విపణిలోకి ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలకు...

Written By:

దిగ్గజ ఖరీదైన మరియు లగ్జరీ బైకుల తయారీ సంస్థ బ్రిటిన్‌కు చెందిన ట్రైయంప్ ఉగాది పర్వదినాన కేంద్ర రాజధాని ఢిల్లీ నగర వేదికగా విపణిలోకి తమ బొన్‌ల్ బాబర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.09 లక్షలుగా ఉన్నట్లు ట్రైయంప్ ప్రతినిధులు తెలిపారు.

 ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ విడుదల వివరాలు తెలుగులో

ట్రైయంప్ సంస్థ యొక్క మొట్టమొదటి ఫ్యాక్టరీ కస్టమ్ మోటార్ సైకిల్ ఇదే, క్లాసిక్ పేరును నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే విధంగా ట్రైయంప్ ఇందులో మోడిఫికేషన్స్ నిర్వహించింది. నిజానికి ఈ బొన్‌విల్ బాబర్ బైకును ట్రైయంప్ యొక్క టి120 ఆధారంతో నిర్మించినప్పటికీ ఇందులోని ఛాసిస్‌తో పాటు ఇతర ప్రధాన విడిభాగాలలో మోడిఫికేషన్స్ చేసారు.

 ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ విడుదల వివరాలు తెలుగులో

ఇందులో చోటు చేసుకున్న మోడిఫికేషన్స్‌లలో ప్రధానంగా గుర్తించదగినది సింగల్ రైడర్ సీటు మరియు రియర్ సస్పెన్షన్ సిస్టమ్‌ యొక్క అమరిక. క్లాసిక్ డిజైన్ శైలిలో ఇదొక నూతన పోకడ.

 ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ విడుదల వివరాలు తెలుగులో

ట్రైయంప్ తమ లైనప్‌లో ఉన్న అన్ని ఉత్పత్తుల యొక్క విడి భాగాలను కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే బొన్‌విల్ బాబర్ ట్రైయంప్ ఫ్యాక్టరీ యొక్క మొదటి పూర్తి స్థాయి కస్టమైజ్‌డ్ ఉత్పత్తి.

 ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ విడుదల వివరాలు తెలుగులో

క్లాసిక్ డిజైన్‌లో బొన్‌విల్ బాబర్‌లోని నూతన సాంకేతిక విశయానికి వస్తే, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రైడింగ్ మోడ్స్(రోడ్ మరియు రెయిన్), రైడ్ బై వైర్ టెక్నాలజీ ఇందులో కలదు.

 ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ విడుదల వివరాలు తెలుగులో

నూతనంగా ఇండియన్ ట్రైయంప్ ప్రొడక్ట్ లైనప్‌లోకి వచ్చి చేరిన బొన్‌విల్ బాబర్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1200సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ఇన్ లైన్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు.

 ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ విడుదల వివరాలు తెలుగులో

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 76బిహెచ్‌పి పవర్ మరియు 106ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

 ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ విడుదల వివరాలు తెలుగులో

228కిలోలు బరువుండే ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ బైకు లీటర్‌కు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు, 24 కిలోమీటర్లేనా అని అనుకుంటున్నారు, ఇందులో ఉన్న 1200సీసీ గల ఇంజన్ ఇలాంటి మైలేజ్ ఇవ్వడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే...

 ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ విడుదల వివరాలు తెలుగులో

బ్రిటీష్ మోటార్ సైకిల్ తయారీదారు ట్రైయంప్ తమ కస్టమైజ్ బొన్‌విల్ బాబర్ బైకులో 150కి పైగా అదనపు మోడిఫైడ్ యాక్ససరీలను అందుబాటులో ఉంచింది.

 ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ విడుదల వివరాలు తెలుగులో

ప్రస్తుతం అమెరికాకు చెందిన దిగ్గజ ద్విచక్ర తయారీదారులు హార్లీ డేవిడ్స్ మరియు ఇండియన్ మోటార్ సైకిల్స్ దేశీయంగా అందించే ఉత్పత్తులకు గట్టి పోటీనివ్వనుంది.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

టాటా మోటార్స్ హేవళంబినామ సంవత్సర ఉగాది పర్వదినాన తమ టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. టాటా టిగోర్ ధర, ఇంజన్, మైలేజ్, ఫీచర్లలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...

 
English summary
Triumph Bonneville Bobber Launched In India For Rs 9.09 Lakh — The Modern Classic
Story first published: Thursday, March 30, 2017, 10:51 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark