రూ. 10.55 లక్షల ధరతో ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకు విడుదల

ట్రయంప్ మోటార్ సైకిల్స్ ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి రూ. 10.55 లక్షల ప్రారంభ ధరతో అత్యంత శక్తివంతమైన స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకును విడుదల చేసింది.

By Anil

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం ట్రయంప్ ఇండియన్ మార్కెట్లోకి స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకును విడుదల చేసింది. ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర రూ. 10.55 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

ట్రయంప్ మోటార్ సైకిల్స్ ఇండియా విభాగం ఈ మధ్యనే ఎంట్రీ లెవల్ స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ మోటార్ సైకిల్‌ను దేశీయ విపణిలోకి రూ. 8.50 లక్షల ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో లాంచ్ చేసింది.

Recommended Video

Triumph Street Triple RS Launch In India | In Telugu - DriveSpark
ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

సాంకేతికంగా స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకులో 765సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 121బిహెచ్‌పి పవర్ మరియు 77ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

ట్రయంప్ ఈ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకులో సుమారుగా 80 వరకు కొత్త విడి భాగాలను అందించింది. అందులో అతి ప్రధానమైన క్రాంక్, పిస్టన్లు మరియు నికాసిల్ ప్లేటెడ్ అల్ల్యూమినయం బ్యారెల్స్, బోర్ మరియు స్ట్రోక్‌తో పాటు ఇంజన్‌లోని ఎన్నో పార్ట్స్ కొత్తగా వచ్చాయి.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

సరికొత్త ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకులో అత్యున్నత ప్రమాణాలు గల బ్రెంబో ఎమ్50 బ్రేకులు, ముందు వైపున షో బిగ్ పిస్టన్ ఫోర్క్స్, మరియు వెనుక వైపున ఓహ్లిన్స్ మోనోషాక్ అబ్జార్వర్ గల సస్పెన్షన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

Trendin On DriveSpark Telugu:

మీ వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఉందా... ఈ తప్పు చేస్తే మీ బైకుకూ ఇదే గతి...!!

బస్సు లారీ మధ్య నలిగిపోయిన కారులో అందరూ సేఫ్: ఇంతకీ అది ఏ కారో తెలుసా...?

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్‌లో 5-అంగుళాల పరిమాణం గల ఫుల్ కలర్ టిఎఫ్‌టి స్క్రీన్ ఇంస్ట్రుమెంట్ కలదు. ఈ డిస్ల్పేని రెండు విభిన్న థీమ్‌లలో చూడవచ్చు మరియు డిస్ల్పే కాంట్రాస్ట్‌ను అవసరానికి తగ్గట్లుగా మార్చుకోవచ్చు.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

భద్రత పరంగా ట్రయంప్ తమ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకులో స్విచ్చబుల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ బై వైర్ థ్రోటిల్ వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. వీటితో పాటు రోడ్ రెయిన్, స్పోర్ట్, ట్రాక్ మరియు ఇండివిడ్యువల్ అనే ఐదు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

కొత్తగా విడుదలైన ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ను రెండు మ్యాట్ సిల్వర్ ఐస్ మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు. యారో ఎగ్జాస్ట్, స్వింగ్ ఆర్మ్ ప్రొటెక్టర్ కిట్ వంటి 60 రకాల కస్టమైజ్ యాక్ససరీలను పొందవచ్చు.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ట్రయంప్ శ్రేణిలో అత్యంత శక్తివంతమైన స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. అయితే, కంపెనీ తమ మిడ్ రేంజ్ మోడల్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైకును విడుదలను దాటవేసింది. పవర్ ఫుల్ నేక్ట్డ్ బైకు ఇప్పటికే విపణిలో ఉన్న డుకాటి మోన్‌స్టర్ 821 మరియు కవాసకి జడ్900 బైకులతో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Triumph Street Triple RS Launched In India; Priced At Rs 10.55 Lakh
Story first published: Thursday, October 19, 2017, 19:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X