బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్ విడుదల వివరాలు లీక్

శీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం బజాజ్ సరికొత్త అవెంజర్ 180 స్ట్రీట్ బైకును విడుదలకు సిద్దం చేసినట్లు తెలిసింది. బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్ గురించి మరిన్ని వివరాల కోసం....

By Anil

బజాజ్ ఆటో ఇటీవల సరికొత్త 2018 ఎడిషన్ అవెంజర్ 220 క్రూయిజర్, అవెంజర్ 220 స్ట్రీట్ మరియు అవెంజర్ 150 స్ట్రీట్ బైకులను విపణిలోకి విడుదల చేసింది. బజాజ్ ఆటో వీటితో పాటు సరికొత్త అవెంజర్ 180 స్ట్రీట్ బైకును పరిచయం చేస్తుందని డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇది ఓ కథనంలో పేర్కొంది.

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం బజాజ్ సరికొత్త అవెంజర్ 180 స్ట్రీట్ బైకును విడుదలకు సిద్దం చేసినట్లు తెలిసింది. బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్ గురించి మరిన్ని వివరాల కోసం....

బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్

బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్ మోటార్ సైకిల్ మరికొన్ని వారాల్లో పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది. అవెంజర్ 180 స్ట్రీట్ వేరియంట్ ధర రూ. 83,987 లు ఎక్స్-షోరూమ్(బెంగళూరు)గా ఉండే అవకాశం ఉంది.

Recommended Video

Honda XBlade First Look Walkaround, Specs, Details, Features - DriveSpark
బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్

డిజైన్ పరంగా అవెంజర్ సిరీస్ బైకులనే పోలి ఉన్నప్పటికీ, క్రూయిజ్ 220సీసీ తరహా డిజైన్ సొబగులు ఇందులో రావడం లేదు. తాజాగా విపణిలోకి విడుదల చేసిన అవెంజర్ 150 డిజైన్ లక్షణాలతో అవెంజర్ 180 స్ట్రీట్ రానుంది.

బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్

అవెంజర్ 150 స్ట్రీట్ తరహా సరికొత్త రోడ్‌స్టర్ డిజైన్ హెడ్‌ల్యాంప్, పగటి పూట వెలిగే ఎల్ఇడి ల్యాంప్ మరియు హెడ్ ల్యాంప్ మీద గిన్నెలాంటి ఆకారం ఉంది. అవెంజర్ క్రూయిజర్ 220తో పోల్చుకుంటే చిన్న పరిమాణంలో ఉన్న హ్యాండిల్ బార్ ఉంది.

బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్

అవెంజర్ 180 స్ట్రీట్ బైకులో అల్లాయ్ వీల్స్, సరికొత్త పిలియన్ గ్రాబ్ రెయిల్, మరియు ఇతర అవెంజర్ బైకులతో పోల్చితే విభిన్నంగా ఉండేందుకు సరికొత్త బాడీ గ్రాఫిక్స్, డీకాల్స్ మరియు నూతన పెయింట్ స్కీమ్‌లో రానుంది.

బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్

ఫీచర్ల విషయానికి వస్తే, అవెంజర్ 180లో దాదాపు అవెంజర్ 150లో ఉన్న ఫీచర్లు రానున్నాయి. ఇందులో సరికొత్త డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, నూతన ఎగ్జాస్ట్ మఫ్లర్ మరియు రీడిజైన్ చేయబడిన సీటువంటివి రానున్నాయి.

బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్

అవెంజర్ 180 స్ట్రీట్ మోటార్ సైకిల్‌ ధరను అత్యంత పోటీతత్వముతో, విలువలకు తగ్గ ధరతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బజాజ్ అవెంజర్ 180 విడుదలతో అవెంజర్ 150 బైకును మార్కెట్ నుండి శాశ్వతంగా తొలగిస్తుందనే ఆధారం లేని వార్త ఉంది.

బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్

సాంకేతికంగా బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్ మోటార్ సైకిల్‌లో బజాజ్ లైనప్‌లో ఉన్న 180సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 17బిహెచ్‌పి పవర్ మరియు 14.22ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ అవెంజర్ 180 స్ట్రీట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ సెగ్మెంట్లో కీలకమైన ఉత్పత్తిని ప్రవేశపెట్టే ఉద్దేశ్యంతో బజాజ్ ఆటో సరికొత్త అవెంజర్ 180 స్ట్రీట్ బైకును సిద్దం చేసింది. అవెంజర్ సిరీస్‌లోని 150సీసీ బైకు అవసరానికి తగిన విధంగా పవర్ మరియు టార్క్ ఇవ్వలేదనే అపవాదం మీద వేసుకుంది. దీంతో మార్కెట్లో పట్టు సడలకుండా ఉండేందుకు అవెంజర్ 180 స్ట్రీట్‌ను ప్రవేశపెట్టనుంది.

సరికొత్త బజాజ్ 180 స్ట్రీట్ విపణిలో ఉన్న సుజుకి ఇంట్రూడర్ 150 మరియు కొత్తగా విడుదలైన యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ ఎస్ మరియు రెనిగేడ్ డ్యూటీ ఏస్ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: BikeWale

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Avenger 180 Street India Launch Details Revealed; Expected Price & Features
Story first published: Thursday, February 15, 2018, 18:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X