స్ ఉత్పత్తులు విడుదల అయినప్పటికీ హీరో మోటోకార్ప్ ఎలాంటి ఒడిదుడుకులకు గురికాకుండా 65.80 లక్షల టూ వీలర్లను అమ్మేసింది. అంతకు మునుపు 2015 ఏడాదిలో 62.96 లక్షలయూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో 4.5 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

2016 లో కోటి డెబ్బై లక్షల బైకులు కొనేశారు

రెనో క్విడ్ లీవ్ ఫర్ మోర్ ఎడిషన్ విడుదల: పాత ధరలతోనే అందుబాటులో

రెండు వారాల్లో 6,000 బుకింగ్స్ నమోదు చేసిన సుజుకి ఇగ్నిస్

భారీగా పెరిగిన డీజల్ ధర, పెట్రోల్ ను కూడా వదల్లేదు

Most Read Articles

English summary
Also Read In Telugu: Top 10 Two-Wheeler Manufacturers In 2016 For India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X