TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
వెస్పా రెడ్ స్కూటర్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు...
పియాజియో ఇండియా విపణిలోకి సరికొత్త వెస్పా రెడ్ స్కూటర్‌ను విడుదల చేసింది. వెస్పా రెడ్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 87,009 లు ఎక్స్-షోరూమ్(ముంబాయ్)గా ఉన్నట్లు పియాజియో ప్రతినిధులు పేర్కొన్నారు.
పియాజియో తమ వెస్పా రెడ్ స్కూటర్‌ను రెడ్(RED) స్వచ్ఛంద సంస్థ సహకారంతో రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ గురించి అవగాహన తీసుకొచ్చేందుకు, ఎయిడ్స్ బాధితులను ఆదుకునేందుకు మరియు ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా "రెడ్" స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది.
ప్రస్తుతం దేశీయ విపణిలో వెస్పా రెడ్ స్కూటర్ పూర్తి స్థాయిలో విడుదలైంది. వెస్పా విక్రయించే ఈ ప్రతి స్కూటర్ మీద 50 అమెరికన్ డాలర్ల(సుమారుగా 3,277 రుపాయలు) నిధిని ఇండియాలో ఎయిడ్స్ మీద వ్యతిరేకంగా పోరాడుతున్న రెడ్ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థకు అందిస్తోంది.


వెస్పా రెడ్ లోని పేరు ఆధారంగానే వెస్పా స్కూటర్ మొత్తాన్ని రెడ్ పెయింట్ స్కీములో అందివ్వడం జరిగింది. రెడ్ కలర్ బాడీ, రెడ్ సీట్, రెడ్ ప్లాస్టిక్ ప్యానెల్స్ మరియు రెడ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్కూటర్ ఫ్రంట్ డిజైన్‌లో క్రోమ్ సొబగులున్నాయి. ఎక్ట్సీరియర్ మీద జరిగిన కాస్మొటిక్ మెరుగులు మినహాయిస్తే సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు.
సాంకేతికంగా పియాజియో వెస్పా రెడ్ స్కూటర్‌లో 125సీసీ సామర్థ్యం గల గాలిచో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 10బిహెచ్‌పి పవర్ మరియు 10.6ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
వెస్పా స్కూటర్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ప్రేరిత సింగల్ సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు. రెండు వైపులా 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ వీల్‌కు 220ఎమ్ఎమ్ చుట్టుకొలత గల సింగల్ డిస్క్ బ్రేక్ కలదు.
వెస్పా రెడ్ స్కూటర్‌ను మోనోకోక్యూ సింగల్ పీస్ స్టీల్ బాడీ ఆధారంగా నిర్మించబడింది మరియు ఇది కేవలం అధిక గాఢత గల ఎరుపు రంగు పెయింట్ స్కీములో మాత్రమే లభిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ గల హెల్మెట్, టీ షర్ట్ మరియు టోపీ లను కూడా అందిస్తోంది.
పియాజియో గ్లోబల్ సిఇఒ మరియు మేనేజింగ్ డైరక్టర్ డీగో గాఫీ మాట్లాడుతూ," భారత విపణిలోకి వెస్పా రెడ్ స్కూటర్‌ను విడుదల చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఇకానిక్ వెస్పా బ్రాండ్‌ను సామాజిక బాధ్యతో ఎయిడ్స్ బాధితులకు నిధులను సేకరించడం కోసం ప్రత్యేక ఎడిషన్‌లో వెస్పా రెడ్ పేరుతో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నాడు."
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
గొప్ప కారణం కోసం పియాజియో వెస్పా రెడ్ స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. విక్రయించే ప్రతి స్కూటర్ నుండి వచ్చేదానిలో కొంత మొత్తాన్ని గ్లోబల్ ఫండ్ రూపంలో దేశీయంగా ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా పోరాడే స్వచ్ఛంద సంస్థకు పియాజియో విరాళమివ్వనుంది. ఇప్పటికే పియాజియో వద్ద ఉన్న వెస్పా స్కూటర్‌ను పూర్తి స్థాయి రెడ్ పెయింట్ స్కీములో అందిస్తోంది.