జిఎస్‌టి ఒడిదుడుకుల్లో కూడా రికార్డ్ సేల్స్ సాధించిన టీవీఎస్

Written By:

జిఎస్‌టి ఆవిష్కరణ నేపథ్యంలో జూన్ మాసం మొత్తం కార్లు మరియు ద్విచక్ర వాహన తయారీ సంస్థలకు దిన దిన గండంగా పరిణమించింది. జిఎస్‌టి అమల్లోకి రానున్న నేపథ్యంలో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో చాలా తయారీ సంస్థలకు సేల్స్ పరంగా పరాభవం ఎదురైంది. కానీ టీవీఎస్ మోటార్ కంపెనీ విషయానికి వస్తే విక్రయాల్లో మంచి వృద్దిని నమోదు చేసుకుంది.

టీవీఎస్ సేల్స్

జూన్ 2017లో 2,68,638 యూనిట్లు అమ్ముడుపోయాయి, ఇదే నెలలో క్రితం ఏడాది 2016లో 2,40,236 యూనిట్ల అమ్ముడయ్యాయి. మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ టీవీఎస్ 11.8 శాతం వృద్దిని(దేశీయ మరియు ఎగుమతులు కలుపుకొని) నమోదు చేసుకుంది. దేశీయంగా 10.4శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

టీవీఎస్ సేల్స్

గడిచిన జూన్ 2017 లో స్కూటర్ల శ్రేణిలో 90,448 యూనిట్లు అమ్ముడుపోయి 33.8శాతం వృద్ది నమోదయ్యింది. మోటార్ సైకిల్ సెగ్మెంట్లో టీవీఎస్ 17.4 శాతం వృద్ది నమోదు చేసుకుని 1,12,146 యూనిట్లను విక్రయించింది.

టీవీఎస్ సేల్స్

మొత్తం ఎగుమతుల్లో 13.3 శాతం వృద్ది నమోదు కాగా, అందులో టూ-వీలర్ల ఎగుమతులు 20.8 శాతం పెరిగాయి. టీవీఎస్ త్రీ-వీలర్స్ గత జూన్ 2016 లో 7,128 యూనిట్లు అమ్ముడుపోగా, జూన్ 2017లో 5,152 యూనిట్లు అమ్ముడయ్యాయి.

టీవీఎస్ సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానం GST అమలు నేపథ్యంలో కొన్ని వాహన తయారీ సంస్థలు జూన్ 2017లో వ్యతిరేక వృద్దిని నమోదుచేసుకున్నాయి. కానీ జిఎస్‌టి ప్రతిఫలాలను ముందే కస్టమర్లకు అందిస్తూ వచ్చిన టీవీఎస్ మోటార్స్ ప్రత్యేకించి టూ వీలర్ల సెగ్మెంట్లో మంచి వృద్దిని నమోదు చేసుకుంది.

English summary
Read In Telugu: TVS Motor Company Records Positive Growth In June 2017
Story first published: Tuesday, July 4, 2017, 16:43 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark