ఏప్రిల్ 1 నుండి 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి గల బైకులకు కొత్త రూల్స్!!

Written By:

దేశవ్యాప్తంగా రోజు రోజుకీ ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందులో ద్విచక్ర వాహన ప్రమాదాలే అధికం. టూ వీలర్ల ప్రమాదాలను నివారించడానికి అతి కీలకమైన సేఫ్టీ ఫీచర్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1, 2018 నుండి 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి ఉన్న బైకులకు కేంద్రం కొత్త రూల్స్ అమలు చేయనుంది.

ఏప్రిల్ 1 2018 నుండి అన్ని బైకుల్లో ఏబిఎస్

ఏప్రిల్ 1, 2017 నుండి బిఎస్-3 ఇంజన్‌లు ఉన్న బైకుల విక్రయాలను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏప్రిల్ 1, 2018 నుండి 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటీతో విడుదలయ్యే ప్రతి బైకు మరియు స్కూటర్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 1 2018 నుండి అన్ని బైకుల్లో ఏబిఎస్

టూ వీలర్ల ద్వారా జరిగే ప్రమాదాలను తగ్గించడంలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎంతో చక్కగా పనిచేస్తోంది. ఈ టెక్నాలజీ ఉన్న బైకుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం దాదాపు తక్కువ. బైకులు మరియు స్కూటర్లను రైడ్ చేసే వారికి కూడా ఎంతో మేలు కలిగిస్తుంది.

ఏప్రిల్ 1 2018 నుండి అన్ని బైకుల్లో ఏబిఎస్

టూ వీలర్ల సేఫ్టీలో అత్యంత కీలకమైన ఫీచర్‌ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్. నిజానికి, ఇది అత్యంత ఖరీదైన బైకుల్లో మాత్రమే వస్తోంది. ఓ మోస్తారు స్పోర్ట్స్ మరియు క్రూయిజర్ బైకుల్లో అప్షనల్‌ ఫీచర్‌గా మాత్రమే లభిస్తోంది.

ఏప్రిల్ 1 2018 నుండి అన్ని బైకుల్లో ఏబిఎస్

కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు, ఏప్రిల్ 1, 2018 నుండి 125సీసీ కంటే ఎక్కువ సామర్థ్యంతో విడుదలయ్యే ప్రతి బైకు మరియు స్కూటర్‌లో కూడా ఖచ్చితంగా ఏబిఎస్ టెక్నాలజీ ఉండాలి. ఒకవేళ లేకపోతే, అలాంటి బైకులను రిజిస్ట్రేషన్ కూడా చేయరు.

ఏప్రిల్ 1 2018 నుండి అన్ని బైకుల్లో ఏబిఎస్

ఇక్కడ ప్రదానంగా గుర్తించాల్సిన సంగతి, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు, ఏప్రిల్ 1, 2018 తరువాత 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటితో విపణిలోకి కొత్తగా విడుదలయ్యే ప్రతి బైకులో ఏబిఎస్ ఖచ్చితంగా ఉండాలి. కానీ, ఇది వరకే విడుదలయిన బైకుల్లో ఏబిఎస్ లేకపోయినా వాటి రిజిస్ట్రేషన్ జరుగుతాయి.

ఏప్రిల్ 1 2018 నుండి అన్ని బైకుల్లో ఏబిఎస్

ఈ నిర్ణయం ఒక రకంగా టూ వీలర్ల తయారీ సంస్థలకు బాగా కలిసొస్తుంది. ఎందుకంటే చాలా కంపెనీలు ఇప్పటికే 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి ఉన్న టూ వీలర్లను విడుదల చేసేశాయి. ఏప్రిల్ 1 తరువాత విడుదల చేస్తే ఏబిఎస్ తప్పనిసరి కాబట్టి, దానికి ముందే విడుదల చేస్తే ఏబిఎస్ లేకుండానే విక్రయించవచ్చు.

ఏప్రిల్ 1 2018 నుండి అన్ని బైకుల్లో ఏబిఎస్

ఏప్రిల్ 1, 2018 తరువాత లభించే ప్రతి 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి ఉన్న టూ వీలర్లలో ఏబిఎస్ తప్పనిసరి చేయకుండా, ఆ తరువాత విడుదలయ్యే బైకుల్లో మాత్రమే ఏబిఎస్ ఉండాలని తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరదు.

ఏప్రిల్ 1 2018 నుండి అన్ని బైకుల్లో ఏబిఎస్

ఎందుకంటే, ఏప్రిల్ 2018 తరువాత విపణిలో లభించే కొన్ని బైకుల్లో ఏబిఎస్ ఉంటుంది మరికొన్ని వాటిలో ఉండదు. అంటే ప్రస్తుతం ఉన్న పల్సర్ 150, అవెంజర్ సిరీస్, యమహా ఎఫ్‌జడ్, హోండా సిబి హార్నెట్ 160ఆర్ వంటి ఎన్నో బైకులు ఏబిఎస్ లేకుండా విక్రయించుకోవచ్చు. కానీ, ఇక మీదట విడుదలయ్యే ప్రతి 125సీసీ కెపాసిటి కంటే ఎక్కువ ఉన్న బైకుల్లో ఏబిఎస్ తప్పనిసరి చేసింది. కాబట్టి, కేంద్రం ఈ నిర్ణయాన్ని సవరించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

ఏప్రిల్ 1 2018 నుండి అన్ని బైకుల్లో ఏబిఎస్

ప్రపంచ దేశాల్లో తప్పనిసరిగా వచ్చిన ఏబిఎస్ ఫీచర్ మన దేశంలో ఇప్పటికీ ఖరీదైన బైకుల్లో మరియు కొన్ని బైకుల్లో ఎక్కువ డబ్బు చెల్లిస్తే ఆప్షనల్ ఫీచర్‌గా మాత్రమే లభిస్తోంది.

అసలు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? బైకుల్లో అది ఎలా పనిచేస్తుంది? ఏబిఎస్ ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాల కోసం...

English summary
Read In Telugu: ABS Technology Mandatory For Bikes From April 1
Story first published: Saturday, March 17, 2018, 17:43 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark