సుజుకి ఇంట్రూడర్ బైకును ఎదుర్కునేందుకు బజాజ్ మరో ఎత్తుగడ

Written By:

బజాజ్ ఆటో ఇండియా సరికొత్త 2018 అవెంజర్ సిరీస్ బైకులను పరిచయం చేయడానికి సిద్దమైంది. అయితే, ఈ నేపథ్యంలో తమ అవెంజర్ సిరీస్ లైనప్‌లో ఉన్న అవెంజర్ 150 బైకును తొలగిస్తున్నట్లు థ్రస్ట్ జోన్ పత్రిక వెల్లడించింది.

బజాజ్ అవెంజర్ 180

2018 ఫిబ్రవరిలో బజాజ్ తమ అవెంజర్ 150 బైకును శాశ్వతంగా మార్కెట్ నుండి తొలగించనుంది. దీని స్థానంలో సరికొత్త 2018 అవెంజర్ 180 బైకును ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. సుజుకి మోటార్స్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తాజాగా విడుదల చేసిన ఇంట్రూడర్ 150 క్రూయిజర్ బైక్‌కు పోటీగా దీనిని ప్రవేశపెడుతున్నట్లు తెలిసింది.

Recommended Video - Watch Now!
Why Doesn't A Plane's Tyre Burst While Landing - DriveSpark
బజాజ్ అవెంజర్ 180

అప్ కమింగ్ బజాజ్ అవెంజర్ 180 బైకు సరికొత్త డిజైన్ రూపాన్ని మరియు ఎన్నో కొత్త ఫీచర్లతో ఇది వరకు లభించే అవెంజర్ 150 బైకుతో పోల్చుకుంటే విభిన్నంగా రానుంది. అవెంజర్ 180 బైకు ఇంట్రూడర్ 150 మీద ఆధిపత్యాన్ని సాధించేందుకు బజాజ్ పల్సర్ 180లో ఉన్న ఇంజన్‌తో రానుంది.

బజాజ్ అవెంజర్ 180

అవెంజర్ 180లో పరిచయం చేయనున్న 178.2సీసీ కెపాసిటి గల గాలి/ఆయిల్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ 17బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అవెంజర్ 150 ఉత్పత్తి చేసే 14.3బిహెచ్‌పి మరియు 12.5ఎన్ఎమ్ తో పోల్చుకుంటే అవెంజర్ 180 అధిక పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ పరంగా 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.

బజాజ్ అవెంజర్ 180

ఇంజన్ జోడింపు మరియు స్వల్ప మెకానికల్ మార్పలు మినహాయిస్తే, మిగతా అంశాల పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. సరికొత్త అవెంజర్ 180 బైకులో రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, సింగల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఎల్ఇడి లైట్లు వంటి ఫీచర్స్ ఇందులో రానున్నాయి.

ట్రెండింగ్ స్టోరీస్:

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ కార్లలో ఏది బెస్ట్ ?

ఈ 5 సేఫ్టీ ఫీచర్లు లేని కార్లను అస్సలు ఎంచుకోవద్దు!

ఏ/సి వాడకం కారు మైలేజ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

బజాజ్ అవెంజర్ 180

ధర విషయానికి వస్తే, బజాజ్ అవెంజర్ 180 ధర సుజుకి ఇంట్రూడర్ 150 కంటే తక్కువగా ఉండేట్లు బజాజ్ జాగ్రత్త వహిస్తోంది. ప్రస్తుతం బజాజ్ అవెంజర్ 150 ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 81,459 లుగా ఉంది. దీని స్థానంలోకి రానున్న అవెంజర్ 180 ధర రూ. 5,000 లు ఎక్కువగా ఉండనుంది.

బజాజ్ అవెంజర్ 180

సుజుకి ఇంట్రూడర్ 150 ధర రూ. 98,340 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. ధర పరంగా అవెంజర్ 180 మరియు ఇంట్రూడర్ 150 మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఇంజన్ విషయం ప్రక్కన పెడితే, ఇంట్రూడర్ విభిన్న డిజైన్ శైలికి దాని ధర న్యాయం చేస్తోందని చెప్పవచ్చు.

బజాజ్ అవెంజర్ 180

మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం బజాజ్‌కు కొత్తేమీ కాదు. ఎందుకంటే గతంలో కవాసకి ఎలిమినేటర్ 175 బైకును మార్కెట్ నుండి తొలగించినపుడు, ఇండియన్ టూ వీలర్ దిగ్గజం బజాజ్ అవెంజర్ 180 బైకును లాంచ్ చేసింది. ఇప్పుడు ఇంట్రూడర్ మీద పోటీ కోసం ఆధునిక సొబగులతో రీలాంచ్‌కు యత్నిస్తోంది.

బజాజ్ అవెంజర్ 180

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి ఇండియన్ మార్కెట్లోకి గత ఏడాది ఇంట్రూడర్ 150 బైకును లాంచ్ చేసింది. ఇదివరకెన్నడూ పరిచయం కాని డిజైన్‌లో తమ ఎంట్రీ లెవల్ క్రూయిజర్ బైకును ధరకు తగ్గ విలువలతో ప్రవేశపెట్టింది. ఇది అప్పటికే విపణిలో ఉన్న బజాజ్ అవెంజర్ 150కు గట్టి పోటీగా నిలవడంతో బజాజ్ ఇప్పుడు అవెంజర్ 180 బైకును విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. అయితే, బజాజ్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో తెలియాలంటే అవెంజర్ 180 విడుదలయ్యేంత వరకు వేచిచూడాల్సిందే...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Bajaj’s New Avenger 180 Is Coming to Take On The Suzuki Intruder 150

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark