పేటిఎమ్ యాప్‌లో అమ్మకానికి అప్రిలియా ఎస్ఆర్ 125: ప్రయోజనాలెన్నో!!

Written By:
Recommended Video - Watch Now!
New Honda Activa 5G Walkaround, Details, Specifications, First Look

ఇటాలియన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం అప్రిలియా సంస్థ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త ఎస్ఆర్ 125 స్కూటర్‌ను విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో హోండా గ్రాజియా మరియు టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్లకు పోటీగా వచ్చిన స్టైలిష్ స్కూటర్ అప్రిలియా ఎస్ఆర్ 125 ధర రూ. 65,310 లు ఎక్స్-షోరూమ్(పూనే)గా ఉంది.

పేటిఎమ్ యాప్‌లో అప్రిలియా ఎస్ఆర్ 125

అప్రిలియా ఇండియా విభాగం ఇప్పుడు సరికొత్త ఎస్ఆర్ 125 పర్ఫామెన్స్ స్కూటర్‌ను పేటిఎమ్ మొబైల్ యాప్ ద్వారా విక్రయాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతే కాకుండా పేటిఎమ్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 5,000 లు వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.

పేటిఎమ్ యాప్‌లో అప్రిలియా ఎస్ఆర్ 125

పేటిఎమ్ ద్వారా అప్రిలియా ఎస్ఆర్ ఎంచుకునే కస్టమర్లు తమ పేరు, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్ మరియు పిన్ కోడ్‌తో సహా నివశించే నగరం వంటివి వివరాలను అందించాలి. ఈ వివరాలు నమోదు చేస్తే పేటిఎమ్ పేటిఎమ్ మాల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో కస్టమర్ ఏ డీలర్ నుండి కొనుగోలు చేయాలనుకుంటే ఆ డీలర్ మరియు సిటీ వివరాలు నమోదు చేయాలి.

పేటిఎమ్ యాప్‌లో అప్రిలియా ఎస్ఆర్ 125

'BIKE85000' ప్రోమో కోడ్ ఉపయోగించడం ద్వారా కస్టమర్ రూ. 5,000 ల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అప్రిలియా ఎస్ఆర్ 125 బుక్ చేసుకున్న తరువాత డెలివరీ వివరాలు మరియు 15 నుండి 20 రోజుల్లో డెలివరీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.

పేటిఎమ్ యాప్‌లో అప్రిలియా ఎస్ఆర్ 125

అప్రిలియా గతంలో విడుదల చేసి సక్సెస్ అందుకున్న ఎస్ఆర్ 150 స్కూటర్ ఆధారంగా ఎస్ఆర్ స్కూటర్ల లైనప్‌లోకి 125సీసీ వెర్షన్ స్కూటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాంకేతికంగా అప్రిలియా ఎస్ఆర్ 125లో 9.46బిహెచ్‌పి పవర్ మరియు 9.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే సివిటి ట్రాన్స్‌మిషన్ ఉన్న 124సీసీ కెపాసిటి సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

పేటిఎమ్ యాప్‌లో అప్రిలియా ఎస్ఆర్ 125

ఎస్ఆర్ 125 స్కూటర్‌లో బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు రియర్ వీల్‌కు 140ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ కలదు. సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున సింగల్ స్ప్రింగ్ షాక్ అబ్జార్ ఉంది. 7-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి గల స్కూటర్ మొత్తం బరువు 122కిలోలుగా ఉంది.

పేటిఎమ్ యాప్‌లో అప్రిలియా ఎస్ఆర్ 125

పైన పేర్కొన్నట్లుగానే అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్‌ 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో అత్యంత శక్తవంతమైనది. ఇదే సెగ్మెంట్లో ఉన్న హోండా గ్రాజియా 8.5బిహెచ్‌పి పవర్ మరియు 10.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్ 9.27బిహెచ్‌పి పవర్ మరియు 10.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

పేటిఎమ్ యాప్‌లో అప్రిలియా ఎస్ఆర్ 125

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అప్రిలియా కంపెనీ ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం పేటిఎమ్‌తో చేతులు కలిపి యువ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ భాగస్వామ్యం అప్రిలియా సంస్థ డిజిటల్ వ్యాపార సామ్రాజ్యంలో రాణించడానికి తోడ్పడనుంది.

కస్టమర్ విషయానికి వస్తే, కావాల్సిన స్కూటర్ కోసం షోరూమ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా పేటిఎమ్ నుండి కొనుగోలు చేస్తారు కాబట్టి 5,000 రుపాయల తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా...? అయితే, పేటిఎమ్ ద్వారా ఎంచుకొని ఈ ఆఫర్ ద్వారా లభించే ప్రయోజనాలను పొందండి. మరిన్ని వివరాల కోసం...www.apriliasr.in

English summary
Read In Telugu: Aprilia SR 125 Bookings Open On Paytm App: Cashback Offer, Delivery Status, Price, Specs & Features
Story first published: Monday, February 26, 2018, 17:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark