కెటిఎమ్ 390 మరియు యమహా ఆర్3ల మధ్య రేస్: గుండెజారి చేతిలోకొస్తుంది!

Written By:

కొత్త జనరేషన్ కెటిఎమ్ డ్యూక్ 390 తో యమహా ఆర్3 రేసింగ్‌కు దిగితే... అది రేస్ ఎలాంటి ఉంటుందో అని మనలో కలగే ఉత్కంఠ అంతా ఇంత కాదు. నిజమే మన తెలుగు కుర్రాళ్లు కొత్త డ్యూక్ 390 మరియు యమహా ఆర్3 బైకుల మధ్య రేస్ నిర్వహించారు. మరి ఇందులో ఏది గెలిచింది.... మరియు రెండు బైకుల శక్తిసామర్థ్యాలను ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

కెటిఎమ్ 390 గురించి ప్రస్తావిస్తే, బైకు మొత్తం బరువు నిష్పత్తికి తగిన పవర్ ఉత్పత్తి చేసే విధంగా రూపొందించారు. టార్క్ విషయానికి వస్తే యమహా ఆర్3 దీని విషయంలో వెనకబడిపోతుంది.

సాంకేతకంగా చూస్తే, కెటిఎమ్ డ్యూక్ 390లో 373సీసీ సామర్థ్యం ఉన్న లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 43బిహెచ్‌పి పవర్ మరియు 37ఎన్ఎమ్ టార్క్ వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

డిజైన్ పరంగా కెటిఎమ్ 390 నేక్‌డ్ వర్గానికి చెందితే, ఆర్3 ఫుల్లీ ఫెయిర్డ్ వర్గానికి చెందింది. యమహా ఆర్‌3లో చక్కటి ఏరోడైనమిక్ డిజైన్ కలదు. అయితే డ్యూక్ 390 గాలితో జరిగే ఘర్షణను అధిగమిస్తూ దూసుకెళ్తుంది.

యమహా ఆర్3 లో సాంకేతికంగా 321సీసీ సామర్థ్యం గల లిక్విడ్‌తో చల్లబడే ప్యార్లల్ ట్విన్ పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 41బిహెచ్‌పి పవర్ మరియు 29.6ఎన్ఎమ్ టార్క్ వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

రెండు బైకులను బరువుగా చూస్తే, ఆర్3 బరువు 169కిలోల అయితే కెటిఎమ్ డ్యూక్ 390 బరువు 163 కిలోలుగా ఉంది. అయితే బరువుకు తగ్గ పవర్ కెటిఎమ్ డ్యూక్ 390 ఉత్పత్తి చేస్తే, ఆర్3 ఇందులో వెనక్కి తగ్గింది.

మరి రేసింగ్ సమయంలో ఏది నెగ్గిందో... ఏది తగ్గిందో... మన తెలుగు వ్యక్తి వికాస్ రాచమల్ల తీసిన వీడియో ద్వారా మీరే కనుక్కోండి...

అత్యాధునిక సాంకేతికత వినియోగంలో మరియు ప్రొఫెషనల్ రేసింగ్ విషయానికి వస్తే యమహా ఎల్లప్పుడూ ముందు స్థానంలోనే ఉంటుంది. యమహా ఆర్ సిరీస్‌లోని మిగతా ఉత్పత్తులతో పోల్చితే రిలాక్స్ రైడింగ్ పొజిషన్ ఆర్‌3లో ఉంది.

English summary
Read In Telugu New KTM Duke 390 Vs. Yamaha R3 And Watch Video
Story first published: Wednesday, May 10, 2017, 11:42 [IST]
Please Wait while comments are loading...

Latest Photos