విడుదల కోసం ఎదురుచూస్తున్న ఐదు బైకులు మరియు స్కూటర్లు

Written By:

భారతీయ వాహన పరిశ్రమలో ద్విచక్ర వాహన మార్కెట్ వాటానే అధికం. అధిక సంఖ్యలో విక్రయాలు జరపడంలో కూడా దేశీయ టూ వీలర్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా ముందజలో ఉందనే చెప్పాలి. ఆటోమేటిక్ స్కూటర్లయినా లేదంటే కమ్యూటర్ బైకులయినా వాటి విలువ వాటికి ఉంది. అందుకే లక్షల రుపాయల బడ్జెట్లో ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్దంగా ఉన్న ఐదు స్కూటర్లు మరియు బైకులు గురించి....

హీరో గ్లామర్

హీరో గ్లామర్

హీరో మోటోకార్ప్ 2017 కోసం కొన్ని ఆశ్చర్యకరమైన మోడళ్లను సిద్దం చేసింది. అందులో ఒకటి సరికొత్త గ్లామర్. 2017 ప్రారంభంలో అర్జెంటీనాలో జరిగిన డకార్ ర్యాలీ సందర్భంగా అధునాతన గ్లామర్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 50కి పైగా దేశాల్లో హీరో మోటోకార్ప్ కలదు. వీటిలో చాలా మార్కెట్లలో గ్లామర్‌కు ప్రత్యేకమైన డిమాండ్ కలదు.

విడుదలకు సిద్దమైన ఐదు బైకులు మరియు స్కూటర్లు

రాజస్థాన్ జైపూర్‌లోని హీరో యొక్క సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ బృందం అభివృద్ది చేసిన మూడవ ఉత్పత్తి ఈ సరికొత్త గ్లామర్. హీరో మోటోకార్ప్ ఇందులో నూతన 124.7సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ అందివ్వడం జరిగింది.

విడుదలకు సిద్దమైన ఐదు బైకులు మరియు స్కూటర్లు

ఇది 11.25బిహెచ్‌పి పవర్ మరియు 11ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. హీరో ఇందులో కార్బోరేటర్ మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ వెర్షన్‌లను అందుబాటులో ఉంచనుంది. అంతే కాకుండా ఇందులో హీరో యొక్క ఐ3ఎస్ టెక్నాలజీ రానుంది. హీరో మోటోకార్ప్ సరికొత్త గ్లామర్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌ను రూ. 65,000 ల ప్రారంభ ఎక్స్-రూమ్ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్

ప్రస్తుతం టీవీఎస్ ఇండియా లైనప్‌లో స్కూటర్లు మరియు బైకుల శ్రేణిలో ఒక్క 125సీసీ వేరియంట్ కూడా లేదు. అయిచే గతంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఎన్‍‌టార్క్ అనే 125సీసీ సామర్థ్యం ఉన్న స్కూటర్‌ను ఆవిష్కరించింది.

విడుదలకు సిద్దమైన ఐదు బైకులు మరియు స్కూటర్లు

టీవీఎస్ స్కూటర్ లైనప్‌లో అత్యంత శక్తివంతమైన స్కూటర్ జూపిటర్ 110సీసీ. ఇప్పుడు స్కూటర్ల అమ్మకాల్లో హోండా యాక్టివా తరువాత స్థానంలో జూపిటర్ కలదు, మరియు భారత దేశపు మూడవ అతి పెద్ద స్కూటర్ల తయారీ సంస్థల్లో హోండా మరియు హీరో తరువాత టీవీఎస్ నిలిచింది.

విడుదలకు సిద్దమైన ఐదు బైకులు మరియు స్కూటర్లు

125సీసీ సెగ్మెంట్లో ఉన్న సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌కు గట్టి పోటీనివ్వనున్న ఈ ప్రీమియమ్ స్కూటర్ జూపిటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 49,000 ల కన్నా రూ 10 వేలు ఎక్కువ ధరతో వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో డిస్క్ బ్రేకులు, యుఎస్‌బి ఛార్జింగ్ మరియు పాస్ స్విచ్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా రానున్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీ 200ఎస్ వేరియంట్ మీద చాలా కాలం నుండే పనిచేస్తోంది. నూతన శైలిలో అభివృద్ది చేసిన సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించారు. హీరో దీని ప్రేరణతో భవిష్యత్తు యొక్క అనేక కొత్త మోడళ్ల ఆవిష్కరణకు సిద్దం అవుతోంది.

విడుదలకు సిద్దమైన ఐదు బైకులు మరియు స్కూటర్లు

హీరో ఈ ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మోటార్ సైకిల్‌లో 200సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ అందివ్వనుంది. ఇది గరిష్టంగా 18.34బిహెచ్‌పి పవర్ మరియు 17.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

విడుదలకు సిద్దమైన ఐదు బైకులు మరియు స్కూటర్లు

ప్రస్తుతం ఉన్న అపాచే ఆర్‌టిఆర్ 200 మరియు బజాజ్ ఎన్ఎస్200 లకు పోటీగా అభివృద్ది చేస్తున్న ఇందులో డిజిటల్ అనలాగ్ కన్సోల్, ఎల్ఇడి టెయిల్ లైట్లు, రెగ్యులర్ హ్యాలోజియన్ లైట్లు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేకులు మరియు డ్యూయల్ టోన్ సీట్ వంటి ఫీచర్లను అందించే అవకాశం ఉంది. దీనిని సుమారుగా రూ లక్ష రుపాయల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

అప్రిలియా ఎస్ఆర్125

అప్రిలియా ఎస్ఆర్125

అప్రిలియా మొదటి సారిగా ఎస్ఆర్150 వేరియంట్‌ను గత ఏడాది విపణిలోకి విడుదల చేసింది. ప్రీమియమ్ స్కూటర్ సెగ్మెంట్లోకి రూ. 65,000 ల ప్రారంభ ధరతో విడుదలైన ఇది భారీ విక్రయాలు చేపట్టింది. అమ్మకాలు దృష్ట్యా మంచి ఫలితాలను కనబరుస్తున్న నేపథ్యంలో అప్రిలియా తమ ఎస్ఆర్ శ్రేణిలో 125సీసీ సామర్థ్యం ఉన్న స్కూటర్ విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది.

విడుదలకు సిద్దమైన ఐదు బైకులు మరియు స్కూటర్లు

అప్రిలియా మొదటి సారిగా ఎస్ఆర్150 వేరియంట్‌ను గత ఏడాది విపణిలోకి విడుదల చేసింది. ప్రీమియమ్ స్కూటర్ సెగ్మెంట్లోకి రూ. 65,000 ల ప్రారంభ ధరతో విడుదలైన ఇది భారీ విక్రయాలు చేపట్టింది. అమ్మకాలు దృష్ట్యా మంచి ఫలితాలను కనబరుస్తున్న నేపథ్యంలో అప్రిలియా తమ ఎస్ఆర్ శ్రేణిలో 125సీసీ సామర్థ్యం ఉన్న స్కూటర్ విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది.

విడుదలకు సిద్దమైన ఐదు బైకులు మరియు స్కూటర్లు

అప్రిలియా అంతర్జాతీయ విపణిలో ఎస్ఆర్ మోటార్డ్ 125 స్కూటర్ కలదు. ఇందులోని శక్తివంతమైన 124సీసీ సామర్థ్యం గల ఇంజన్ గరిష్టంగా 9.5బిహెచ్‌పి పవర్ మరియు 8.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీని విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే గతంలో ఈ వేరియంట్ డీలర్ల వద్ద కనిపించింది.

టార్క్ టి6ఎక్స్

టార్క్ టి6ఎక్స్

భారత దేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ టి6ఎక్స్. టార్క్ మోటార్ సైకిల్స్ అభివృద్ది చేసిన దీనిని 2017 తొలిసగంలోనే విపణిలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సుమారుగా 8బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న 6కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఇందులో కలదు.

విడుదలకు సిద్దమైన ఐదు బైకులు మరియు స్కూటర్లు

టార్క్ టి6ఎక్స్ లో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు న్యావిగేషన్ ఫీచర్ కలదు, ఈ మోటార్ సైకిల్ ఒక్క సారి చార్జింగ్ ద్వారా గరిష్టంగా 500కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చు. దీని గురించి టార్క్ ప్రతినిధులు మాట్లాడుతూ, దీని పనితనం ఒక 200సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ మోటార్ సైకిల్‌కు సమానం అని పేర్కొన్నారు.

విడుదలకు సిద్దమైన ఐదు బైకులు మరియు స్కూటర్లు

ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల కొనుగోలు మరియు అమ్మకాలు అభివృద్ది కోసం భారత ప్రభుత్వానికి చెందిన ఫేమ్ ఇలాంటి వాహనాలపై సబ్సిడీ స్కీమ్ అందిస్తోంది. గంటలోపే 80 శాతం చార్జింగ్ చేసుకునే సామర్థ్యం దీనికి ఉంది, టార్క్ ప్రతినిధులు దీనిని రూ. 1,25,000 లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

 
English summary
Upcoming Bikes And Scooters
Please Wait while comments are loading...

Latest Photos