మరో రెండు రోజుల్లో విపణిలోకి దూసుకొస్తున్న టీవీఎస్ తొలి స్పోర్ట్స్ బైక్

Written By:

టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచే ఆర్ఆర్ 310 రేసింగ్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 6, 2017 న విపణిలోకి పూర్తి స్థాయిలో విడుదల చేయనుంది. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో మోటార్ సైకిల్ ఔత్సాహికుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఓ టీజర్‌ను టీవీఎస్ విడుదల చేసింది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

టీవీఎస్ మోటార్స్ 2016లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద అపాచే ఆర్ఆర్ 310 బైకును అకులా 310 పేరుతో మొట్టమొదటిసారిగా కాన్సెప్ట్ దశలో ప్రదర్శించింది. రెండేళ్ల తరువాత ప్రొడక్షన్ దశకు చేరుకున్న మోడల్‌ను పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దం చేసింది.

తాజాగా టీవీఎస్ విడుదల చేసిన టీజర్ వీడియోలో ప్రధాన డిజైన్ ఎలిమెంట్లు రివీల్ అయ్యాయి. అపాచే ఆర్ఆర్ 310 ఫ్రంట్ ప్రొఫైల్, ఇంజన్ కేసింగ్, ఫెయిరింగ్, మరియు టెయిల్ సెక్షన్ ఆకృతులను చూపించింది. పలు బాడీ గ్రాఫిక్‌లతో కూడిన రెడ్ పెయింట్ స్కీములో ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

అపాచే ఆర్ఆర్ 310 ఫ్రంట్ ప్రొఫైల్ పూర్తిగా ఏరోడైనమిక్ డిజైన్‌లో ఉంది. పగటి పూట వెలిగే యాంగులర్ ఎల్ఇడి లైట్ల జోడింపుతో కూడిన ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. మోటార్ సైకిల్‌లో ముందువైపున విండ్ షీల్డ్ ఉంది. అధిక వేగంలో ఉన్నపుడు గాలి వలన కలిగే ఘర్షణను ఇది నివారిస్తుంది. మరియు స్పోర్టివ్ ఫీల్ కలిగించేలా వైట్ స్ట్రిప్స్ ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

ఇంజన్ కేసింగ్ చూడటానికి అచ్చం బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి 310 జిఎస్ బైకులను పోలి ఉంటుంది. ఇందులో ఉన్న 313సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇండియన్ రోడ్లకు అనుగుణంగా టీవీఎస్ ఈ ఇంజన్‌ను ట్యూనింగ్ చేసింది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

రెడ్ కలర్ పెయింట్ స్కీములో ఫినిషింగ్ చేయబడిన అపాచే ఆర్ఆర్ 310 బైకు మీద టీవీఎస్ బ్రాండింగ్ గమనించవచ్చు. రేసింగ్ వారసత్వాన్ని గుర్తించే విధంగా రేస్ స్పెక్ ట్రెల్లిస్ ఫ్రేమ్, డెవిల్ హార్న్ శైలిలో ఉన్న ఎల్ఇడి టెయిల్ లైట్ మరియు 35 సంవత్సరాల టీవీఎస్ రేసింగ్ చరిత్రను రంగరించి దీనిని అభివృద్ది చేసింది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

ఇతర ప్రధానమైన ఫీచర్లలో అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెర్టికల్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఇరు వైపులా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. కమ్యూటింగ్ మరియు టూరింగ్ అవసరాలకు సరిపోయే విధంగా టీవీఎస్ దీనిని తీర్చిదిద్దింది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ మోటార్ కంపెనీకి ఇండియన్ మార్కెట్లో అపాచే ఆర్ఆర్ 310 అతి ముఖ్యమైన మోడల్ కానుంది. టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే కెటిఎమ్ ఆర్‌సి 390, కవాసకి నింజా 300 మరియు బెనెల్లీ 302ఆర్ వంటి మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనివ్వనుంది. టీవీఎస్ దీనిని డిసెంబర్ 6, 2017 లాంచ్ చేయనుంది. ధర మరియు విడుదల వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

English summary
Read In Telugu: TVS Apache RR 310 Teased Ahead Of Launch

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark