రూ. 95,077 ల ప్రారంభ ధరతో వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ విడుదల

Written By:

ప్రీమియమ్ స్కూటర్ల సెగ్మెంట్లో రాజ్యమేలుతున్న వెస్పా ఎలిగెంట్ స్కూటర్ స్పెషల్ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది. పియాజియో సంస్థ ఈ వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చిన ఇందులో నూతన ఫీచర్లు మరియు అదే శక్తివంతమైన 150సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు.

వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ విడుదల

95,077 రుపాయల ధరతో విడుదలైన ఈ స్కూటర్‌ను ఇదే ధరకు కొనలేరు. ఎందుకంటే ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఆర్‌టిఓ మరియు ఇన్సూరెన్స్ కలుపుకుంటే దీని ధర లక్షకు పైగా ఉండనుంది. ఈ స్కూటర్ మీద ఇటాలియన్‌కు చెందిన క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ రూపొందించిన సొబగులను అందించినట్లు పియాజియో పేర్కొంది.

వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ విడుదల

స్పెషల్ ఎడిషన్ వెస్పా ఎలిగెంట్ స్కూటర్‍‌ను రెండు కొత్త రంగుల్లో ఎంపిక చేసుకోవచ్చు. అవి, బీజి యునికో మరియు పర్ల్ వైట్. ముందు వైపు టింటెడ్ విండ్ స్క్రీన్ మరియు ఎలిగెంట్ బ్యాడ్జింగ్ మరియు బాడీ కలర్‌కు సమన్వయంగా ఉండే లెథర్ సీట్ అందివ్వడం జరిగింది.

వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ విడుదల

స్పెషల్ ఎడిషన్ ఎలిగెంట్ స్కూటర్‌లో ప్రత్యేకించి స్కూటర్ కలర్‌లో ఉన్న హెల్మెట్, క్రోమ్ గార్డ్ కిట్, ప్రంట్ బంపర్ గార్డ్ కలవు. మరియు ఇందులో రెండు వైపులా 12-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ విడుదల

పియాజియో ఈ శక్తివంతమైన వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌లో 150సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ అందించింది. ఇది గరిష్టంగా 11.4బిహెచ్‌పి పవర్ మరియు 11.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ విడుదల

ఇండియన్ మార్కెట్లోని ప్రీమియమ్ స్కూటర్ సెగ్మెంట్లో వెస్పా ఎలిగెంట్ అద్బుతమైన విజయం సాధించిన నేపథ్యంలో, పియాజియో ఈ వెస్పా ఎలిగెంట్ స్కూటర్‌ను స్పెషల్ ఎడిషన్ రూపంలో విపణిలోకి విడుదల చేసినట్లు పియాజియో వెహికల్స్ ఇండియా సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్ స్టెఫానో పెల్లే తెలిపాడు.

వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ విడుదల

వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న వెస్పా మరియు అప్రిలియా డీలర్ల వద్ద అదే విధంగా మోటోప్లెక్స్ విక్రయ కేంద్రాలలో కొనుగులో చేయవచ్చు. మరియు పేటిఎమ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

English summary
Read In Telugu Vespa Elegante Special Edition Launched In India
Story first published: Monday, May 15, 2017, 13:11 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark