సరికొత్త అప్‌డేట్‌తో విడుదలైన టీవీఎస్ స్టార్ సిటి ప్లస్‌

Written By:

టీవీఎస్ మోటార్ కంపెనీ స్టార్ సిటి ప్లస్ బైకును సరికొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ మరియు అధునాతన గ్రాఫిక్ స్టైల్లో విడుదల చేసింది. న్యూ వేరియంట్ స్టార్ సిటి ప్లస్ బైకు ప్రారంభ ధర రూ. 50,534 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

కొత్త వేరియంట్లో టీవీఎస్ స్టార్ సిటి ప్లస్‌ విడుదల

టీవీఎస్ స్టార్ సిటి ప్లస్ వేరియంట్లో సరికొత్త బ్లాక్ మరియు రెడ్ కలర్ కాంబినేషన్‌తో పాటు నూతన బాడీ గ్రాఫిక్స్‌ కలదు. పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో టీవీఎస్ ఈ అప్‌డేటెడ్ స్టార్ సిటి ప్లస్ బైకును లాంచ్ చేసింది.

Recommended Video - Watch Now!
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
కొత్త వేరియంట్లో టీవీఎస్ స్టార్ సిటి ప్లస్‌ విడుదల

రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే వ్యత్యాసం కనబడేందుకు న్యూ వేరియంట్ స్టార్ సిటి ప్లస్ బైకులో డ్యూయల్ టోన్ కలర్స్, 3డీ క్రోమ్ లేబుల్, బ్లాక్ కలర్‌లో ఉన్న గ్రాబ్ రెయిల్ మరియు ఇతర కాస్మొటిక్ మార్పులు చోటు చేసుకున్నాయి.

కొత్త వేరియంట్లో టీవీఎస్ స్టార్ సిటి ప్లస్‌ విడుదల

సాంకేతికంగా స్టార్ సిటి ప్లస్‌లో 110సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎకోథ్రస్ట్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 8.3బిహెచ్‌పి పవర్ మరియు 8.7ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల దీని మైలేజ్ లీటర్‌కు 86కిలోమీటర్లుగా ఉంది.

కొత్త వేరియంట్లో టీవీఎస్ స్టార్ సిటి ప్లస్‌ విడుదల

కొత్తగా విడుదలైన టీవీఎస్ స్టార్ సిటి ప్లస్‌లో ఆటో హెడ్ ల్యాంప్ ఆన్(AHO), డిజి-అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, అడ్జెస్ట్ చేసుకునే వీలున్న రియర్ షాక్ అబ్జార్వర్, ట్యూబ్ లెస్ టైర్లు, మరియు హనీ కాంబ్ సైడ్ ప్యానెల్స్ ఇందులో ఉన్నాయి.

కొత్త వేరియంట్లో టీవీఎస్ స్టార్ సిటి ప్లస్‌ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ తమ స్టార్ సిటి ప్లస్ బైకులో డిజైన్ మరియు ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా గ్రాఫిక్స్ మరియు కొత్త డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్లో ప్రత్యేకించి పండుగ సీజన్ కోసం విడుదల చేసింది. అయితే ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే చూడటానికి ఈ కొత్త వేరియంట్ విభిన్నంగా ఉంది.

English summary
Read In Telugu: TVS Star City Plus New Dual-Tone Colour Scheme Launched In India; Priced At Rs 50,534
Story first published: Tuesday, September 5, 2017, 18:53 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark