కస్టమర్లను సంతృప్తిపరచడంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న టీవీఎస్

Written By:

ద్విచక్ర వాహన వినియోగదారులకు అధిక సంతృప్తి ఇచ్చిన తయారీ సంస్థలు మీద జెడి పవర్ చేసిన అధ్యయనంలో 2017 ఏడాదికి గాను ఇండియన్ టూ వీలర్ కస్టమర్ సర్వీస్ ఇండెక్స్‌ నివేదికలో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ వివరాలను వెల్లడించింది.

వినియోగదారులకు అధిక సంతృప్తినిచ్చిన టూ వీలర్ల తయారీ సంస్థ

విక్రయాల తరువాత వినియోగదారులకు సర్వీస్ పరంగా అధిక సంతృప్తిని ఇచ్చిన టూ వీలర్ల తయారీ సంస్థగా మొదటి స్థానానికి టీవీఎస్ టూ వీలర్స్ ఎంపికైంది.

వినియోగదారులకు అధిక సంతృప్తినిచ్చిన టూ వీలర్ల తయారీ సంస్థ

అధ్యయనంలోని ఫలితాల ప్రకారం, వినియోగదారులకు అధిక సంతృప్తినిచ్చిన సంస్థగా 782 పాయింట్ల స్కోర్‌తో దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ తొలిస్థానంలో నిలిచింది.

వినియోగదారులకు అధిక సంతృప్తినిచ్చిన టూ వీలర్ల తయారీ సంస్థ

749 పాయింట్ల స్కోర్‌తో జపాన్ దిగ్గజం హోండా స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్ సంస్థ రెండవ స్థానంలో నిలిచింది. వినియోగదారుల సంతృప్తి పరంగా సగటు స్కోర్ 746 పాయింట్లు నమోదయ్యాయి.

వినియోగదారులకు అధిక సంతృప్తినిచ్చిన టూ వీలర్ల తయారీ సంస్థ

టూ వీలర్లను కొనుగోలు చేసిన తరువాత సర్వీసింగ్ పరంగా కస్టమర్ల అనుభవాన్ని ఇందులో అధ్యయనం చేశారు. టూ వీలర్ యొక్క మొదటి యజమాని 12 నుండి 24 నెలల మధ్య కాలంలో సర్వీసింగ్‌కు వచ్చినపుడు సర్వే నిర్వహించారు.

వినియోగదారులకు అధిక సంతృప్తినిచ్చిన టూ వీలర్ల తయారీ సంస్థ

ద్విచక్ర వాహనం పట్ల పూర్తి సంతృప్తిని ఐదు అంశాల పరంగా పర్యవేక్షించడం జరిగింది. వెహికల్ పికప్, సర్వీస్ అడ్వైజర్, సర్వీస్ యొక్క నాణ్యత, సర్వీసింగ్ సదుపాయాలు మరియు సర్వీసింగ్ పట్ల ఉన్న చొరవను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

వినియోగదారులకు అధిక సంతృప్తినిచ్చిన టూ వీలర్ల తయారీ సంస్థ

కమ్యూనికేషన్ ప్రమాణాలు మెరుగుపడటం ద్వారా వినియోగదారుల యొక్క అనుభవాన్ని తెలుసుకోవడానికి వీలైంది. అయితే ఇది సర్వీస్ పరమైన వినియోగదారుని యొక్క సంతప్తిని పెంచడమే కాకుండా, డీలర్లకు మరియు తయారీ సంస్థలకు మంచి విక్రయాలకు కారణవుతుందని జెడి పవర్ డైరక్టర్ కౌస్తవ్ రాయ్ పేర్కొన్నారు.

వినియోగదారులకు అధిక సంతృప్తినిచ్చిన టూ వీలర్ల తయారీ సంస్థ

జెడి పవర్‌లో టూ వీలర్ పరిశ్రమ అనుభవజ్ఞుడైన రజత్ అగర్వాల్ మాట్లాడుతూ, సర్వీస్ డీలర్ల వినియోగదారులకు మంచి సేవలందిస్తున్నాయి. అందులో పికప్ అండ్ డ్రాప్, అపాయింట్‌మెంట్ ద్వారా ముందస్తు షెడ్యూల్‌తో సర్వీసింగ్ నిర్వహించడం మరియు ఎక్స్‌ప్రెస్ సర్వీస్ వంటివి.

English summary
Read In Telugu To Know About TVS Tops JD Power Customer Satisfaction After Sales Service.
Story first published: Tuesday, May 2, 2017, 10:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark