తిరుగులేని సక్సెస్‌తో దూసుకెళుతున్న టీవీఎస్

టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయాల పరంగా ప్రతి నెలా భారీ వృద్దిని నమోదు చేసుకుంటోంది. గడిచిన ఆగష్టు 2017 లో ఏకంగా 16 శాతం వృద్దిని సాధించింది.

By Anil

పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయాల పరంగా ప్రతి నెలా భారీ వృద్దిని నమోదు చేసుకుంటోంది. గడిచిన ఆగష్టు 2017 లో ఏకంగా 16 శాతం వృద్దిని సాధించింది.

టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్

2016 ఆగష్టులో 2,74,303 యూనిట్లను విక్రయించిన టీవీఎస్ ఈ ఏడాది ఆగష్టులో 3,17,563 యూనిట్లను విక్రయించి 16 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. టీవీఎస్ ద్విచక్ర వాహన విభాగం ఆగష్టు 2017 లో 3,09,146 టూ వీలర్లను విక్రయించి 15.5 శాతం వృద్దని సాధించింది.

Recommended Video

TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్

ఎగుమతులను మినహాయించి, దేశీయ విక్రయాలు చూసుకుంటే గత ఏడాది ఇదే నెలలో 2,38,984 యూనిట్లను విక్రయించిన టీవీఎస్ ఈ ఏడాది 2,70,544 యూనిట్లను విక్రయించి13.2 శాతం వృద్ది నమోదైంది.

టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్

టీవీఎస్‌కు స్కూటర్ల సెగ్మెంట్ నుండి మంచి ఫలితాలు సాధ్యమయ్యాయి. ఆగష్టు నెల విక్రయాల్లో స్కూటర్ల సేల్స్ కీలకమయ్యాయి. 2016 ఆగష్టులో 76,572 టీవీఎస్ స్కూటర్లు అమ్ముడవ్వగా, ఆగష్టు 2017 లో ఏకంగా 1,14,354 అమ్ముడుపోయి 49.3 శాతం వృద్ది నమోదయ్యింది.

టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్

మోటార్ సైకిల్ సెగ్మెంట్లో టీవీఎస్ 1,11,927 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోల్చుకుంటే టీవీఎస్ బైకుల విక్రయాలు కూడా విపరీతంగా పెరిగాయి. దేశీయ విక్రయాలకు తోడు ఎగుమతులు కూడా బాగా పుంజుకున్నాయి.

టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్

టీవీఎస్ గత ఏడాది ఆగష్టులో 34,097 యూనిట్లను ఎగుమతి చేయగా, ఈ ఏడాది ఆగష్టులో 33.7 శాతం వృద్దిని నమోదు చేసుకుని 45,604 యూనిట్లను ఎగుమతి చేసింది. కేవలం టూ వీలర్లు మాత్రమే 38,602 యూనిట్లుగా ఉన్నట్లు టీవీఎస్ పేర్కొంది.

టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్

టీవీఎస్ త్రీ-వీలర్ సెగ్మెంట్ కూడా మెరుగైన ఫలితాలను సాధించింది. 2016 ఆగష్టులో 6,663 యూనిట్ల త్రీ వీలర్లను విక్రయించిన టీవీఎస్, 2017 ఆగష్టులో 8,417 యూనిట్లను విక్రయించింది.

టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ మోటార్ సైకిల్స్ వృద్దిలో టీవీఎస్ స్కూటర్ల విక్రయాల వాటా బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం పండుగ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ ఏడాదిలో మిగిలిన నాలుగు నెలలు మంచి ఫలితాలను సాధించిపెట్టనున్నాయి.

Most Read Articles

Read more on: #టీవీఎస్
English summary
Read In Telugu: TVS Motor Company Posts 16 Percent Growth In August 2017
Story first published: Saturday, September 2, 2017, 13:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X