నూతన కలర్ ఆప్షన్లు మరియు బిఎస్-IV ఇంజన్‌తో 2017 టీవీఎస్ వీగో విడుదల

Written By:

కేంద్ర ప్రభుత్వం అన్ని ద్విచక్ర వాహనాల్లో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లనే వాడాలని తీసుకున్న నిర్ణయం మేరకు టీవీఎస్ మోటార్ కంపెనీ తమ 2017 వీగో స్కూటర్‌లో బిఎస్-V ఇంజన్‌‌ను అందించింది. దీనిని రూ. 50,434 ల ప్రారంభ ధరతో విడుదల చేసింది.

ఇందులో మెటాలిక్ ఆరేంజ్ మరియు టి-గ్రే అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్ల వద్ద విగో లోని అన్ని వేరియంట్లలో ఈ రెండు కలర్ ఆప్షన్‌లో ఎంపిక చేసుకోవచ్చు.

నూతన 2017 టీవీఎస్ వీగో లో 110సీసీ సామర్థ్యం గల బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే సివిటిఐ ఇంజన్‌ కలదు. టీవీఎస్ వీగోలో ఇప్పుడు సింక్ బ్రేకింగ్ సిస్టమ్‌ని కూడా పరిచయం చేశారు.

టీవీఎస్ మోటార్ కంపెనీ స్కూటర్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ దీని విడుదల వేదిక మీద మాట్లాడుతూ, ఎక్జ్సిక్యూటివ్ స్కూటర్ సెగ్మెంట్లో నాణ్యత పరంగా జెడి పవర్ (ఆసియా-పసిఫిక్) నిర్వహించిన సర్వేలో 2016 ఏడాదికి గాను టీవీఎస్ వీగో మొదటి స్థానంలో నిలిచింది.

టీవీఎస్ మోటార్స్ కంపెనీ టీవీఎస్ వీగో నిర్మాణంలో నాణ్యత పరంగా రాజీ లేకుండా నిర్మించినట్లు తెలిపాడు. నాణ్యతను దృష్టిలో పెట్టుకుని అభివృద్ది చేయడం, వరుసగా రెండవ సారి 2016 జెడి పవర్ నాణ్యతపరమైన సర్వేలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వీలయ్యిందని ఆయన పేర్కొన్నాడు.

వినియోగదారుని కోణం నుండి చూస్తే, ఈ స్కూటర్ భారత ప్రజానీకం చేత బాగా స్వాగతింపబడుతోంది. నూతన డిజైన్, కలర్ ఆప్షన్స్ మరియు ఫీచర్ల ద్వారా వీటీగోని కొనుగోలు చేసిన కస్టమర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆయన అనిరుధ్ చెప్పుకొచ్చాడు.

ఇందులో డ్యూయల్ టోన్ సీట్ కవర్, నూతన బాడీ కలర్స్ మీద సిల్వర్ ఓక్ ప్యానల్ మరియు యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ మాట్లాడుతూ, యువత మరియు నగరంలో ఉన్న మద్య వయస్కుల వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించామని, తద్వారా టీవీఎస్ వీగో ను ఎంచుకునే వారు కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా ఉన్నారని తెలిపింది.

సరసమైన, శక్తివంతమైన మరియు అత్యుత్తుమ ఫీచర్లున్న ఆన్ రోడ్ మరియు ఆఫ్ రోడింగ్ లక్షణాలు గల స్కూటర్ ను ఎంచుకోవాలనుకునే వారికి, దేశీయంగా ఉన్న ఎకైక మరియు అత్యుత్తమ స్కూటర్ ఆప్రిలియా ఎస్ఆర్150. కొనే ముందు ఓ సారి క్రింది గ్యాలరీలో ఉన్న ఫోటోలను వీక్షించండి.

 

English summary
2017 TVS Wego With BS-IV Engine Launched; Now Available In Two New Colours
Story first published: Tuesday, February 21, 2017, 15:13 [IST]
Please Wait while comments are loading...

Latest Photos