ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ బిఎస్4 టూ వీలర్లు ఇవే!

Written By:

ఏప్రిల్ 1, 2017 నుండి అన్ని టూ వీలర్లలో బిఎస్-IV ఇంజన్ తప్పనిసరి చేసిన తరువాత, అంతకు ముందే టూ వీలర్ల తయారీ సంస్థలు తమ ప్రధానమైన ఉత్పత్తుల్లో బిఎస్-IV అప్‌గ్రేడ్స్ నిర్వహించాయి. గత ఏడాది టూ వీలర్ల విక్రయాల ద్వారా ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్-IV టూ వీలర్ల గురించి తెలుసుకుందాం రండి.

హీరో గ్లామర్

హీరో గ్లామర్

హీరో మోటాకార్ప్ గడిచిన 2017 ఫిబ్రవరి లో 39,288 యూనిట్ల గ్లామర్ బైకులను విక్రయించింది. హీరో తమ గ్లామర్ లోని అన్ని వేరియంట్లలో కూడా బిఎస్-IV ఇంజన్ అప్‌గ్రేడ్స్ నిర్వహించింది.

ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్4 టూ వీలర్లు

హీరో గ్లామర్ సాధారణ వేరియంట్ మరియు ఫ్యూల్ ఇంజెక్షన్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. రెండింటిలో కూడా 125సీసీ ఇంజన్ అందించినప్పటికీ సాధారణ గ్లామర్ లీటర్‌కు 55 కిలోమీటర్లు మరియు ఎఫ్ఐ వేరియంట్ 72కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

గ్లామర్ ధరలు

గ్లామర్ ధరలు

 • సాధారణ గ్లామర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 66,179 లు
 • సాధారణ గ్లామర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 68,507 లు
 • గ్లామర్ ఎఫ్ఐ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 73,857 లు
అన్ని ధరలు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉన్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

రాయల్ ఎన్ఫీల్డ్ తమ లైనప్‌లోని అన్ని ఉత్పత్తుల్లో బిఎస్-4 ఇంజన్ అందించింది. అందులో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్ క్లాసిక్ 350లో కూడా బిఎస్4 అప్‌గ్రేడ్స్ నిర్వహించింది. గత ఫిబ్రవరిలో రాయల్ ఎన్ఫీల్డ్ సుమారుగా 40,768 యూనిట్ల క్లాసిక్ 350 మోటార్ సైకిళ్లను విక్రయించింది.

ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్4 టూ వీలర్లు

రాయల్ ఎన్పీల్డ్ తమ క్లాసిక్ 350 మోడల్‌ను స్టాండర్డ్ మరియు రెడ్డిచ్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. అయితే రెండింటిలో కూడా 346సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్4 టూ వీలర్లు

లీటర్‌కు 37కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల క్లాసిక్ 350లోని ఇంజన్ గరిష్టంగా 19.80బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధర వివరాలు.

 • క్లాసిక్ 350 స్టాండర్డ్ ధర రూ. 1,56,058 లు అన్ రోడ్ హైదరాబాద్‌గా ఉంది.
టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్

దేశీయ రెండవ అతి పెద్ద స్కూటర్ల తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ యొక్క బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ జూపిటర్. గడిచిన ఫిబ్రవరి 2017 లో 51,817 యూనిట్ల జూపిటర్ స్కూటర్లను విక్రయించింది.

ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్4 టూ వీలర్లు

టీవీఎస్ మోటార్స్ తమ జూపిటర్ శ్రేణి స్కూటర్లలో బిఎస్4 ఉద్గార నియమాలను పాటించే 109.70సీసీ సామర్థ్యంగల సింగల్ సిలిండర్ అందించింది. 7.80బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల దీని మైలేజ్ లీటర్‌కు 56కిలోమీటర్లుగా ఉంది.

జూపిటర్ ధరలు

జూపిటర్ ధరలు

 • జూపిటర్ స్టాండర్డ్ ధర రూ. 60,747 లు
 • జూపిటర్ జడ్ఎక్స్ ధర రూ. 62,980 లు
 • జూపిటర్ మిలియన్ ఆర్ ధర రూ. 65,181 లు
అన్ని ధరలు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉన్నాయి.
బజాజ్ పల్సర్ 150

బజాజ్ పల్సర్ 150

బజాజ్ ఆటో తమ లైనప్‌లో ఉన్న దాదాపు అన్ని టూ వీలర్లకు బిఎస్-IV అప్‌గ్రేడ్స్ నిర్వహించింది. అందులో భాగంగానే తమ పల్సర్ 150లో బిఎస్4 ఇంజన్ అందివ్వడం జరిగింది. ఫిబ్రవరి 2017 విక్రయాల్లో 53,932 యూనిట్లు అమ్ముడుపోయాయి.

ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్4 టూ వీలర్లు

పల్సర్ 150 మోటార్ సైకిల్‌లో 149సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. లీటర్‌కు 65 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల ఈ ఇంజన్ 15బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్4 టూ వీలర్లు

న్యూక్లియర్ బ్లూ, లేసర్ రెడ్ మరియు డైనో రెడ్ రంగుల్లో ఎంచుకోగల బజాజ్ పల్సర్ 150 ధర రూ. 87,061 లు అన్ రోడ్ హైదరాబాద్‌గా ఉంది.

హోండా సిబి షైన్

హోండా సిబి షైన్

దేశీయంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ 125సీసీ బైకుగా సిబి షైన్ రికార్డు సృష్టించింది. గడిచిన ఫిబ్రవరి 2017 విక్రయాల్లో 66,402 యూనిట్ల షైన్ టూ వీలర్లు అమ్ముడుపోయాయి. హోండా టూ వీలర్స్ షైన్ లోని అన్ని వేరియంట్లలో బిఎస్4 అప్‌గ్రేడ్స్ నిర్వహించింది.

ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్4 టూ వీలర్లు

సాంకేతికంగా హోండా తమ సిబి షైన్‌లో 125సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. లీటర్‌కు 65కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల ఇది గరిష్టంగా 10బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

సిబి షైన్ ధరలు

సిబి షైన్ ధరలు

 • సిబి షైన్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 66,799 లు
 • సిబి షైన్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 69,423 లు
 • సిబి షైన్ సిబిఎస్ వేరియంట్ ధర రూ. 72,721 లు
ధరలు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉన్నాయి.
హీరో ప్యాసన్

హీరో ప్యాసన్

హీరో మోటోకార్ప్ గత ఫిబ్రవరి 2017లో 69,763 యూనిట్ల ప్యాసన్ బైకులను విక్రయించింది. హీరో మోటోకార్ప్ గడువులోపు అన్ని మోటార్ సైకిళ్లలో బిఎస్-IV ఇంజన్‌లను అప్‌గ్రేడ్ చేసింది.

ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్4 టూ వీలర్లు

హీరో ప్యాసన్‌లో మూడు విభిన్న వేరియంట్లు ఉన్నాయి. అవి, ప్యాసన్ ప్రొ టిఆర్, ప్యాసన్ ప్రొ ఐ3ఎస్, ప్యాసన్ ప్రొ ఎక్స్. తొలి రెండు వేరియంట్లలో 97సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. మరియు ప్యాసన్ ఎక్స్ ప్రొ వేరియంట్లో 109సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు.

 ధర మరియు మైలేజ్ వివరాలు

ధర మరియు మైలేజ్ వివరాలు

ప్యాసన్ లోని 97సీసీ ఇంజన్ 84కిమీల మైలేజ్ మరియు 109సీసీ ఇంజన్ వేరియంట్ 86కిమీల మైలేజ్ ఇవ్వగలదు. ప్యాసన్ ప్రారంభ వేరియంట్ ధరలు:

 • ప్యాసన్ ప్రొ టిఆర్ ధర రూ. 64,073 లు
 • ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ ధర రూ. 59,743 లు
 • ప్యాసన్ ప్రొ ఎక్స్ ధర రూ. 62,384 లు
 03. హీరో హెచ్ఎఫ్ డీలక్స్

03. హీరో హెచ్ఎఫ్ డీలక్స్

హీరో మోటోకార్ప్‌కు భారీ విక్రయాలు సాధించిపెడుతున్న రెండవ కమ్యూటర్ మోటార్ సైకిల్ హెచ్ఎఫ్ డీలక్స్. గడిచిన ఫిబ్రవరి 2017 లో 1,21,902 యూనిట్ల హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్లు అమ్ముడుపోయాయి.

ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్4 టూ వీలర్లు

సాంకేతికంగా హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌లో 97సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. లీటర్‌కు 83 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల ఇందులో కిక్ స్టార్ స్పోక్ వీల్, కిక్ స్టార్ట్ అల్లాయ్ వీల్స్, సెల్ఫ్ స్టార్ట్ స్పోక్ వీల్ మరియు సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వీల్స్ అనే నాలుగు వేరియంట్లు ఉన్నాయి.

 హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌ వేరియంట్ల వారీగా ధరలు

హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌ వేరియంట్ల వారీగా ధరలు

కిక్ స్టార్ స్పోక్ వీల్స్ ధర రూ. 50,484 లు

కిక్ స్టార్ట్ అల్లాయ్ వీల్స్ ధర రూ. 50,594 లు

సెల్ఫ్ స్టార్ట్ స్పోక్ వీల్స్ ధర రూ. 52,471 లు

సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వీల్స్ ధర రూ. 50,594 లు

హీరో స్ల్పెండర్

హీరో స్ల్పెండర్

దేశీయ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు గరిష్ట విక్రయాలు సాధించిపెడుతున్న టూ వీలర్ స్ల్పెండర్. ఒక్క ఫిబ్రవరి 2017 నెలలోనే 2,08,512 యూనిట్ల స్ల్పెండర్ బైకులను విక్రయించింది.

ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్4 టూ వీలర్లు

హీరో మోటోకార్ప్ స్ల్పెండర్ లైనప్‌లోని అన్ని మోడళ్లలో 97సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ అందించింది. లీటర్‌కు 81కిమీల మైలేజ్ ఇవ్వగల ఇది గరిష్టంగా 8.2బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

 ధర వివరాలు

ధర వివరాలు

 • స్ల్పెండర్ ప్లస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 54,532 లు
 • స్ల్పెండర్ ప్రొ ప్రారంభ వేరియంట్ ధర రూ. 56,975 లు
 • స్ల్పెండర్ ఐస్మార్ట్ వేరియంట్ ధర రూ. 59,801 లు
 • స్ల్పెండర్ ప్రొ క్లాసిక్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 59,133 లు
అన్ని ధరలు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉంది.
01. హోండా ఆక్టివా 4జీ

01. హోండా ఆక్టివా 4జీ

హోండా స్కూటర్ అండ్ మోటార్ సైకిల్ ఇండియా లిమిటెడ్ ఫిబ్రవరిలో బిఎస్-4 ఆక్టివా 4జీ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫిబ్రవరి 2017 నెలలో జరిగిన విక్రయాల్లో 2,17,098 యూనిట్ల ఆక్టివా స్కూటర్లు అమ్ముడుపోయాయి.

ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్4 టూ వీలర్లు

హోండా ఆక్టివా స్కూటర్ ఐ, 4జీ మరియు 125 అనే మోడళ్లలో అందుబాటులో ఉంది. ఆక్టివా ఐ మరియు 4జీ వేరియంట్లో 109సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. మరియు ఆక్టివా 125 వేరియంట్లో 124సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు.

హోండా ఆక్టివా ధర వివరాలు

హోండా ఆక్టివా ధర వివరాలు

 • ఆక్టివా ఐ ప్రారంభ వేరియంట్ ధర రూ. 56,818 లు
 • ఆక్టివా 4జీ ప్రారంభ వేరియంట్ ధర రూ. 61,043 లు
 • ఆక్టివా 125 ప్రారంభ వేరియంట్ ధర రూ. 68,065 లు
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ హైదరాబాద్‌గా ఉన్నాయి.

English summary
Read In Telugu to know about top ten Bs4 two wheelers in India right now
Story first published: Monday, April 10, 2017, 18:36 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark