ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్స్ ఎస్ బైకు విడుదల: ధర రూ. 8.50 లక్షలు

Written By:

బ్రిటన్‌కు చెందిన శక్తివంతమైన మరియు ఖరీదైన మోటార్ సైకిళ్ల సంస్థ ట్రయంప్ తమ స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ బైకును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే ఇందులో సరికొత్త ఇంజన్, మార్పులు చేర్పులు చేసిన డిజైన్ మరియు తేలికపాటి బరువున్న ఛాసిస్ మరియు అప్‌డేట్ చేయబడిన సస్పెన్షన్ వ్యవస్థలను పరిచయం చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్స్ ఎస్

మధ్యమ స్థాయి బరువుతో 2017 మోడల్‌గా నూతన స్పోర్ట్స్ డిజైన్ ఫిలాసఫీతో మునుపటి మోడల్ కన్నా అత్యంత పదునైన డిజైన్ లక్షణాలతో స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. అయితే పురుగులను పోలి ఉండే హెడ్ ల్యాంప్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్స్ ఎస్

ట్రయంప్ నూతన స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ బైకులో నూతన రేడియేటర్ గార్డ్స్, అప్‌డేట్ చేయబడిన మడ్ గార్డ్స్ లను కలిగి ఉంది. మొత్తం 166కిలోల బరువుతో సెగ్మెంట్లోనే తక్కువ బరువుతో ఉన్న మోటార్ సైకిల్‌గా నిలిచింది.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్స్ ఎస్

2017 ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ మోటార్ సైకిల్ రెండు విభిన్నమైన కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అవి, ఎరుపు మరియు ఫాంటమ్ బ్లాక్. ఆర్ఎస్ వేరియంట్లో ఉన్న టిఎఫ్‌టి డిస్ల్పేకు పోటీగా ఎస్ వేరియంట్లో ఎల్‌సిడి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్స్ ఎస్

సాంకేతికంగా ఈ స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ మోటార్ సైకిల్‌లో ట్రయంప్ 765సీసీ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల ఇన్ లైన్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 111బిహెచ్‍‌‌పి పవర్ మరియు 73ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్స్ ఎస్

ట్రయంప్ ప్రత్యేకంగా అభివృద్ది చేసిన ఇంజన్‌లో సరికొత్త క్యామ్, పిస్టన్లు, పొడగించబడిన బోర్ మరియు చుట్టుకొలత అదే విధంగా నికాసిల్ కోటింగ్ గల అల్యూమినియం బ్యారెల్ వంటి 80 వరకు కొత్త పరికరాలను వినియోగించింది.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్స్ ఎస్

స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ మోటార్ సైకిల్‌లో జపాన్‌కు చెందిన షోవా సస్పెన్షన్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసిన అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ పోర్క్స్ మరియు ప్రిలోడెడ్ అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జార్వర్ లను ముందు మరియు వెనుక వైపున అందివ్వడం జరిగింది.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్స్ ఎస్

బ్రేక్ వ్యవస్థ కోసం ఈ మోటార్ సైకిల్ నందు ముందు వైపున రెండు పిస్టన్ కాలిపర్ నిస్సిన్ బ్రేక్ మరియు వెనుక వైపున బ్రెంబో సింగల్ పిస్టన్ కాలిపర్ కలదు. ఆఫ్ చేయడానికి వీల్లేని విధంగా డ్యూయల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది. దీనికి తోడు ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా కలదు.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్స్ ఎస్

ట్రయంప్ తమ స్ట్రీట్ ట్రిపుల్ మోటార్ సైకిల్‌ను ప్రస్తుతానికి ఎంట్రీ లెవల్ ఎస్ వేరియంట్లో మాత్రమే విడుదల చేసింది. అయితే ఆర్ఎస్ వేరియంట్ బైకును వచ్చే ఏడాదిలో విడుదల చేయనుంది. సరికొత్త స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ విపణిలో ఉన్న కవాసకి జడ్900, డుకాటి మోన్‌స్టర్ 821 మరియు అప్రిలియా షివర్ 900 లకు గట్టి పోటీనిస్తుంది.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్స్ ఎస్

ట్రియంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ మోటార్ సైకిల్‌కు ఉన్న పోటీ ఉత్పత్తుల ఎక్కువ శక్తివంతమైన మరియు ధరతో కూడుకున్నవి, అయితే ఆర్ఎస్ విడుదలయితే వాటికి సమానమైన పోటీనిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయంప్ విక్రయ కేంద్రాలలో స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ మోటార్ సైకిల్‌పై బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, త్వరలో డెలివరీ కూడా ప్రారంభించనున్నారు.

English summary
Read In Telugu Triumph Street Triple S Launched In India — Priced At Rs 8.50 Lakh
Story first published: Monday, June 12, 2017, 15:25 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark