అపాచే ఆర్ఆర్ 310ఎస్ స్పోర్ట్స్ బైకు పేటెంట్ ఫోటోలు విడుదల చేసిన టీవీఎస్

Written By:

భారత ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ విపణిలోకి తమ మొట్టమొదటి స్పోర్ట్స్ బైకును విడుదల చేయడానికి సిద్దమైంది. టీవీఎస్ వారి ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్ సైకిల్ అపాచే ఆర్ఆర్ 310ఎస్ మీద పేటెంట్ హక్కులు కూడా పొందింది. దీని తాలూకు మొదటి ఫోటో ఆన్‌లైన్‌లో విడుదలైంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

పేటెంట్ ఫోటో ద్వారా అపాచే ఆర్ఆర్ 310ఎస్ మోటర్ సైకిల్ ఇప్పుడు ప్రొడక్షన్ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించిన మోడల్‌ను పోలిన డిజైన్‌లో ఉంది.

Recommended Video - Watch Now!
2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్ మోటార్ సైకిల్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న ట్విన్ హెడ్ ల్యాంప్ క్లస్టర్ మరియు విండ్ స్క్రీన్ కలదు. అత్యుత్తమ రైడింగ్ పొజిషన్‌ను కల్పిస్తూ, సస్పెన్షన్ సిస్టమ్ కనబడే విధంగా బైకు ఇరువైపులా ఫెండర్స్ ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్‌ ఎంట్రీ లెవల్ నేక్డ్ బైకు జి 31ఆర్ ఆధారంగా టీవీఎస్ బృందం అపాచే ఆర్ఆర్ 310ఎస్ మోటార్ సైకిల్‌ను అభివృద్ది చేసింది. టీవీఎస్ స్పోర్ట్స్ బైకులో సాంకేతికంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 313సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్ ముందు వైపున అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ కలదు. ఇది యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది. టీవీఎస్ ఉత్పత్తి చేసిన మోటార్ సైకిళ్లలో ఇప్పటి వరకు అత్యంత వేగమైనది అపాచే ఆర్ఆర్ 310ఎస్.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్ మోటార్ సైకిల్‌ను పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదల చేస్తే కెటిఎమ్ ఆర్‌సి390, హోండా సిబిఆర్ 250ఆర్ మరియు యమహా వైజడ్ఎఫ్ ఆర్3 వంటి బైకులను నోరు మూయించడం ఖాయం.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్ మోటార్ సైకిల్‍‌ రేసింగ్ ప్రియులకు అత్యుత్తమ రేసింగ్ అనుభవాన్ని పొందుతారని తెలిపింది. టీవీఎస్ ఎప్పటి నుండో రేసింగ్ సెగ్మెంట్లో తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు అపాచే ఆర్ఆర్ 310ఎస్ విడుదల ద్వారా విదేశీ స్పోర్ట్స్ బైకులకు గట్టి షాక్ ఇవ్వనుంది. ఈ దేశీయ స్పోర్ట్స్ బైకు రెండు లక్షల రుపాయల ప్రారంభ ధరతో వచ్చే సెప్టెంబర్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: TVS Apache RR 310S Patent Image Leaked
Story first published: Thursday, August 17, 2017, 10:48 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark