గ్రాఫైట్ పేరుతో సరికొత్త 150సీసీ స్కూటర్‌ను సిద్దం చేసిన టీవీఎస్

Written By:

టీవీఎస్ టూ వీలర్స్ ప్రొడక్షన్ దశకు చేరుకున్న గ్రాఫైట్ స్కూటర్‌ను కర్ణాటకలో పరీక్షించింది. దీనికి చెందిన ఓ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యింది.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్‌ను పరీక్షిస్తున్నపుడు ఓ వ్యక్తి అప్రిలియా ఎస్ఆర్ 150 స్కూటర్‌ మీద చేజింగ్ చేశాడు. సుమారుగా గంటకు 110కిలోమీటర్ల వేగంతో ఒక స్కూటర్‌ను మరొకటి చేజింగ్ జరిపాయి. టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్ సులభంగా మూడంకెల వేగాన్ని అందుకుంది.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

టీవీఎస్ టూ వీలర్స్ 2014లో జరిగిన ఆటో ఎక్స్ పో వేదిక మీద గ్రాఫైట్ స్కూటర్‌ను తొలిసారిగా ఆవిష్కరించింది. ఫంకీ డిజైన్‌లో ఉన్న టీవీఎస్ గ్రాఫైట్ అప్రిలియా ఎస్ఆర్ 150 స్కూటర్‌‌ రెండూ ఒకదానికొకటి గట్టి పోటీగా నిలిచాయి.

Recommended Video - Watch Now!
[Telugu] TVS Jupiter Classic Launched In India - DriveSpark
టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

రహదారి పరీక్షలు నిర్వహిస్తూ పట్టుబడిన గ్రాఫైట్ స్కూటర్ స్పోర్టి బాడీ వర్క్ మరియు అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని హై స్పీడ్ చూసిన తరువాత ఇందులో అందించిన 150సీసీ ఇంజన్ భారీ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్ట్సీరియర్ మరియు బాడీ డిజైన్ పరంగా చూస్తే కాన్సెప్ట్ దశ నుండి ప్రొడక్షన్ దశకు చేరుకున్నట్లు చెప్పవచ్చు.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

కాన్సెప్ట్ వెర్షన్ గ్రాఫైట్ స్కూటర్‌లో డ్యూయల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ మరియు స్మార్ట్ ఎలక్ట్రానిక్ కీ వంటివి ఉన్నాయి. అధిక ధృడత్వం గల స్టీల్‌తో నిర్మించిన సరికొత్త ఫ్రేమ్ మీద నిర్మించారు.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్‌లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున గ్యాస్ ఛార్జింగ్ డ్యాంపర్లు ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపున ఫ్రంట్ డిస్క్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. పలుచగా ఉన్న హెడ్ ల్యాంప్, అంతర్గత ఫ్యూయల్ ట్యాంక్ మరియు రెండుగా విడిపోయి ఉన్న గ్రాబ్ రెయిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్‌లో ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాన్సెప్ట్ మోడల్‌లో ఆవిష్కరించినపుడు ఈ స్కూటర్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లో ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ టూ వీలర్స్ ఇండియన్ పర్ఫామెన్స్ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశిస్తోందని చెప్పవచ్చు. విపణిలో ఉన్న ఎస్ఆర్150 స్కూటర్‌కు గ్రాఫైట్ స్కూటర్ గట్టి పోటీనివ్వనుంది. డిజైన్ మరియు పనితీరు అంశాల పరంగా రెండూ ఒకదానికొకటి గట్టి పోటీని ఎదుర్కోనున్నాయి.

English summary
Read In Telugu: Production-Spec TVS Graphite Scooter Spotted Testing In India
Story first published: Wednesday, November 22, 2017, 20:44 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark