విడుదలకు సిద్దమైన యమహా ఫేజర్ 250: రహస్య ఫోటోలు

Written By:

యమహా ఇండియా దేశీయంగా ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లోకి స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్‌ ఎఫ్‌జడ్25 ను విడుదల చేసింది. ఇదే వేదిక మీద యమహా తమ నెక్ట్స్ ప్రొడక్ట్ ఫేజర్ 250 ను విడుదల చేయనుందనే సూచనలు చేసింది. ఎఫ్‌జడ్25 ఆధారంతో నిర్మితమవుతున్న ఈ ఫేజర్‌250 బైకును 2017 చివరి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది.

యమహా ఫేజర్ 250

ఇండియన్ ఆటోస్‌బ్లాగ్ నూతన ఫేజర్ 250 మోటార్ సైకిల్‌కు చెందిన కొన్ని రహస్యమైన ఫోటోలను విడుదల చేసింది. అయితే ఇది యమహా యొక్క తరువాత టూరింగ్ మోటార్ సైకిల్ అని ఇండియన్ ఆటోస్‌బ్లాగ్ పేర్కొంది.

యమహా ఫేజర్ 250

ఇందులో రెండు హెడ్‌లైట్లు, ర్యామ్ ఎయిర్ ఇంటేకర్, మరియు టూరింగ్ విండ్‌షీల్డ్ తో పాటు సరికొత్త డిజైన్‌లో ఉన్న మిర్రర్లను అందిస్తోంది.

యమహా ఫేజర్ 250

ట్రావెలర్స్ కోసం ఇందులో అదనంగా పొడగించిన లగేజ్ ర్యాక్ అందించారు. ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు. రెండు చక్రాలకు కూడా డిస్క్ బ్రేకుల అందివ్వడం జరిగింది.

యమహా ఫేజర్ 250

అప్‌కమింగ్ టూరింగ్ మోటార్ సైకిల్‌ పూర్తిగా డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ జోడింపుతో రానుంది. మరియు కండలు తిరిగిన శరీరాకృతిని కలిగి ఉండే రూపాన్ని సంతరించుకోనుంది.

యమహా ఫేజర్ 250

సాంకేతికంగా ఫేజర్‌ 250 లో 249సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఈ ఎస్ఒహెచ్‌సి రెండు వాల్వ్‌ల ఇంజన్ 20.5బిహెచ్‌పి పవర్ మరియు 20ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.

యమహా ఫేజర్ 250

ఇది ఒక్కసారి ఇండియన్ మార్కెట్లోకి విడుదలయితే హోండా సిబిఆర్250ఆర్ మరియు బెనెల్లీ టిఎన్‌టి250 వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది. ఇది సుమారుగా 1.3 లక్షల ప్రారంభ ధరతో ఎక్స్ షోరూమ్ ధరగా విడుదలయ్యే అవకాశం ఉంది.

 
Read more on: #యమహా #yamaha
English summary
Yamaha Fazer 250 Render Images; Launch Imminent
Story first published: Tuesday, February 7, 2017, 23:02 [IST]
Please Wait while comments are loading...

Latest Photos