భారతదేశపు చీపెస్ట్ బైకు మీద మరింత తగ్గిన ధరలు

Written By:

దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ చీపెస్ట్ మోటార్ సైకిల్ బజాజ్ సిటి100 మీద ధర తగ్గించింది. దీంతో, భారతదేశపు చీపెస్ట్ కమ్యూటర్ మోటార్ సైకిల్ ఇప్పుడు నమ్మశక్యంగానీ మరింత తక్కువ ధరకే లభిస్తోంది.

బజాజ్ సిటి100 మీద తగ్గిన ధరలు

బజాజ్ సిటి100 సేల్స్ పరంగా బాగా రాణిస్తున్నప్పటికీ, ఈ మోడల్ నుండి బజాజ్ ఆటోకు పెద్దగా ఆదాయమేమీ రావడం లేదు. పూనే ఆధారిత బజాజ్ ఆటో ఇటీవల తమ ఎంట్రీ లెవల్ మోటార్ సైకిల్ సిటి100లో సరికొత్త ప్లాటినా ఇంజన్, ఎలక్ట్రిక్ స్టార్ట్ మరియు అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో గత ఏడాది రీఫ్రెష్డ్ వెర్షన్‌లో లాంచ్ చేసింది.

బజాజ్ సిటి100 మీద తగ్గిన ధరలు

బజాజ్ అఫీషియల్ వెబ్‌సైట్ ప్రకారం, బజాజ్ సిటి100 అత్యంత తక్కువ ధరతో లభ్యమవుతోంది. దీని ధర రూ. 32,653లు ఉండగా, దీనికి పోటీగా ఉన్న ఇతర మోడళ్ల ధరలు రూ. 41,997లతో ప్రారంభమవుతున్నాయి.

బజాజ్ సిటి100 మీద తగ్గిన ధరలు

ప్రస్తుతానికి, విపణిలో అత్యంత సరసమైన మోటార్ సైకిల్‌లో నిలిచిన బజాజ్ సిటి100 ధరలో బజాజ్ ఇప్పుడు కోత విధించింది. సెకండ్ హ్యాండ్ బైకుల ధరలోనే సిటి100 లభిస్తోంది. ఏదేమైనప్పటికీ, ఈ ధరల తగ్గింపుతో సిటి100 సేల్స్ పుంజుకోనున్నాయి.

బజాజ్ సిటి100 మీద తగ్గిన ధరలు

బజాజ్ సిటి100 వేరియంట్ల పాత మరియు కొత్త ధరలతో పాటు తగ్గించబడిన ధరల వివరాలు క్రింది పట్టిక ద్వారా గమనించవచ్చు. గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

Model Older Price New Price Reduction
CT100B Rs 32,653 Rs 30,714 Rs 1939
CT100 KS Alloy Rs 38,637 Rs 31,802 Rs 6835
CT100 ES Alloy Rs 41,997 Rs 39,885 Rs 2112
బజాజ్ సిటి100 మీద తగ్గిన ధరలు

బజాజ్ సిటి100 మిడ్ వేరియంట్ మీద గరిష్టంగా రూ. 6,000 ల వరకు ధర తగ్గింది. ప్రారంభ వేరియంట్ మరియు మిడ్ వేరియంట్ మధ్య వ్యత్యాసం కేవలం వెయ్యి రుపాయలు మాత్రమే. పై ధరల పట్టికలో సిటి100 పాత ధరలు మరియు కొత్త ధరలు బజాజ్ అధికారిక వెబ్‌సైట్ నుండి సేకరించి ఇవ్వడం జరిగింది.

బజాజ్ సిటి100 మీద తగ్గిన ధరలు

బజాజ్ సిటి100 కమ్యూటర్ మోటార్ సైకిల్‌లో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇందులోని 99.27సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 8.10బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.బజాజ్ ప్రకటన మేరకు, దీని గరిష్ట మైలేజ్ లీటర్‌కు 89కిమీలుగా ఉంది.

బజాజ్ సిటి100 మీద తగ్గిన ధరలు

1.రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

2. ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం ఊహించని నిజాలు

3. 20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

4. రాంగ్ పార్కింగ్ చేశాడని 3 కోట్లు ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేశారు

Source: BikeAdvice

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Bajaj CT100 Price Cut

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark