భారత దేశపు 12 లక్షల ఖరీదైన స్కూటర్‌‌కు వీడ్కోలు పలికిన పియాజియో

Written By:

పియాజియో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన తమ వెస్పా 946 ఎంపోరియో అర్మానీ స్కూటర్‌ను మార్కెట్ నుండి తొలగించింది. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ పేరుతో నవంబర్ 2016 లో సుమారుగా రూ. 12 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది.

పియాజియో వెస్పా 946 ఎంపోరియో అర్మానీ స్కూటర్

పియాజియో సంస్థ దిగ్గజ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ భాగస్వామ్యంతో వెస్పా 946 ఎంపోరియో అర్మానీ స్కూటర్‌ను తయారు చేసింది. భారీ ధరతో విడుదలైన ఈ స్కూటర్ మీద ఇప్పటికీ ఆశించిన ఫలితాలు లభించలేదు.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
పియాజియో వెస్పా 946 ఎంపోరియో అర్మానీ స్కూటర్

పియాజియో ఈ స్కూటర్‌ను విపణిలోకి విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్క స్కూటర్‌ను కూడా విక్రయించలేదు. అయితే దీనిని ఉన్నఫలంగా మార్కెట్ నుండి తొలగించడానికి గల కారణం, పియాజియో మరియు అర్మానీ మధ్య ఉన్న భాగస్వామ్యపు ఒప్పందం ముగిసిందని, అందుకే తొలగించినట్లు పియాజియో ఓ ప్రకటనలో వెల్లడించింది.

పియాజియో వెస్పా 946 ఎంపోరియో అర్మానీ స్కూటర్

పియాజియో 946 ఎంపోరియో అర్మానీ స్కూటర్‌ను క్లాసిక్ మరియు రెట్రో డిజైన్ స్టైల్లో ఆధునిక టెక్నాలజీని జోడించి అభివృద్ది చేశారు. ఇందులో ప్రీమియమ్ లెథర్ కవర్ గల ఫ్లోటింగ్ సీట్ మెకానిజమ్, మ్యాట్ బ్లాక్ పెయింట్ స్కీమ్, క్లాసిక్ వీల్ రిమ్ములు, రెట్రో స్టైల్ స్టోరేజ్ వంటి విభిన్న ఫీచర్లున్నాయి.

పియాజియో వెస్పా 946 ఎంపోరియో అర్మానీ స్కూటర్

ఎల్ఇడి హెడ్ ల్యాంప మరియు టెయిల్ ల్యాంప్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డిస్క్ బ్రేకులు ఉన్నాయి. 12 లక్షల విలువైన ఈ స్కూటర్‌లో కేవలం 125సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజన్ మాత్రమే ఉంది. ఇది గరిష్టంగా 11బిహెచ్‌పి పవర్ మరియు 10.3ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

పియాజియో వెస్పా 946 ఎంపోరియో అర్మానీ స్కూటర్

వెస్పా 946 ఎంపోరియో అర్మానీ స్కూటర్‌లో భద్రత పరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అవి, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యాంటి స్లిప్ రెగ్యులేటర్ మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. దీనిని పూర్తి స్థాయిలో బిల్ట్ చేసిన ప్రొడక్ట్‌గా దిగుమతి చేసుకోవడంతో ధర భారీగా పెరిగిపోయింది.

పియాజియో వెస్పా 946 ఎంపోరియో అర్మానీ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పియాజియో ఇండియా లైనప్‌లో అత్యంత అరుదైన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా వెస్పా 946 ఎంపోరియో అర్మానీ స్కూటర్‌ను పరిచయం చేసింది. అయితే భారీ ధర కారణంగా ఇండియన్ కస్టమర్లను చేరువకాలేకపోవడంతో, విడుదలైన కొన్ని నెలలకే మార్కెట్ నుండి వైదొలగింది.

English summary
Read In Telugu: Vespa 946 Emporio Armani Discontinued In India
Story first published: Friday, September 1, 2017, 18:18 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark