అప్‌డేటెడ్ అప్రిలియా ఎస్ఆర్ 150 విడుదల ఖరారు

Written By:

ఇండియన్ స్కూటర్ల సెగ్మెంట్లో అత్యంత శక్తివంతమైన స్కూటర్‌గా పేరుగాంచిన అప్రిలియా ఎస్ఆర్ 150 స్కూటర్ అడ్జెస్టబుల్ ఫ్రంట్ ఫోర్క్ జోడింపుతో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా విపణిలోకి విడుదల కానుంది.

అప్రిలియా ఎస్ఆర్ 150

ఇటాలియన్ టూ వీలర్ల దిగ్గజం అప్రిలియా తొలిసారి 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ప్రదర్శించినప్పుడు సందర్శకుల నుండి దీనికి మంచి స్పందన లభించింది. ఆ తరువాత అప్రిలియా ఎస్ఆర్ 150 ధరను రూ. 65,000 లు ఎక్స్-షోరూమ్‌గా ప్రకటించడంతో స్కూటర్లను ఎంచుకునే కస్టమర్లు దీని విడుదల కోసం ఆతృతతో ఎదురు చూశారు.

Recommended Video - Watch Now!
Honda Cliq Review In Telugu - DriveSpark తెలుగు
అప్రిలియా ఎస్ఆర్ 150

సులభమైన రైడింగ్ సౌలభ్యం మరియు అత్యుత్తమ పవర్ ఇచ్చే స్కూటర్లలో అప్రిలియా ఎస్ఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. స్కూటర్ పర్ఫామెన్స్ మరియు హ్యాండ్లింగ్ విషయంలో అప్రిలియా ఎస్ఆర్ 150 మంచి మార్కులే పొందింది.

అప్రిలియా ఎస్ఆర్ 150

అయితే, అప్రిలియా ఎస్ఆర్ 150 స్కూటర్‌లోని సస్పెన్షన్ సిస్టమ్ చాలా గట్టిగా ఉన్నట్లు గుర్తించింది. ఫిర్యాదుగా స్వీకరించిన అప్రిలియా తమ స్కూటర్‌లో ముందు వైపున అడ్జెస్టబుల్ ఫ్రంట్ ఫోర్క్స్ అందివ్వడానికి సిద్దమైంది.

అప్రిలియా ఎస్ఆర్ 150

సస్పెన్షన్ అప్‍‌గ్రేడ్‌తో వస్తోన్న అప్రిలియా ఎస్ఆర్ డిసెంబర్ 2017 లో విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న అప్రిలియా ఎస్ఆర్ 150తో పోల్చితే అప్‌గ్రేడెడ్ వర్షన్ స్కూటర్ ధర రూ. 5,000 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది.

అప్రిలియా ఎస్ఆర్ 150

అప్రిలియా ఎస్ఆర్ 150 లోని రేస్ ఎడిషన్‌లో అడ్జెస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్ సిస్టమ్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందివ్వనుంది. అడ్జెస్టు చేసుకునే వీలున్న ఫ్రంట్ ఫోర్క్స్ మినహాయిస్తే, సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

అప్రిలియా ఎస్ఆర్ 150

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అద్బుతమైన పనితీరు, డిజైన్ మరియు వాస్తవికత విషయంలో అప్రిలియా ఎస్ఆర్ 150 స్కూటర్‌కు ఇండియన్ స్కూటర్ మార్కెట్లో ఉన్న మరే ఇతర మోడల్ పోటీనివ్వలేదు. అయితే సామాన్య కొనుగోలుదారునికి ఇదొక ఖరీదైన స్కూటర్‌గా మిగిలిపోయింది. అయితే అడ్జెస్టబుల్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ జోడింపుతో వీటి విక్రయాలు భారీగా పెరగనున్నాయి.

English summary
Read In Telugu; Updated Aprilia SR 150 To Be Sold In India By December 2017
Story first published: Monday, August 21, 2017, 10:22 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark