140 కిమీల వేగంతో వెళుతున్న బైకు ముందుకు అడ్డొచ్చిన వ్యక్తి.... ఇద్దరి ప్రాణాలు కాపాడిన ఏబిఎస్!!

Written By:

అత్యధిక వేగంతో వెళుతున్న బైకు ముందుకు ఉన్నట్లుండి ఓ వ్యక్తి అడ్డొచ్చాడు. లక్కీగా ఆ బైకులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండటంతో రైడర్ మరియు అడ్డొచ్చిన వ్యక్తి ఇద్దరూ పెద్ద అపాయం నుండి తప్పించుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చల్‌చల్ చేస్తోంది.

వీడియో మరియు యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ ఇద్దరి ప్రాణాలు ఎలా కాపాడిందో క్రింది కథనంలో చూద్దాం రండి...

బైక్ రైడర్‌ను ప్రాణాపాయం నుండి రక్షించిన ఏబిఎస్

శక్తివంతమైన బైకుల విక్రయాలు పెరిగేకొద్దీ, అందుకు సమానంగానే వాటి ద్వారా జరిగే ప్రమాదాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. సేఫ్టీ పరంగా చాలా బైకుల్లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తే, మరికొన్ని బైకుల్లో అస్సలు దాని ఊసేలేదు.

బైక్ రైడర్‌ను ప్రాణాపాయం నుండి రక్షించిన ఏబిఎస్

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన డామినర్ బైకులోని ఏబిఎస్‌ ఫీచర్ ఇద్దరు ప్రాణాలను కాపాడే వీడియో ఇందుకు ప్రధాన సాక్ష్యం. ఒక యువకుడు బజాజ్ డామినర్ బైకుపై అత్యధిక వేగంతో ఓ జాతీయ రహదారి మీద దూసుకెళుతున్నాడు.

బైక్ రైడర్‌ను ప్రాణాపాయం నుండి రక్షించిన ఏబిఎస్

ఒకానొక దశలో బజాజ్ డామినర్ గంటకు 140కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అయితే, అంతలోనే కొద్ది దూరంలో రోడ్డు ప్రక్కనున్న వ్యక్తి ఉన్నట్లుండి రోడ్డు దాటడానికి సడెన్‌గా రోడ్డు మధ్యలోకి వచ్చేశాడు.

బైక్ రైడర్‌ను ప్రాణాపాయం నుండి రక్షించిన ఏబిఎస్

రోడ్డు దాటుతున్న ఆ వ్యక్తిని గుర్తించిన రైడర్ సడెన్ బ్రేకులు వేశాడు. దీంతో కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే 140కిమీల వేగం 90కిమీలకు పడిపోయింది. బైకు వేగం ఒక్కసారిగా తగ్గిపోవడంతో రోడ్డు దాటుతున్న వ్యక్తిని త్రుటిలో తప్పించాడు.

బైక్ రైడర్‌ను ప్రాణాపాయం నుండి రక్షించిన ఏబిఎస్

హైస్పీడులో ఒక్కసారిగా బ్రేకులు ఏమవుతుందో మనందరికీ తెలిసిందే... అయితే, ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న వాహనాల్లో సడెన్ బ్రేకులు వేసినా కూడా వీల్స్ స్కిడ్ అయిపోవడం, చక్రాలు లాక్ అయ్యి బైకు పడిపోవడం వంటివి జరగవు.

బైక్ రైడర్‌ను ప్రాణాపాయం నుండి రక్షించిన ఏబిఎస్

ఏబిఎస్ బైకుల్లో సడెన్ బ్రేకులు వేయడంతో తారా స్థాయిలో ఉన్న వేగాన్ని కొన్ని క్షణాల వ్యవధిలోనే తగ్గించేస్తుంది. అధిక వేగంలో ఉన్నపుడు బయపడిపోయి హ్యాండిల్ లేదా స్టీరింగ్ ఎలా పడితే అలా తిప్పేయకూడదు. స్పీడ్ మరియు బ్రేకుల దృష్టిసారిస్తే బైకును కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు.

బైక్ రైడర్‌ను ప్రాణాపాయం నుండి రక్షించిన ఏబిఎస్

పబ్లిక్ రోడ్ల మీద ఇష్టానుసారంగా విపరీతమైన వేగంతో అస్సలు ప్రయాణించకూడదు. రోడ్డు ప్రక్కన భారీ వాహనాలను పార్క్ చేయడం, రోడ్డు నిరంతరం రద్దీగా ఉండటంతో అవాంతరాలు అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

బైక్ రైడర్‌ను ప్రాణాపాయం నుండి రక్షించిన ఏబిఎస్

అంతే కాకుండా, రోడ్డు దాటే సమయంలో రోడ్డుకు ఇరువైపులా వస్తూ పోయే వాహనాలను గమినిస్తూ దాటాలి. మూర్ఖంగా రోడ్డు దాటేటప్పుడు వాహనం నడుపుతున్న వ్యక్తి కూడా పరధ్యానంలో ఉంటే భారీ ప్రమాదం ఖాయం.

పవర్‌ఫుల్ బైకుల్లో యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ ప్రాముఖ్యత మరియు ఏబిఎస్ ఫీచర్ రైడర్ మరియు పాదచారుని ప్రాణాలను ఎలా కాపాడిందో చూద్దాం రండి....

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల ఎగ్జాస్ట్ పైపు నుండే వచ్చే శబ్దం రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికులు మరియు అభిమానులకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ ఇష్టం మరింత పెరిగి మోడిఫైడ్ సైలెన్సర్లతో వీధుల వెంబడి చక్కర్లుకొడితే వారికి ఇంకా మజా... కానీ, ఆ శబ్దం చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ తీవ్ర చిరాకును తెప్పిస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

ఇదే చిరాకు ట్రాఫిక్ పోలీసులకు వస్తే....? ఆ వస్తే....? ఇదిగో అలాంటి బైకుల సైలెన్సర్లు వారితోనే తీయించి, రోడ్డు మీద పరిచి రోడ్ రోలర్‌తో తొక్కిస్తారు. ఇవ్వన్నీ ఉత్తుత్తి కథలే అని పొరబడితే రేపు మీ బైక్‌కు కూడా ఇదే గతి పడుతుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

పూనే, మైసూర్, బెంగళూరు, హైదరాబాద్ మరియు కేరళలోని కొన్ని ప్రాంతాల్లోని ట్రాఫిక్ పోలీసులు అనధికారికంగా అమర్చుకున్న సైలెన్సర్లను తొలగిస్తున్నారు. తొలగించిన సైలెన్సర్లను ఎటూ పనికిరాకుండా చేయడంతో పాటు, జరిమానా కూడా విధిస్తున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 190(2) ప్రకారం, తయారీదారులు ఇచ్చిన సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దాన్నిచ్చే సైలెన్సర్ అమర్చుకున్నట్లయితే, వారు చట్టపరంగా శిక్షార్హులు. వారికి జరిమానాతో పాటు అలాంటి మోడిఫైడ్ సైలెన్సర్లను బైకు ఓనర్ల సమక్షంలోనే ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేయవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

తాజాగా, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అధిక శబ్దాన్నిచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల లౌడ్ సైలెన్సర్లను తొలగించారు. "ట్రాఫిక్ పోలీస్ స్పెషల్ స్క్వాడ్ 11 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను సీజ్ చేసి, వాటి సైలెన్సర్లను ధ్వంసం చేసి ఆ బైకుల ఓనర్లకు జరిమానా విధించినట్లు" బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు.

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

అనధికారిక సైలెన్సర్లను రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వాడితే ఏమవుతుందో అని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఫేస్‌బుక్స్ మాధ్యమంలో కొన్ని ఫోటోలు మరియు వీడియోను రివీల్ చేశారు. తొలగించిన అన్ని సైలెన్సర్లను రోడ్డు మీద పరిచి రోడ్ రోలరుతో తొక్కించారు.

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

తొలగించిన సైలెన్సర్లు, అనధికారికంగా వినియోగించే హారన్‌లు మరియు మోడిఫైడ్ నెంబర్ ప్లేట్లను ఏం చేస్తారు అని ప్రశ్నించిన వారికి.... ఇదిగో ఇలా రోడ్ రోలర్‌తో తొక్కించేస్తామని అధికారులు సమాధానం ఇచ్చారు.

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

బిగ్గరగా శబ్దం చేసే లౌడ్ సైలెన్సర్లను ఫిక్స్ చేసుకుని రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను నడపడంతో వచ్చే శబ్దం చిన్న పిల్లలు, పెద్దవాళ్లు మరియు జంతు పక్షులకు కూడా తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల నుండే వచ్చే శబ్దం స్టేటస్‌కు సింబల్‌గా భావించే ఆలోచన మానేయడం బెటర్.

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

శబ్దం కాలుష్యం ఎందుకు మంచిది కాదు శబ్దం కాలుష్యం మానవ మరియు జంతు అవయవ పనితీరు మీద తీవ్ర దుష్ప్రవాన్ని చూపుతుంది. ఎక్కువ డెసిబల్ గల శబ్దం హృదయం మరియు మానవులలో స్పందనకు సంభందిచిన అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

మోడిఫైడ్ సైలెన్సర్లతో బైకులను నడపడం మానవులు, జంతువులు మరియు పర్యావరణంతో పాటు ఆ బైకు కూడా ఇబ్బందులపాలవుతుంది. ఉద్గార స్థాయిలను అర్థం చేసుకుని వాటికి అనుగుణమైన సైలెన్సర్లను ప్రత్యేకంగా పరీక్షించి అభివృద్ది చేసారు. ఇలా సైలెన్సర్లను మార్చడం వలన గాలి కాలుష్యం, తక్కువ పికప్, మైలేజ్ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

Read more on: #abs #ఏబిఎస్
English summary
Read In Telugu: abs braking system saved bike rider from terrible mishap

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark