టీవీఎస్ స్కూటర్లలో మరో సేఫ్టీ ఫీచర్

Written By:

టూ వీలర్లలో అత్యంత కీలకమైన వ్యవస్థలలో బ్రేకింగ్ అతి ప్రధానమైనది. బ్రేకింగ్ సామర్థ్యాన్ని మరింత సురక్షితం మరియు సౌలభ్యం కల్పించేందుకు టీవీఎస్ అనేక అధ్యయనాలు చేసింది. ఇందుకోసం టీవీఎస్ ఇంజనీరింగ్ బృందంతో పాటు వినియోగదారులు అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యతను కల్పించి సింక్ బ్రేకింగ్ సిస్టమ్(SBS) ప్రాణం పోసింది.

టీవీఎస్ స్కూటర్లలో మరో సేఫ్టీ ఫీచర్

బ్రేకింగ్ టెక్నాలజీని మెరుగుపరిచేందుకు జరిగిన ఆవిష్కరణల్లో ఒకటి కాంబి బ్రేకింగ్ సిస్టమ్(CBS) అంటే ముందు లేదా వెనుక ఏ బ్రేక్ ప్రయోగించినా రెండు చక్రాలకు సమానమైన బ్రేకింగ్ ఫోర్స్ అందుతుంది.

టీవీఎస్ స్కూటర్లలో మరో సేఫ్టీ ఫీచర్

బ్రేకింగ్ ఫోర్స్ ఒకే చక్రం మీద ప్రయోగించబడం ద్వారా స్కిడ్ అవ్వడం మరియు బైకు జర్క్‌ ఇవ్వడాన్ని మనం గమనించగలం. కానీ ఈ సింక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండటం ద్వారా ఏ బ్రేకు ప్రెస్ చేసినా బ్రేకింగ్ ఫోర్స్ రెండు చక్రాలకు సమానంగా అంది బ్రేకింగ్ సిస్టమ్ మరింత మెరుగుగా ఉంటుంది.

టీవీఎస్ స్కూటర్లలో మరో సేఫ్టీ ఫీచర్

ఓ ఒక్క బ్రేక్ లివర్ ప్రెస్ చేసినా ఇందులో ఉన్న మల్టిప్లేయర్ సిస్టమ్ బ్రేకింగ్ పవర్‌ను ఇరు చక్రాలకు సమానంగా చేరవేడానికి సహాయపడుతుంది. ఈ విధానంలో ఫోర్స్ లాస్ అనేది జరగదు.

టీవీఎస్ స్కూటర్లలో మరో సేఫ్టీ ఫీచర్

టీవీఎస్ తమ స్కూటర్లలో సింక్ బ్రేకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టడం ద్వారా టైర్ల జీవిత కాలం పెరగడంతో పాటు బ్రేక్ లైనర్ల మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది పేర్కొంది. దీనిని అప్పటికే ఉన్న భద్రత ఫీచర్లకు అదనంగా జోడించింది.

టీవీఎస్ స్కూటర్లలో మరో సేఫ్టీ ఫీచర్

సింక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అనగా రెండూ ఒకటే. ఒక్క బ్రేక్ లీవర్‌ను ప్రెస్ చేస్తే ఇరు చక్రాలకు బ్రేక్ పవర్ సమానంగా చేరవేసే వ్యవస్థను కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అంటారు, కానీ టీవీఎస్ దీనిని సింక్ బ్రేకింగ్ సిస్టమ్ అని పిలుస్తోంది.

English summary
Read In Telugu TVS Updates Wego And Jupiter With Sync Braking System
Story first published: Friday, June 2, 2017, 14:49 [IST]
Please Wait while comments are loading...

Latest Photos