నూతన కలర్ ఆప్షన్స్ మరియు అప్‌డేటెడ్ ఫీచర్లతో టీవీఎస్ జూపిటర్ విడుదల

Written By:

దేశీయ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తమ జూపిటర్ స్కూటర్‌లో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్, బిఎస్-IV ఇంజన్ మరియు రెండు నూతన కలర్ ఆప్షన్‌లను జోడించి విపణిలోకి విడుదల చేసింది.

టీవీఎస్ జూపిటర్

అప్‌గ్రేడెడ్ జూపిటర్ ప్రారంభ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఎంట్రీ లెవల్ జూపిటర్ ధర రూ. 49,666 లు మరియు టాప్ ఎండ్ డిస్క్ బ్రేక్ వేరియంట్ జూపిటర్ ధర రూ. 53,666 లు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ లైనప్‌లో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ అప్‌గ్రేడ్‌తో వచ్చిన రెండవ స్కూటర్ జూపిటర్. ప్రస్తుతం 110సీసీ జూపిటర్ స్కూటర్‍‌లో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్‌ కూడా కలదు.

టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్ ఇప్పుడు మరో రెండు అదనపు రంగుల్లో కూడా లభించును. అవి, జడే గ్రీన్ మరియు మైస్టిక్ గోల్డ్. గతంలో జడ్ఎక్స్ వేరియంట్లో మాత్రమే ఉండే సింక్ బ్రేక్ సిస్టమ్ ఫీచర్‌ను ఇప్పుడు బేస్ వేరియంట్లో కూడా అందివ్వడం జరిగింది.

టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ మాట్లాడుతూ, "ఎక్కువ వల్ల లాభం" అనే ట్యాగ్ లైన్ ద్వారా మంచి విజయాన్ని అందుకొన్నామని తెలిపాడు. జూపిటర్ విజయాన్ని కొనసాగించేందుకు మొత్తం జూపిటర్ శ్రేణిలో బిఎస్-IV ఇంజన్, సింక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ చేర్చినట్లు పేర్కొన్నాడు.

టీవీఎస్ జూపిటర్

అనిరుధ్ మాట్లాడుతూ, ప్రస్తుతం టీవీఎస్ జూపిటర్ లభించే కలర్ ఆప్షన్‌లతో పాటు జడే గ్రీన్ మరియు మైస్టిక్ గోల్డ్ అనే మరో రెండు రంగులను అందుబాటులో ఉంచినట్లు తెలిపాడు. ఈ రెండు చేరికతో ఇప్పుడు మొత్తం పది రంగుల్లో జూపిటర్ ఎంచుకోవచ్చు.

టీవీఎస్ జూపిటర్

బిఎస్-IV ఇంజన్ అప్‌డేట్ మినహాయిస్తే, జూపిటర్‌లో 109.7సీసీ సామర్థ్యం సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

టీవీఎస్ జూపిటర్

జూపిటర్‌లో టీవీఎస్ పేటెంట్ పొందిన ఎకానోమీటర్ కలదు. ఇది రైడర్లకు ఎకో మరియు పవర్ మోడ్‌లను సూచిస్తుంది. ఎకో మోడ్‌లో అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగలిగింది. స్కూటర్ ఫ్రంట్ ప్యానల్ మీద బిఎస్-IV అనే స్టిక్కర్‌ను అందివ్వడం జరిగింది.

టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ టూ వీలర్స్, జూపిటర్ స్కూటర్‌ను విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 1.5మిలియన్‌లకు పైగా(సుమారు 15 లక్షలు) యూనిట్ల వరకు విక్రయిచింది. ప్రస్తుతం ఇది హోండా ఆక్టివా 4జీ, మహీంద్రా గస్టో, మరియు హీరో మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది.

టీవీఎస్ జూపిటర్

బైకుల్లో శక్తివంతమైన బైకులు ఉన్నట్లు, స్కూటర్లలో కూడా పవర్ ఫుల్ స్కూటర్లను కోరుకుంటున్నారా... అయితే మీకోసం ఇండియాలో ఉన్న ఏకైక స్కూటర్ అప్రిలియా ఎస్ఆర్150. క్రింది గ్యాలరీలో ఉన్న అప్రిలియా ఎస్ఆర్150 ఫోటోలను వీక్షించండి. నచ్చితే కొనుగోలు చేయండి....

 

English summary
TVS Jupiter With BS-IV, AHO & Two New Colours Launched
Story first published: Wednesday, March 15, 2017, 16:21 [IST]
Please Wait while comments are loading...

Latest Photos