టీవీఎస్ విక్టర్ ప్రీమియం ఎడిషన్ విడుదల: ధర, ఇంజన్, ప్రత్యేకతలు

Written By:

టీవీఎస్ మోటార్ కంపెనీ ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి విక్టర్ బైకును ప్రీమియం ఎడిషన్‌లో విడుదల చేసింది. టీవీఎస్ విక్టర్ ప్రీమియం ఎడిషన్ ధర రూ. 55,065 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

టీవీఎస్ విక్టర్ ప్రీమియం ఎడిషన్ విడుదల

పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో టీవీస్ మోటార్ కంపెనీ తమ విక్టర్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌ను సరికొత్త గ్రాఫిక్స్ మరియు బాడీ కలర్ రియర్ రైడర్ హ్యాండిల్‌తో ప్రీమియం ఎడిషన్‌లో అందుబాటులోకి తెచ్చింది.

Recommended Video - Watch Now!
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
టీవీఎస్ విక్టర్ ప్రీమియం ఎడిషన్ విడుదల

టీవీఎస్ విక్టర్‌లో ప్రీమియం ఫీల్ కల్పించేందుకు క్రోమ్ విరణాత్మక సైడ్ ప్యానల్స్ మరియు గోల్డ్ కలర్ గ్రాఫిక్స్ గల ఇంజన్ డీకాల్స్ ఉన్నాయి. వీటితో పాటు, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు క్రోమ్ క్రాష్ గార్డ్ ఉన్నాయి.

టీవీఎస్ విక్టర్ ప్రీమియం ఎడిషన్ విడుదల

టీవీఎస్ విక్టర్ ప్రీమియం ఎడిషన్‌లో 109.7సీసీ సామర్థ్యం గల 3-వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల ఇంజన్ 9.3బిహెచ్‌పి పవర్ మరియు 9.4ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ విక్టర్ ప్రీమియం ఎడిషన్ మైలేజ్ లీటర్‌కు 72కిమీలుగా ఉంది.

టీవీఎస్ విక్టర్ ప్రీమియం ఎడిషన్ విడుదల

సరికొత్త ప్రీమియం ఎడిషన్ విక్టర్ కేవలం డిస్క్ బ్రేక్ మరియు బ్లాక్ బాడీ కలర్ ఎల్లో గ్రాఫిక్స్‌తో మాత్రమే లభిస్తోంది. ఇతర రెగ్యులర్ విక్టర్ వేరియంట్లు ముందు వైపు డిస్క్, వెనుక వైపు డ్రమ్ బ్రేకులతో ఐదు విభిన్న రంగుల్లో లభ్యమవుతున్నాయి.

టీవీఎస్ విక్టర్ ప్రీమియం ఎడిషన్ విడుదల

కమ్యూటర్ మోటార్ సైకిల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ మాట్లాడుతూ,"టీవీఎస్ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని, కొత్త కలర్ ఆప్షన్‍‌లతో పండుగ సీజన్‌లో కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా స్పెషల్ ఎడిషన్ టూ వీలర్లను అందిస్తున్నట్లు తెలిపాడు. ఇందులో భాగంగానే సరికొత్త విక్టర్ ప్రీమియం ఎడిషన్ బైకును విడుదల చేసినట్లు చెప్పుకొచ్చాడు."

టీవీఎస్ విక్టర్ ప్రీమియం ఎడిషన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పండుగ సీజన్‌లో కస్టమర్ల కోసం విక్టర్ ప్రీమియం ఎడిషన్ బైకును టీవీఎస్ విడుదల చేసింది. విభిన్న బాడీ గ్రాఫిక్స్ మరియు కలర్ ఆప్షన్‌, అత్యుత్తమ కంఫర్ట్ మరియు శక్తివంతమైన ఇంజన్‌తో విక్టర్ ప్రీమియం ఎడిషన్ డబ్బుకు తగ్గ విలువలను కలిగి ఉంది.

English summary
Read In Telugu: TVS Victor Premium Edition launched india price details
Story first published: Friday, September 8, 2017, 12:33 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark