యుఎమ్ నుండి రెనిగేడ్ క్లాసిక్ మరియు కమాండో మొజావే ఎడిషన్ బైకులు

Written By:

అమెరికాకు చెందిన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యుఎమ్ మోటార్‌సైకిల్స్ ఇండియన్ మార్కెట్లో రెండు కొత్త క్రూయిజర్ బైకులను విడుదల చేయడానికి సిద్దమైంది.

యుఎమ్ మోటార్‌సైకిల్స్ రెనిగేడ్ క్లాసిక్ మరియు కమాండో మొజావే ఎడిషన్ క్రూయిజర్ బైకులను సెప్టెంబర్ 2, 2017 న విడుదల చేయనుంది. దేశీయంగా ఎంట్రీ లెవల్ ప్రీమియమ్ మోటార్ సైకిళ్ల మీద కంపెనీ దృష్టిసారిస్తోంది.

యుఎమ్ నుండి రెనిగేడ్ క్లాసిక్ మరియు కమాండో మొజావే

ప్రస్తుతం యుఎమ్ మోటార్‌సైకిల్స్ ఇండియా లైనప్‌లో రెనిగేడ్ కమాండో మరియు రెనిగేడ్ స్పోర్ట్స్ ఎస్ మోటార్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు విడుదలకు సిద్దమైన రెనిగేడ్ క్లాసిక్ బైకును తొలుత 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ప్రదర్శించింది.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
యుఎమ్ నుండి రెనిగేడ్ క్లాసిక్ మరియు కమాండో మొజావే

స్టాండర్డ్ ఎడిషన్ కమాండో యొక్క స్పెషల్ ఎడిషన్‌ను కమాండో మొజావే ఎడిషన్ అంటారు. ఇది మ్యాట్ డెసర్ట్ పెయింట్ స్కీమ్ మరియు లెథర్ శాడిల్ బ్యాగులను కలిగి ఉంది.

యుఎమ్ నుండి రెనిగేడ్ క్లాసిక్ మరియు కమాండో మొజావే

సాంకేతికంగా రెనిగేడ్ క్లాసిక్ మరియు కమాండో మొజావే ఎడిషన్ మోటార్ సైకిళ్లలో 279సీసీ సామర్థ్యం గల ఫ్యూయల్ ఇంజెక్టడ్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 24బిహెచ్‌పి పవర్ మరియు 23ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

యుఎమ్ నుండి రెనిగేడ్ క్లాసిక్ మరియు కమాండో మొజావే

ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రానికి సరఫరా అవుతుంది. రెండు మోటార్ సైకిళ్లను ఉత్తరాఖండ్ లోని కాశీపూర్‌లో ఉన్న లోహియా ఆటో ప్రొడక్షన్ ప్లాంటులో తయారు కానున్నాయి.

యుఎమ్ నుండి రెనిగేడ్ క్లాసిక్ మరియు కమాండో మొజావే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంట్రీ లెవల్ ప్రీమియమ్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్‌(300సీసీ రేంజ్‌లో లభించే ఖరీదైన బైకు)లో వృద్ది రోజురోజుకీ పెరుగుతోంది. దీనిని గమనించిన యుఎమ్ మోటార్ సైకిల్స్ ఇప్పుడు ఈ సెగ్మెంట్లో వీలైనన్ని ఎక్కువ మోడళ్లను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తోంది. ఈ రెండు కొత్త మోడళ్లు విడుదలైతే, యుఎమ్ మోటార్‌సైకిల్స్ లైనప్‌లో లభించే బైకుల సంఖ్య నాలుగుకు చేరనుంది.

English summary
Read In Telugu: UM Renegade Classic And Commando Mojave Edition India Launch Details Revealed
Story first published: Thursday, August 10, 2017, 10:31 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark