టీవీఎస్ వారి ఫస్ట్ కంప్లీట్ స్పోర్ట్స్ బైకు: ఇలా పట్టుబడింది

Written By:

స్వదేశీ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ మైలేజ్ బైకులు మరియు స్కూటర్ల నుండి స్పోర్ట్స్ బైకుల మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా టీవీఎస్ తమ తొలి ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ అపాచే ఆర్ఆర్ 310ఎస్ బైకును పరీక్షిస్తూ పట్టుబడింది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310ఎస్ మోటార్ సైకిల్ మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో రహదారి పరీక్షలకొచ్చింది. దీని విడుదల గురించి టీవీఎస్ అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

నలుపు, ఎరుపు మరియు తెలుపు రంగు చారులున్న బాడీ డీకాల్స్‌తో ఆపాచే ఆర్ఆర్ 310ఎస్ బైకును టెస్ట్ చేస్తున్నారు. మోడల్, డిజైన్ మరియు సాంకేతిక వివరాలు లీక్ అవ్వకుండా టీవీఎస్ జాగ్రత్తపడుతోంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

టీవీఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఉమ్మడి భాగస్వామ్యంతో రూపొందించిన బిఎమ్‍‌డబ్ల్యూ జి310ఆర్ ఆధారంగా టీవీఎస్ ఈ ఆపాచే ఆర్ఆర్ 310ఎస్ బైకును నిర్మించింది. జి310ఆర్ నుండి ఇంజన్, ఫోర్క్స్, బ్రేకులు, ఫ్రేమ్ మరియు కంట్రోల్స్ వంటి అతి ప్రధానమైన విడి భాగాలను సేకరించి ఇండియన్ రోడ్లకు అనుగుణంగా మలిచి ఆర్ఆర్ 310ఎస్ లో వినియోగించారు.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

టీవీఎస్ లైనప్‌లోకి తొలి కంప్లీట్ స్పోర్ట్ బైకుగా రాబోతున్న ఆపాచే ఆర్ఆర్ 310ఎస్‌లో 310సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310ఎస్ లో డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, రైడర్ మరియు పిలియన్ కోసం వేర్వేరు సీట్లు, పొడవుగా ఉన్న డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లతో పాటు వెనుక చక్రానికి ఏబిఎస్ వచ్చే అవకాశం ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లోకి టీవీఎస్ మోటార్స్ తొలి స్పోర్ట్స్ బైకుగా ఆపాచే ఆర్ఆర్ 310ఎస్ ను సిద్దం చేస్తోంది. టీవీఎస్ ఇప్పటికే పలుమార్లు రహస్యంగా పరీక్షించింది. సిటీ మరియు లాంగ్ రైడింగ్‌కు చక్కగా సరిపోయే ఆర్ఆర్ 310ఎస్ విపణిలో ఉన్న కెటిఎమ్ ఆర్‌సి 390, బెనెల్లీ 302ఆర్, కవాసకి నింజా 300 మరియు యమహా వైజడ్ఎఫ్-ఆర్3 బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: TVS Apache RR 310S Spotted Again; Launch Likely By This Year End
Story first published: Saturday, September 16, 2017, 17:08 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark