స్కూటీ జెస్ట్ 110 స్కూటర్ల మీద కర్దుంగ్ లా చేరుకున్న 12 మంది బృందం: టీవీఎస్ హిమాలయన్ హైస్ సీజన్ 3

Written By:

టీవీఎస్ మోటార్ కంపెనీ స్కూటీ జస్ట్ 100 స్కూటర్లతో 12 మంది రైడర్లు హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన ప్రాంతం కర్దుంగ్ లా ప్రాంతాన్ని విజయవంతంగా చేరుకున్న పేర్కొంది. ప్రతి ఏటా టీవీఎస్ మోటార్ కంపెనీ హిమాలయన్ హైస్ పేరుతో ఈ రైడ్ నిర్వహిస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టీవీఎస్ హిమాలయన్ హైస్ సీజన్-3

టీవీఎస్ హిమాలయన్ హైస్ మూడవ సీజన్‌లో 10 మంది మహిళలు మరియు ఇద్దరు పురుషులతో సహా మొత్తం 12 మంది రైడర్లు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కఠినమైన రోడ్లుగా పేరున్న హిమాలయాల్లో సుమారుగా 970 కిలోమీటర్లు ప్రయాణించారు.

టీవీఎస్ హిమాలయన్ హైస్ సీజన్-3

మొత్తం 12 మంది రైడర్లు టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 స్కూటర్లతో 11 రోజుల వ్యవధిలో 970కిలోమీటర్ల పాటు ప్రయాణించి సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఉన్న కర్దుంగ్ లా పాస్ ప్రాంతాన్ని చేరుకున్నారు.

టీవీఎస్ హిమాలయన్ హైస్ సీజన్-3

హిమాలయన్ హైస్ సీజన్ 3 కోసం 12 మంది రైడర్లను వివిధ రకాల పరీక్షల అనంతరం టీవీఎస్ సెలక్ట్ చేసింది. శారీరక మరియు మానసిక పరీక్షల అనంతరం వీరిని ఎంచుకున్నట్లు టీవీఎస్ పేర్కొంది. టీవీఎస్ హిమాలయన్ హైస్ రైడ్ కోసం దేశవ్యాప్తంగా 100,000 మందికి పైగా ఎంక్వైరీ చేసినట్లు టీవీఎస్ చెప్పుకొచ్చింది.

టీవీఎస్ హిమాలయన్ హైస్ సీజన్-3

టీవీఎస్ హిమాలయన్ హైస్ సీజన్ 3 ని పూర్తి చేసిన రైడర్లు వీరే... అశ్విన్ పవార్(ముంబాయ్), అంజలి చౌదరి(ఉత్తర్ ప్రదేశ్), ఆశ్రయ సురేశ్(కర్ణాటక), షగుఫ్తా ఖాన్(ముంబాయ్), వినీత లోచబ్(ఢిల్లీ), రియా రాయ్(పశ్చిమ బెంగాల్), బైశాలి నాథ్(అస్సాం), దేవకి పి(తెలంగాణ), మిలమ్ షా(ఉత్తర్ ప్రదేశ్), మోహిత్ భరద్వాజ్(ఢిల్లీ), ఆండ్రి కమర(గోవా), మరియు అంజలి మనోహరన్(కేరళ).

టీవీఎస్ హిమాలయన్ హైస్ సీజన్-3

భారతదేశపు యువ మహిళా స్టంట్ రైడర్ అనమ్ హసీమ్ మొదటి సారిగా 2015లో టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 స్కూటర్‌లో కర్దుంగ్ లా పాస్ ను అధిరోహించింది. దీనిని గుర్తించిన టీవీఎస్ మోటార్ కంపెనీ అప్పటి నుండి టీవీఎస్ హిమాలయన్ హైస్ గా ఈ రైడ్‌ను నిర్వహిస్తోంది. వరుసగా ఇప్పుడు 3 సీజన్ పూర్తయ్యింది.

టీవీఎస్ హిమాలయన్ హైస్ సీజన్-3

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సముద్ర మట్టానికి 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న కర్దుంగ్ లా పాస్ రోడ్ రైడ్ కోసం టీవీఎస్ మోటార్స్ డ్రైవ్‌స్పార్క్‌ను ఆహ్వానించింది.

English summary
Read In Telugu: TVS Himalayan Highs Season 3 — 12 Riders Conquer Khardung La On The Scooty Zest 110
Story first published: Friday, September 15, 2017, 18:48 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark