టీవీఎస్ వీగో రైడింగ్ ద్వారా తమిళనాడు పొంగల్ విశేషాలు

సంక్రాంతి సందర్భంగా డ్రైవ్‌స్పార్క్ బృందం టీవీఎస్ వీగో ద్వారా తమిళనాడులో పొంగల్ విశేషాలను తెలిపే అడ్వెంచర్ రైడింగ్ తొలి భాగాన్ని పూర్తి చేసింది. తెలుగు పాఠకుల కోసం ఆ వివరాలు...

By Anil

తెలుగు పాఠకులకు డ్రైవ్‌స్పార్క్ తెలుగు సంక్రాంతి శుభాకాంక్షలు....
భారత దేశ సంస్కృతిని ప్రతిభింబించే వివిధ పండుగులను టీవీఎస్ వీగో ద్వారా తెలుసుకునేందుకు డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రారంభించిన ఎక్స్‌ప్లోరింగ్ ది ఇండియన్ ఫెస్టివల్స్ ఆన్ ది టీవీఎస్ వీగో అడ్వెంచర్ రైడింగ్ ఇప్పుడు తమిళనాడును చేరింది.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విభిన్న పేర్లతో జరుపుకునే సంక్రాంతి సంభరాలను డ్రైవ్‌స్పార్క్ టీవీఎస్ వీగో ద్వారా తమిళనాడులో జరుపుకుంది. తమిళనాడు టీవీఎస్ వీగో పొంగల్ అడ్వెంచర్ రైడింగ్ విశేషాలు....

టీవీఎస్ వీగో తమిళనాడు పొంగల్ విశేషాలు

తమిళనాడులో మా బృందం టీవీఎస్ వీగో పొంగల్ అడ్వెంచర్ రైడింగ్ ను తంజావూరు నుండి ప్రారంభించింది. సంస్కృతి సాంప్రదాయాలకు, హస్తకళలకు, పురాతణ నిర్మాణాలకు పేరుగాంచిన తంజావూరు దేశానికి అన్ని పెట్టే అన్నపూర్ణ అని చెప్పవచ్చు. ఆంధ్రాలో కోస్తా జిల్లా ప్రాముఖ్యత ఎంతో, తమిళనాడులో దీని ప్రాముఖ్యత కూడా అంతే అని చెప్పవచ్చు.

టీవీఎస్ వీగో తమిళనాడు పొంగల్ విశేషాలు

పొంగల్ అడ్వెంచర్ రైడ్ రద్దీగా ఉన్న తంజావూరు వీధుల గుండా సాగింది. అత్యంత ఇరుకైన వీధుల్లో, కిక్కిరిసి ఉన్న జనసందోహంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది టీవీఎస్ వీగో. చివరికి ప్రసిద్దిగాంచిన బృహదీశ్వరార్ గుడిని చేరుకున్నాము. ప్రాంతీయంగా ఇది తంజాయ్ పెరియ కోవిల్ అని పిలవబడుతోంది.

టీవీఎస్ వీగో తమిళనాడు పొంగల్ విశేషాలు

ఈ గుడి క్రీస్తు శకం 10 వ శతాబ్దంలో ఛోళుల సామ్రాజ్యంలో నిర్మించబడింది. యునెస్కో చేత గుర్తించబడిన భారత దేశపు అతి పెద్ద దేవాలయాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ గుడికి శిఖరాగ్రంలో ఉన్న భాగాన్ని కుంబం అని సంభోదిస్తారు. ఇది సుమారుగా 80 టన్నుల బరువు ఉంటుందని అంచనా. దీనంతటి నిర్మాణ శైలి అతి ముఖ్యమైనది. అచ్చం టీవీఎస్ వీగో 110సీసీ స్కూటర్ నిర్మాణం. దీని పోటీదారులతో పోల్చుకుంటే దీని నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుంది.

టీవీఎస్ వీగో తమిళనాడు పొంగల్ విశేషాలు

బృందం ప్రయాణంలో ప్రధానంగా గుర్తించిన మరో ముఖ్యమైన అంశం వ్యవసాయం. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిది ప్రధానమైన పాత్ర. సంక్రాంతికి ముందు రోజు మనం జరుపునే పండుగ భోగి. భోగి రోజున పంట చేతికి వచ్చి భోగాన్ని పొందుతారు, దీనిని తమిళనాడులో పొంగల్ అని వ్యవహరిస్తారు. ప్రాంతాల్లో వేరయినా పిలుచుకునే పేర్లు వేరయినా... ఇది వ్యవసాయాధారిత పండుగ అని ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. సంక్రాంతి ప్రత్యేకించి రైతు కుటుంబాల్లో చాలా సందడిగా ఉంటుంది.

టీవీఎస్ వీగో తమిళనాడు పొంగల్ విశేషాలు

దేశవ్యాప్తంగా సంక్రాంతిని నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కోరోజు ఒక్కో ప్రాధాన్యతని కలిగి ఉంది. తరువాత రోజు సంభరాలకు ముందు రోజే సర్వం సిద్దం చేసుకోవడం అనవాయితీగా వస్తోంది. పొంగల్ వేడుకలకు ముందు రోజు తంజావూరులో దృశ్యం. నాలుగు రోజుల పాటు వివిధ అంశాల పరంగా పండుగ జరుపుకోవడం భారత దేశం యొక్క సాంప్రదాయాలన్ని ప్రతిభింబిస్తోందనడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.

టీవీఎస్ వీగో తమిళనాడు పొంగల్ విశేషాలు

ప్రత్యేకించి రైతు కుటుంబాలకు ఇది అత్యంత ప్రధానమైన పండుగ. మా బృందం తమ అడ్వెంచర్ రైడింగ్ లో అనేక అంశాలను గుర్తించడం జరిగింది. అందులో సాధారణమైన రైతు కుటుంబాల జీవన విధానం. చాలా నెమ్మదిగా, హడావిడి, గజిబిజీ లేని జీవితాలు వారివి. వీరిని ప్రకృతి నేస్తాలని చెప్పవచ్చుచ. వారి జీవన విధానం అంతా నగర జీవనంతో పోల్చితే చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకే కాబోలు సంక్రాంతి పర్వదినానికి రాష్ట్రాలు దాటి తమ సొంత గూటికి చేరుతుంటారు.

టీవీఎస్ వీగో తమిళనాడు పొంగల్ విశేషాలు

కనుచూపు మేర వరకు పచ్చటి పొలాలను పల్లెల్లో గుర్తించవచ్చు. వాహనాలు, వాటి కాలుష్యం, హారన్లు చేసే శబ్దం, ట్రాఫిక్ జామ్స్ వంటివి మచ్చుకైనా కనిపించవు. అయితే రైతుల రోజూ వారి జీవనంలో టీవీఎస్ నిత్యమైపోయింది. నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి టీవీఎస్ పేరుగాంచింది. అదే నిర్మాణ విలువతో టీవీఎస్ తమ 110సీసీ సామర్థ్యం ఉన్న వీగోను పరిచయం చేసింది.

టీవీఎస్ వీగో తమిళనాడు పొంగల్ విశేషాలు

ఎలాంటి రహదారులోనైనా సురక్షితమైన, సౌకర్యవంతమైన రైడింగ్ కోసం టీవీఎస్ వీగో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ కలవు. గుంతలమైన రోడ్లలో రైడింగ్ సమయంలో అత్యద్బుత నియంత్రణ కోసం సింక్ బ్రేక్ సిస్టమ్ ఇందులో పరిచయం చేయడం జరిగింది. దీని ద్వారా ముందు మరియు వెనుక వైపు చక్రాలను ఒకే సారి నియంత్రించవచ్చు.

టీవీఎస్ వీగో తమిళనాడు పొంగల్ విశేషాలు

పొలాల వెంబడి రైతుల జీవన విధాన్ని ప్రత్యక్షంగా గమనిస్తూ సాగిన టీవీఎస్ వీగో రైడింగ్ అనంతరం రైతుల కఠినమైన పనితీరుకు డ్రైవ్‌స్పార్క్ బృందం నమఃసుమాంజలి తెలిపింది.

టీవీఎస్ వీగో తమిళనాడు పొంగల్ విశేషాలు

టీవీఎస్ వీగో పొంగల్ అడ్వెంచర్ రైడింగ్ ద్వారా తమిళనాడులో రెండవ రోజు సంక్రాంతి సంభరాలతో మరో కథనం ద్వారా త్వరలో మీ ముందుకు వస్తాం. చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు...

Most Read Articles

English summary
Here #Wego: Exploring Enchanting Tamil Nadu The Day Before Pongal
Story first published: Friday, January 13, 2017, 23:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X