అకులా కాదంట, అపాచే పేరుతోనే ఆర్‌టిఆర్ 310 ను విడుదల సిద్దం చేసిన టీవీఎస్

Written By:

టీవీఎస్ మోటార్స్ తమ అపాచే ఆర్‌టిఆర్ 310 మోటార్ సైకిల్‌ను విపణిలోకి విడుదల చేయడానికి సిద్దం అయ్యింది. విడుదలకు ముందే టీవీఎస్ తమ డీలర్ల చెంతకు చేర్చిన అపాచే ఆర్‌టిఆర్ 310 మోటార్ సైకిళ్ల ఫోటోలు లీకయ్యాయి. ఫోటోలు మరియు అపాచే ఆర్‌టిఆర్ 310 గురించి మరిన్ని వివరాలు....

పాచే ఆర్‌టిఆర్ 310

టీవీఎస్ మోటార్స్ ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్ సైకిల్‌ను కాన్సెప్ట్ రూపంలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద అకులా 310 పేరుతో తొలి ప్రదర్శన చేసింది. రేసింగ్ విడి పరికరాలు మరియు కార్బన్ ఫైబర్ బాడీతో దీనిని రూపొందించడం జరిగింది.

పాచే ఆర్‌టిఆర్ 310

ఇప్పుడు పొడక్షన్ దశను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన అకులాను అపాచే ఆర్‌టిఆర్ 310 గా సంభోదిస్తున్నట్లు తెలిసింది. అయితే విడుదలకు ముందుగానే రెండు మోటార్ సైకిళ్లను డీలర్ల వద్ద మీడియా గుర్తించడం జరిగింది.

పాచే ఆర్‌టిఆర్ 310

ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఇక్కడ గుర్తించిన వాటిలో ఒకటి మట్టీ బ్లూ మరియు మరొకటి మట్టీ గ్రే కలర్‌లో ఉన్నాయి.

పాచే ఆర్‌టిఆర్ 310

అపాచే ఆర్‌టిఆర్ 310 ఎల్ఇడి పైలట్ ల్యాంప్స్ జోడింపుతో ఉన్న ట్విన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కలవు. అంతే కాకుండా ఇది ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్‌తో రానున్నట్లు సమాచారం.

పాచే ఆర్‌టిఆర్ 310

సరికొత్త అప్‌కమింగ్ అపాచే ఆర్‌టిఆర్ 310 లోని ఇతర ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, హ్యాండిల్ బార్ మీద క్లిప్స్, స్ల్పిట్ సీటు, వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్, పెటల్ డిస్క్ బ్రేకులు మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పాచే ఆర్‌టిఆర్ 310

సాంకేతికంగా టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 310 లో 313సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

పాచే ఆర్‌టిఆర్ 310

ఇదే ఇంజన్‌ను బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ టీవీఎస్ భాగస్వామ్యంతో అభివృద్ది చేసిన జి310 ఆర్ మోటార్ సైకిల్‌లో కూడా కలదు. అపాచే ఆర్‌టిఆర్ సుమారుగా రూ. 1.5 నుండి 1.8 లక్షల మధ్య ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

 
English summary
Read In Telugu to know about up coming tvs apache rtr 310. Get more details about tvs apache rtr 310.
Story first published: Monday, April 10, 2017, 11:06 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark