చివరి దశ పరీక్షలకొచ్చిన టీవీఎస్ అకులా: కంప్లీట్ డిటైల్స్

Written By:

చెన్నై ఆధారిత దేశీయ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ శక్తివంతమైన మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లోకి అకులా 310 బైకు విడుదలకు సర్వం సిద్దం చేసుకుంది. మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో చివరి దశ పరీక్షలకొచ్చి రహస్యంగా మీడియా కెమెరాకు చిక్కింది. ఆ వివరాలు నేటి కథనంలో తెలుసుకుందాం రండి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టీవీఎస్ అకులా 310

బెంగళూరు మరియు టీవీఎస్ ప్రొడక్షన్ ప్లాంటు గల హోసూరు కు మధ్యలో టీవీఎస్ బృందం ఈ అకులా 310 మోటార్ సైకిల్‌కు ట్రాక్ పరీక్షలు జరిపింది. మునుపటి వేరియంట్‌తో పోల్చుకుంటే దాదాపుగా ప్రొడక్షన్ దశకు చేరుకుంది.

టీవీఎస్ అకులా 310

ఎక్స్‌బిహెచ్‌పి అనే మీడియా ఇంట్ర్నెట్ ద్వారా పంచుకున్న ఈ అకులా 310 పరీక్షలకు చెందిన ఫోటోల మేరకు కొన్ని నూతన ఫీచర్లు కూడా విడుదలయ్యాయి. మార్కెట్లోకి అతి త్వరలో విడుదల కానున్న ఇందులో ఆధునిక ఫీచర్ల జోడింపుకు తీవ్ర కసరత్తులు జరుగుతున్నాయి.

టీవీఎస్ అకులా 310

అకులా 310 మోటార్ సైకిల్‌ విడుదలకు ముందే యమహా ఎఫ్‌జడ్25 మరియు కెటిఎమ్ ఆర్‌సి200 మోడళ్లు అకులా మీద పోటీగా ఇప్పటికే విపణిలోకి విడుదలయ్యాయి. అకులా తయారీదారులు తెలిపిన వివరాల మేరకు దీనిని షార్క్ (సొర చేప) ప్రేరణతో డిజైన్ చేసినట్లు తెలిసింది.

టీవీఎస్ అకులా 310

ఇప్పటికే పలు దఫాలుగా రహదారి పరీక్షలకొచ్చిన అకులా 310 మోటార్ సైకిల్‌లో ఒక్కోసారి ఒక విధమైన ఫీచర్ గుర్తించడం జరుగుతోంది. ఫీచర్లను గుర్తించడానికి ఏ మాత్రం వీల్లేకుండా పూర్తిగా నలుపు, తెలుపు మరియు నీలం రంగుల నిలువ చారలతో బైకును కప్పేశారు. అయితే నూతన ఇంస్ట్రుమెంట్ కన్సోల్ గుర్తించడం జరిగింది.

టీవీఎస్ అకులా 310

సాంకేతికంగా అకులా 310 బైకులో 310సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందివ్వడం జరిగింది. గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

టీవీఎస్ అకులా 310

దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. ఇదే ఇంజన్‌ను బిఎమ్‌డబ్ల్యూ అభివృద్ది చేస్తున్న జి310 ఆర్ లో కూడా గుర్తించవచ్చు.

టీవీఎస్ అకులా 310

టీవీఎస్ అకులా 310 లో ట్విన్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఇరు వైపులా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు సొర చేప ప్రేరిత టెయిల్ ల్యాంప్ సెక్షన్ ను ఇందులో అందివ్వడం జరిగింది.

టీవీఎస్ అకులా 310

టీవీఎస్ అకులా 310 బైకును సుమారుగా రూ. 2 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఇది దేశీయ విపణిలోకి విడుదలయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యమహా ఆర్3, కవాసకి నింజా 300 మరియు కెటిఎమ్ ఆర్‌సి 390 వంటి బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

మరిన్ని సూపర్ బైకుల ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించగలరు....

 

English summary
TVS Akula 310 Spotted Testing In Bengaluru; Clear Images Reveals Digital Instrument Cluster
Story first published: Monday, January 30, 2017, 12:51 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark